భద్రాచలంలో ‘బాహుబలి’ బేబీ | Baby Weighs 5 kg at Birth in Bhadradri Kothagudem District | Sakshi
Sakshi News home page

భద్రాచలంలో ‘బాహుబలి’ బేబీ

Published Thu, May 5 2022 8:07 PM | Last Updated on Thu, May 5 2022 8:07 PM

Baby Weighs 5 kg at Birth in Bhadradri Kothagudem District - Sakshi

భద్రాచలంఅర్బన్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఓ మహిళ.. బేబీ బాహుబలికి మంగళవారం జన్మనిచ్చింది. ఈ విషయాన్ని వైద్యులు బుధవారం మీడియాకు వెల్లడించారు. అప్పుడే పుట్టిన పిల్లలు సాధారణంగా 2.3 కేజీల నుంచి 3.7 కేజీల వరకు బరువుంటారు.

కానీ, ఈ పాప ఏకంగా 5 కేజీల బరువుంది. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్‌ సాకేత తెలిపారు. దుమ్ముగూడెం మండలం దబ్బనుతాళం గ్రామానికి చెందిన గంగా భవానీ ఈనెల 2న ఆస్పత్రిలో చేరగా మంగళవారం సిజేరియన్‌ చేశారు.  (క్లిక్: వస్తామన్న బస్సు రానే వచ్చింది.. ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement