భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తూటాల మోత మోగింది. పోలీసుల కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. కరకగూడెం అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసు బలగాలకు, మావోయిస్టులకు కాల్పులు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. దీంతో సరిహద్దు జిల్లాల గ్రామాల ప్రజలు భయం గుప్పెట్లో ఉన్నారు. మృతిచెందిన మావోయిస్టులు లచ్చన్న దళంకు చెందినవారిగా గుర్తించారు. ముగ్గురు గ్రేహౌండ్స్ పోలీసులు గాయపడ్డారు.
కాగా, ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ –బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 9 మంది మావోయిస్టులు మృతి చెందారు. దంతెవాడ జిల్లా లోహాగావ్, పురంగేల్ అడవుల్లో ఆండ్రి గ్రామం వద్ద 40 మంది వరకు మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందడంతో సీఆర్‌పీఎఫ్, డీఆర్‌జీ దళాల జవాన్లు కూంబింగ్ చేపట్టారు.
ఇరువర్గాల మధ్య మొదలైన ఎదురుకాల్పులు దాదాపు మూడు గంటలపాటు సాగాయి. అనంతరం బలగాలు ఘటనా స్థలిలో పరిశీలించగా ఆరుగురు మహిళలు సహా 9 మంది మావోయిస్టులు చనిపోయినట్టు తేలింది. వీరిని దక్షిణ బస్తర్, పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కంపెనీ–2కు చెందిన వారిగా భావిస్తున్నారు. ఘటనాస్థలిలో ఎస్‌ఎల్‌ఆర్, 303 రైఫిల్, 12 బోర్ రైఫిల్, 315 బోర్‌గన్లతోపాటు బారెల్ గన్ లాంఛర్లు ఒక్కొక్కటి చొప్పున దొరికాయి.
Comments
Please login to add a commentAdd a comment