పాల్వంచ: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ విజయాన్ని కాంక్షిస్తూ శ్రీరాజ శ్యామలాంబ సుదర్శన మహాయజ్ఞం నిర్వహించారు. ఆమె తల్లి శ్యామలా గోపాలన్ పేరుతో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఈ మహాయజ్ఞం నిర్వహించారు. 11 రోజుల కిందట ప్రారంభమైన ఈ యజ్ఞం బుధవారం పూర్ణాహుతితో ముగిసింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఎలాగైనా కమలా హారిస్ గెలవాలనే ఆకాంక్షతో ఈ యజ్ఞం నిర్వహించినట్లు సొసైటీ చైర్మన్ నల్లా సురేశ్‌రెడ్డి తెలిపారు. తాను కొంతకాలం అమెరికాలో పని చేశానని, ఆ సమయంలో సెనేటర్‌గా ఉన్న కమలా హారిస్‌ను కలిశానని చెప్పారు. భారతీయ మూలాలు కలిగిన ఆమె తల్లి శ్యామలా గోపాలన్ గురించి తెలుసుకుని ఆమె పేరుతో పాల్వంచలో ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించామని ఆయన వెల్లడించారు.
కాగా, యజ్ఞం ముగింపు సందర్భంగా 40 మంది వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ పూర్ణాహుతి వేడుకను ఘనంగా నిర్వహించామని, భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. త్వరలో కమలా హారిస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని, ఈ కార్యక్రమానికి అమెరికా నుంచి ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.
తిరునక్షత్ర మహోత్సవానికి రండి: సీఎం, డిప్యూటీ సీఎంలకు ఆహ్వానం
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ శివారులో సమతాస్ఫూర్తి కేంద్రంలో నవంబర్ 1 నుంచి జరగనున్న శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి తిరునక్షత్ర మహోత్సవానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను నిర్వాహకులు ఆహ్వానించారు. హైదరాబాద్‌లోని శ్రీ అహోబిల జీయర్ స్వామి బుధవారం వీరద్దరిని కలిసి ఈ మేరకు ఆహ్వాన పత్రికలు అందజేశారు.
చదవండి: ఎంబీబీఎస్ పూర్తయ్యే వరకు చదివిస్తా.. పేద విద్యార్థినికి మంత్రి కోమటిరెడ్డి అండ
Comments
Please login to add a commentAdd a comment