
తుమ్మలవాగులో కొట్టుకుపోతున్న బైక్‌ను బయటకు తీస్తున్న స్థానికులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు భారీ వర్షం కురిసింది. రాత్రంతా వర్షం కురుస్తూనే ఉండడంతో పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద కారణంగా పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇక చాలాచోట్ల రహదారులపైకి వరద చేరడంతో ప్రజలు దాటేందుకు ఇక్కట్లు ఎదుర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment