Kinnerasani project
-
భారీ వర్షాల ఎఫెక్ట్.. టెన్షన్ పెడుతున్న మున్నేరు, పాలేరు
సాక్షి, ఖమ్మం: గత కొద్ది రోజులుగా తెలంగాణలో ఎడతెరిపిలేని వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో చెరువులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, రోడ్లు తెగిపోయాయి. రోడ్డు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో మున్నేరు తీవ్రరూపం దాల్చింది. వివరాల ప్రకారం.. మున్నేరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ప్రస్తుతం మున్నేరు నీటి మట్టం 19 అడుగులకు చేరుకుంది. ఈ క్రమంలో 18 అడుగులకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్. దీంతో, బ్రిడ్జిపై నుంచి వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఇదే సమయంలో అక్కడి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. నాయబజార్ కాలేజీ, స్కూల్‌తో పాటు ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఇదిలా ఉండగా.. ఖమ్మం జిల్లాలోని పాలేరు పూర్తి స్థాయిలో నిండిపోయింది. పాలేరు రిజర్వాయర్ నీటి మట్టం పూర్తి స్థాయిలో 23 అడుగులకు చేరుకుంది. ప్రస్తుత నీటి మట్టం 23.25గా ఉన్నట్టు తెలుస్తోంది. పాలేరుకు ప్రస్తుత ఇన్ ఫ్లో 12,438 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 10, 614 క్యూసెక్కులుగా ఉంది. మరోవైపు.. రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు సత్తుపల్లి జేవీఆర్, కిష్టారం ఓపెన్ కాస్ట్‌లలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జేవీఆర్ ఓసీలో 60 వేల టన్నులు, కిష్టారం ఓసీలో 16 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. పాలేరు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం : 23 అడుగులు ప్రస్తుత నీటిమట్టం : 23.5 బేతుపల్లి పెద్దచెరువు పూర్తిస్థాయి నీటిమట్టం : 16 అడుగులు ప్రస్తుత నీటిమట్టం : 16.1 పెదవాగు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం : 19 అడుగులు ప్రస్తుత నీటిమట్టం : 11 కిన్నెరసాని రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం : 407 అడుగులు (8.4 టీఎంసీలు) ప్రస్తుత నీటిమట్టం : 402.2 అడుగులు (7.85 టీఎంసీలు) తాలిపేరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం : 74 మీటర్లు ప్రస్తుత నీటిమట్టం : 72.11 మీటర్లు -
అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతోన్నకిన్నెరసాని ప్రాజెక్ట్ పరిసరాలు
-
అభయారణ్యంలో మినీ ఊటి..!
కొత్తగూడెం అర్బన్: ఏజెన్సీ జిల్లాగా పేరున్న భద్రాద్రి కొత్తగూడెంలోని అభయారణ్యంలో మినీ ఊటిని తలపిస్తున్న కిన్నెరసానీ ప్రాజెక్టు పర్యటక ప్రాంతం జిల్లాకే మంచి గుర్తింపును ఇస్తుంది. అక్కడ అభయారణ్యంలో రోడ్డుకు ఇరువైపులా పచ్చటి చెట్లు, చెట్లలో వంద రకాల పక్షులు, జంతువులు, పులులు, చిరుతలు, అడవిదున్నలు, ఎలుగుబంట్లు, కొండగొర్రెలు, నక్కలు, కణుజులు, కోతులు, కొండముచ్చులున్నాయి. వన్యప్రాణులు, జంతువులు జీవ వైవిద్యానికి నిలయం కిన్నెరసానీ ప్రాజెక్టు. జింకల పార్కు 14.50 హెక్టార్ల విస్తీరణంలో ఉండగా, అభయారణ్యం 634.4 చ.కి.మీ విస్తీరణంలో ఉంది. జింకల పార్కు వద్ద పర్యాటకుల సందడి అయితే 1963–64 సంవత్సరంలో నిర్మాణం అయిన కిన్నెరసానీ ప్రాజెక్టు నుంచి నీరు పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీ ప్రజలు తాగునీరుగా ఉపయోగిస్తున్నారు. దీంతో పాటుగా 10 వేల ఎకరాల పంటల పొలాలకు నీరును ఎడమ, కుడి కాల్వల ద్వారా అందిస్తుంది. అయితే ప్రాజెక్టు వద్ద 1972 సంవత్సరంలో అభయారణ్యం ప్రాంతంను పర్యటక ప్రాంతంగా టూరిజం వారు గుర్తించి అభివృద్ధి చేశారు. 1974 సంవత్సరంలో ఇక్కడ జింకల పార్కును ఏర్పాటు చేశారు. తొలుత 3 జింకలతో ఏర్పాడిన పార్కు, ప్రస్తుతం 132 జింకలతో సందర్శకులను ఆకట్టుకుంటుంది. ఇందులో కృష్ణ జింకలు, చుక్కల దుప్పులు, కొండ గొర్రెలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. కిన్నెరసాని ప్రాజెక్టు అయితే తొలుత సింగరేణి ఆదీనంలో ఉన్న ఈ పర్యటక ప్రాంతం 2000 సంవత్సరం తరువాత వైల్డ్‌లైప్ వారి అప్పగించారు. అయితే ఇక్కడ ఉన్న అద్దాల మెడ ప్రత్యేక ఆకర్షణగా ఉండేది. అయితే 1999 సంవత్సరంలో ఫిపుల్స్ వారు దీనిని పేల్చివేశారు. అయితే ప్రస్తుతం అద్దాల మెడా, కాటేజ్‌ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇవి పూర్తి అయితే మరింతా మంది సందర్శకుల సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టు, జింకల పార్కు, బొటింగ్ కోసం వారానికి పది వేల మంది వరకు సందర్శకులు అంతర్ రాష్ట్రల నుంచి వస్తున్నారు. జింకల పార్కు దృశ్యం అద్దాల మెడ, కాటేజ్‌లు పూర్తి అయితే సందర్శకులు, పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం కెటీపిఎస్ అధికారులు రిజర్వాయర్ ప్రారంభంలో జలదృశ్యం(విశ్రాంతి గది) ఏర్పాటు చేశారు. అది మాత్రం మనుగడలో ఉంది. అయితే తెలుగు రాష్ట్రలలలో మొసళ్లు మోరె జాతి (నల్లవి) వేల సంఖ్యలో కిన్నెరసానీ ప్రాజెక్టులో ఉన్నాయి. దీంతో పాటుగా కిన్నెరసానీలో బోటింగ్ ప్రతి రోజు ఉంటుంది. ప్రాజెక్టు చూడడానికి వచ్చిన ప్రతి వారు బోటింగ్ చేయకుండా వెళ్లారు. -
భద్రాద్రిలో పొంగిన వాగులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు భారీ వర్షం కురిసింది. రాత్రంతా వర్షం కురుస్తూనే ఉండడంతో పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద కారణంగా పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇక చాలాచోట్ల రహదారులపైకి వరద చేరడంతో ప్రజలు దాటేందుకు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. -
నాటి అడుగులు నేటి గురుతులు
ఇల్లెందుకు వృద్ధి ఫలాలు ఇల్లెందు: నియోజకవర్గంలో సాగిన పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ముల్కనూరు సమీపంలో గల పాకాల ఏటిపై మున్నేరు ప్రాజెక్ట్ నిర్మాణానికి నాటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఆమోదం తెలిపారు. 2009 మార్చి 2న మున్నేరు ప్రాజెక్ట్ నిర్మాణానికి జీఓ జారీ చేశారు. రూ.131.67 కోట్ల వ్యయంతో 5 వేల ఎకరాలకు సాగునీరు, 29 గ్రామాలకు మంచినీరు అందించేలా నిర్మించేలా చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన హఠాన్మరణంతో ఇది నిలిచింది. కామేపల్లి మండలంలోని తాళ్లగూడెంలో 2005 మే 6వ తేదీన జరిగిన ప్రజాపథంలో పాల్గొన్న వైఎస్సార్ తాళ్లగూడేనికి 50 గృహాల మోడల్ కాలనీ మంజూరు చేశారు. ఇక్కడి చెరువు వద్ద ఆయన స్వయంగా అరక దున్ని ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2005లో బయ్యారం చెరువుకు గండి పడగా మరమ్మతులు, అభివృద్ధి పనులకు రూ.10 కోట్లు మంజూరు చేశారు. మర్రిగూడెం వద్ద గల ముసలమ్మ వాగు వద్ద చెరువు నిర్మాణానికి అప్పటి ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యకు హామీ ఇచ్చి రెండోమారు అధికారంలోకి రాగానే నిధులు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. నాటి రాజీవ్ సాగరే.. నేటి సీతారామ ప్రాజెక్ట్ అశ్వాపురం: జలయజ్ఞం పథకంలో భాగంగా అశ్వాపురం మండలం కుమ్మరిగూడెంలోని దుమ్ముగూడెం ఆనకట్ట ఆధారంగా 2003లో దుమ్ముగూడెం రాజీవ్‌సాగర్ ప్రాజెక్ట్‌కు నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ రూపకల్పన చేశారు. 2003లో కుమ్మరిగూడెంలో దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద శంకుస్థాపన చేశారు. ప్రాజెక్ట్ పనులు కూడా కొంత వరకు జరిగాయి. అనంతరం పెద్దాయన హఠాన్మరణంతో ఆగిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్ట్‌ల రీడిజైన్‌లో భాగంగా సీతారామ ఎత్తిపోతల పథకంగా పేరుమార్చి ప్రస్తుతం నిర్మిస్తోంది. మూడో దశ వరకు పనులు తుది దశకు చేరుకున్నాయి. అయితే..వైఎస్సార్ హయాంలోని ప్రాజెక్ట్ డిజైన్‌లో పినపాక నియోజకవర్గంలో వేల ఎకరాలకు సాగునీరందేలా ఉండగా..సీతారామ ప్రాజెక్ట్ డిజైన్‌లో దానికి మినహాయింపునిచ్చారు. కిన్నెరసాని కాల్వలతో వేల ఎకరాలకు సాగునీరు పాల్వంచరూరల్: పాల్వంచ, పినపాక, బూర్గంపాడు మండలాల్లో పదివేల ఎకరాలకు కిన్నెరసాని జలాలను సాగునీరుగా అందించారు. జలయజ్ఞంలో భాగంగా 2005 డిసెంబర్ 31న పాల్వంచకు వచ్చిన వైఎస్.రాజశేఖర్ రెడ్డి రూ.37 కోట్ల వ్యయంతో కిన్నెరసాని జలాల తరలింపునకు కుడి, ఎడమ కాల్వల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పనులు పూర్తయి..నేటికీ జలాలు అందుతున్నాయి. తద్వారా ఇక్కడి వేలాదిమంది రైతులకు రెండు పంటలు పండే భాగ్యాన్ని ప్రసాదించారు. ఇంకా ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ, ఉచిత విద్యుత్, పింఛన్లు తదితర సంక్షేమ కార్యక్రమాలతో అనేక మందికి అండగా నిలిచారు. మున్నేరు ప్రాజెక్ట్ కోసం నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్‌ను కలిసిన గుమ్మడి నర్సయ్య, తదితరులు (ఫైల్) నర్సన్నా.. నేరుగా వచ్చి కలువు ఇల్లెందు: విద్యుత్ పోరాటంలో తనతో కలిసి పోరాడిన నాటి ఇల్లెందు ఎమ్మెల్యే, సీపీఐ (ఎంఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర నేత గుమ్మడి నర్సయ్య అంటే వైఎస్సార్‌కు ప్రత్యేక గౌరవం ఉండేది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో గుమ్మడి నర్సయ్య ఓటమి చెంది చాలా కాలం తర్వాత ఇల్లెందు అభివృద్ధి కోసం వెళ్లగా..ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వైఎస్సార్ ఆప్యాయంగా తన గదిలోకి ఆహ్వానించారు. ‘నర్సన్నా నువ్వు ఓడిపోవడం ఏమిటన్నా’ అంటూ బాధపడ్డారు. ‘ ఏ పని ఉన్నా నేరుగా వచ్చి కలువు అన్నా..’ అంటూ అక్కడ ఉన్న తన ప్రత్యేక కార్యదర్శులకు సూచించినట్లు గుమ్మడి నర్సయ్య వైఎస్సార్ జ్ఞాపకాలను గతంలో నెమరవేసుకున్నారు. నడుస్తూ..కష్టాలు వింటూ ఇల్లెందు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ప్రతిపక్ష నేతగా వైఎస్.రాజశేఖర్ రెడ్డి చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర నాటి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సాగింది. 2003 మే 5వ తేదీన వరంగల్ జిల్లా మహబూబాబాద్ నుంచి..బయ్యారం చేరుకోగా ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనేక సమస్యలను తెలుసుకుని..2004 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రిగా వాటికి పరిష్కారం చూపారు. పాదయాత్ర సందర్భంగా బయ్యారం పెద్ద చెరువును శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పర్చాలని రైతులు విన్నవించారు. గుండ్ల వీరస్వామి అనే స్వాతంత్య్ర సమరయోధుడు పేదరికంలో మగ్గుతున్న విషయం తెలుసుకుని..నాటి సుజాతనగర్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డితో మాట్లాడి..పింఛన్ మంజూరు చేయించాలని సూచించారు. అలిగేరు, గుంపెళ్లగూడెం, ముల్కనూరు, దుబ్బగూడెం మీదుగా గార్లకు పాదయాత్ర సాగింది. తర్వాతి రోజు లింగాల గ్రామానికి చేరుకుని రాంరెడ్డి వెంకటరెడ్డి స్వగృహంలో బస చేశారు. మరుసటి రోజు కొత్తలింగాల క్రాస్‌రోడ్ మీదుగా ముచ్చర్ల క్రాస్‌రోడ్, పండితాపురం, రఘునాథపాలెం, బల్లెపల్లిల మీదుగా ఖమ్మానికి చేరుకున్నారు. బయ్యారంలో వైఎస్సార్ ప్రజా ప్రస్థానం పాదయాత్ర (ఫైల్) -
వరద హోరు..
సాక్షి, కొత్తగూడెం(ఖమ్మం): ఎడతెరిపి లేని వర్షంతో జిల్లా తడిసి ముద్దయింది. శుక్రవారం రాత్రి నుంచి వరుణుడు ఆగకుండా ప్రతాపం చూపడంతో జిల్లాలో ఈ ఏడాదిలో ఇప్పటివరకు అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 23 మండలాల్లో 1,177.6 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. ఈ వర్షం ఇంకా కొనసాగుతూనే ఉంది. భారీ వర్షంతో జిల్లాలోని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక గ్రామాల్లోకి వరద నీరు చొచ్చుకుని రావడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల పంటలు నీటమునిగాయి. గుండాల, ఆళ్లపల్లి, అశ్వాపురం, పాల్వంచ తదితర మండలాల్లో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాకు ఎగువ ప్రాంతంలో కూడా భారీగా వర్షం కురవడంతో నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కిన్నెరసాని నది, జల్లేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆళ్లపల్లి మండలంలో కిన్నెరసాని వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది. గుండాల మండలంలోని మల్లన్నవాగు, ఏడుమెలికలవాగు, నడివాగు, దున్నపోతులవాగు భారీగా ప్రవహిస్తుండడంతో మండలంలోని 50 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గుండాల మండలం నాగారం గ్రామానికి చెందిన పర్శిక శిరీష అనే గర్భిణిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అనేక అవస్థలు పడాల్సి వచ్చింది. 5 కిలోమీటర్ల మేర ట్రాక్టరుపై తీసుకొచ్చారు. కిన్నెరసాని వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తుండడంతో ఆమెను దాటించేందుకు అనేక గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడ్డారు. అశ్వాపురం మండలంలోని గొందిగూడెం ఇసుకవాగు పొంగుతుండడంతో ఎలకలగూడెం, గొందిగూడెం, మనుబోతులగూడెం, ఇప్పలగుంపు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని గ్రామంలో ఇళ్లలోకి వరదనీరు చేరింది. 22 గ్రామాలకు రవాణా నిలిచిపోయింది. ఇక బూడిదవాగు పొంగడంతో సూరారం, సోములగూడెం, పాండురంగాపురం గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. కిన్నెరసాని గేట్లు ఎత్తడంతో రాజాపురం వద్ద నీటి ప్రవాహం ఉధృతమైంది. పొలాల్లో రైతులు ఏర్పాటుచేసుకున్న మోటార్లు కొట్టుకుపోయాయి. చర్ల మండలంలో బత్తినపల్లి వాగు, బాగనెల్లి వాగు, చింతవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో బత్తినపల్లి, కుర్నపల్లి, బాగనెల్లి, చింతగుంపు గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మణుగూరు మండలంలోని కోడిపుంజులవాగు ఉవ్వెత్తున ప్రవహిస్తుండడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఇళ్లలోకి వరదనీరు చేరింది. రోడ్లపైకి నీరు వచ్చింది. బూర్గంపాడు మండలంలో పంటలు నీటమునగగా కొత్తగూడెం, మణుగూరు, టేకులపల్లిలో ఓసీల్లోకి నీరు చేరి బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. టేకులపల్లి మండలంలో రోడ్లపై చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలాయి. దుమ్ముగూడెం మండలం పెద్దనల్లబెల్లి వద్ద రోడ్డుకు అడ్డంగా భారీ వృక్షం కూలిపోయింది. పర్ణశాలలో సీతమ్మవాగు ఉప్పొంగుతోంది. కొత్తగూడెంలో ముర్రేడువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. సుజాతనగర్ మండలంలో ఎదుళ్లవాగు ఉరకలెత్తుతోంది. దమ్మపేట మండలం మొండివర్రె గ్రామంలో గోపికృష్ణ అనే రైతుకు చెందిన కాకరతోట పడిపోయి రూ.లక్ష మేర నష్టం వాటిల్లింది. గోదావరిలో గల్లంతైన ముగ్గురిని రక్షించిన పోలీసులు.. పినపాక మండలం రాయిగూడెం వద్ద ముగ్గురు యువకులు గోదావరిలో చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యారు. తక్షణమే సమాచారం అందుకున్న పోలీసులు పడవల సహాయంతో వారిని రక్షించారు. లక్ష్మిదేవిపల్లి మండలం చింతపెంట వద్ద ఎర్రసానివాగు ప్రవాహంలో ఒక ఆటో, రెండు బైకులు కొట్టుకుపోయాయి. స్థానికుల సహాయంతో ప్రయాణికులు బయటపడ్డారు. గరిష్ట నీటిమట్టానికి జలాశయాలు.. గేట్ల ఎత్తివేత.. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని జలాశయంలోకి 407 అడుగుల గరిష్ట మట్టానికి నీరు చేరడంతో శనివారం అధికారులు మొత్తం 13 గేట్లు ఎత్తి 88 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. ఇన్‌ఫ్లో 80 వేల క్యూసెక్కులు ఉంది. చర్ల మండలంలోని తాలిపేరు జలాశయంలో గరిష్ట నీటిమట్టం 74 మీటర్లు కాగా 73.35 మీటర్ల నీరు చేరింది. ఇన్‌ఫ్లో 80 వేల క్యూసెక్కులు ఉండగా, 15 గేట్లను పూర్తిగా ఎత్తి 1.03 లక్షల క్యూసెక్కుల చొప్పున వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు జలాశయం గరిష్ట సామర్థ్యం 6.1 మీటర్లు కాగా 5.9 మీటర్ల నీరు చేరింది. 1 గేటు ఎత్తి 2,820 క్యూసెక్కులు కిందకు వదులుతున్నారు. మంత్రి తుమ్మల సమీక్ష.. జిల్లావ్యాప్తంగా కురిసిన వర్షం కారణంగా జరిగిన నష్టంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. దెబ్బతిన్న రహదారులు, చెరువుకట్టల విషయమై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. బూర్గంపాడు మండలంలో బస్సు వాగులో పడిన ఘటనపై మంత్రి ఆరా తీశారు. -
రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న వర్షాలు
-
కిన్నెరసాని ప్రాజెక్టుకు పెరుగుతున్న ఇన్‌ఫ్లో...
- రెండు గేట్ల ద్వారా రాత్రికి నీటి విడుదల పాల్వంచ రూరల్(ఖమ్మం జిల్లా) ఖమ్మం జిల్లా పాల్వంచ సమీపంలోని కిన్నెరసాని ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో పెరుగుతోంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్ధ్యం 407 అడుగులు కాగా ఆదివారం సాయంత్రం వరకు 405.70 అడుగులకు నీటి మట్టం చేరింది. ఆదివారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకూ ప్రాజెక్టుకు చెందిన రెండు గేట్లు ఎత్తివేసి 10వేల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తామని నీటిపారుదల అధికారులు చెప్పారు. ఈ నీటి విడుదల వల్ల యానంబయలు, ఉలవమాల, చంద్రాలబయలు గ్రామ పంచాయతీలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోతాయని చెప్పారు. అందుకే ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు కోరారు. -
అంతటా వర్షం
⇔ అత్యధికంగా ముల్కలపల్లిలో 17.0 సెం.మీ. వర్షపాతం ⇔ టేకులపల్లిలో 14.5, బూర్గంపాడులో 11.2 ⇔ 32 మండలాల్లో 5 సెం.మీ. పైన నమోదు ⇔ కిన్నెరసాని ప్రాజెక్ట్ ఆరు గేట్లు ఎత్తివేత ⇔ కొన్ని చెరువులకు గండ్లు, మరికొన్ని రోడ్లకు కోత సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో గురువారం వర్షం పడింది. అత్యధికంగా ముల్కలపల్లిలో 17.0, టేకులపల్లిలో 14.5, బూర్గంపాడులో 11.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరద వెల్లువతో కొన్ని చెరువులకు గండ్లు పడ్డాయి. వరుసగా ఐదు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఏజెన్సీలోని గ్రామాల్లో రోడ్లు కోతకు గురయ్యాయి. కిన్నెరసాని వరద ఉధృతితో ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలారు. 32 మండలాల్లో ఐదు సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. జూన్‌లో సాధారణ వర్షపాతం సగటున 12.7 సెం.మీ. ఇప్పటివరకు 33.6 సెం.మీ. వర్షపాతం కురిసింది. వాజేడు మినహా 40 మండలాల్లో సాధారణానికన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. కిన్నెరసాని పరవళ్లు కిన్నెరసాని పాల్వంచ రూరల్): ఎగువ నుంచి వరద నీటి రాకతో కిన్నెరసాని రిజర్వాయర్ పరవళ్లు తొక్కుతోంది. దీని నీటి మట్టం 404 అడుగులకు చేరింది. దీని పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 407 అడుగులు. బుధవారం రాత్రి 10.30 గంటలకు ఆరు గేట్లను ఎత్తి, తిరిగి గురువారం ఉదయం 6.30 గంటలకు మూసివేశారు. ఒక్కో గేటును అడుగు చొప్పున పైకి ఎత్తి, 30వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేసినట్టు డ్యామ్ సైడ్ ఏఈ రామకృష్ణ తెలిపారు. ప్రస్తుతం 401.40 అడుగుల నీటిని రిజర్వాయర్‌లో నిల్వ ఉంచారు. ఇన్‌ఫ్లో 5000 క్యూసెక్కులు ఉందని చెప్పారు. కిన్నెరసాని ప్రాజెక్ట్ ఆరు గేట్లు ఎత్తడంతో యానంబైల్-రాజాపురం గ్రామాల మధ్య చప్టా వద్ద మునిగిపోయింది. దీంతో యానంబైల్, ఉల్వనూరు, చండ్రాలగూడెం గ్రామ పంచాయతీల పరిధిలోగల దాదాపు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గేట్లు మూసివేసిన తరువాత నీరు తగ్గడంతో రాకపోకలు కొనసాగాయి. వరదలతో ఎక్కడెక్కడ ఏమేం జరిగిందంటే... ⇔ అశ్వారావుపేట మండలంలోని ఊట్లపల్లి సమీపంలోగల వెంకమ్మ చెరువు అలుగు పారడంతో దిగువనున్న వాగొడ్డుగూడెం వద్ద వాగు పొంగిపొర్లింది. 10 గ్రామాలకు రాకపోకలకు నిలిచిపోయాయి. ⇔పాల్వంచ మండలంలోని ఎర్రచెరువు, బండ్రుగుండ చెరువుకు గండి పడింది. కారుకొండ వద్ద లోలెవెల్ బ్రిడ్జి సైడ్‌వాల్స్ పూర్తిగా కొట్టుకుపోయింది. దీని మరమ్మతు పనులు సాగుతున్నాయి. సింగరేణి కొత్తగూడెం ఏరియాలో వర్షం కారణంగా 15వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయమేర్పడింది. ⇔ వైరా రిజర్వాయర్‌లోకి వరద నీరు వస్తోంది. నీటి మట్టం పెరుగుతోంది. ప్రస్తుతం ఏడు అడుగులకు చేరింది. ⇔ అశ్వాపురం మండలంలోని సీతారాంపురం-ఆనందపురం గ్రామాల మధ్య రోడ్డుపై చప్టా తెగిపోవడంతో రాకపోకలు నిలి చాయి. మల్లెలమడుగు వద్ద రాజం పాపయ్య వాగు పొంగి సమీప గ్రామంలోని 15 రోడ్లు కోతకు గురయ్యాయి. గొందిగూడెం ఇసుకవాగు, బురదవాగు పొంగడంతో చుట్టుపక్కల 10 గ్రామా లు మునిగాయి. రోడ్లు కోతకు గురవడంతో ప్రజలు ైరైల్వే ట్రాక్‌పై నడుస్తున్నారు. ⇔ బూర్గంపాడు మండలంలో లక్ష్మీపురం-సంజీవరెడ్డిపాలెం మధ్య రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. బూర్గంపాడు వద్ద రోడ్డు కోతకు గురైంది. -
అన్నింటికీ అడ్డంకులే
* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై గవర్నర్‌కు సీఎం కేసీఆర్ ఫిర్యాదు * ఎంసెట్, నదీ జలాల విషయంలో మొండి వైఖరి అవలంబిస్తోంది * గతేడాది ఇంజనీరింగ్ అడ్మిషన్ల నుంచే వివాదం ప్రారంభం * మమ్మల్ని సంప్రదించకుండానే ఇంటర్, ఎంసెట్ తేదీల ప్రకటన * కిన్నెరసాని ప్రాజెక్టును దక్కించుకునే యత్నం చేస్తోందని ఆరోపణ * విద్యుత్ విషయంలోనూ చిక్కులు తెస్తోందని ఏపీపై మండిపాటు * నూటికి నూరు శాతం సీలేరు తెలంగాణకే దక్కుతుందని వివరాలతో నివేదిక * గవర్నర్‌తో ఏకాంతంగా గంటన్నరపాటు భేటీ అయిన తెలంగాణ సీఎం సాక్షి, హైదరాబాద్: ప్రతి చిన్న విషయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తోందని పేర్కొంటూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ తెలంగాణ ప్రభుత్వానిదే తప్పు అని చూపించే ప్రయత్నం చేస్తోందని వివరించారు. ఆయా అంశాలకు సంబంధించిన పత్రాలు, రుజువులు కూడా అందజేశారు. గవర్నర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు గురువారం మధ్యాహ్నం ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, రాజయ్య, ఎంపీ వినోద్‌కుమార్‌తో కలసి సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలిపిన అనంతరం సీఎం కేసీఆర్ ఆయనతో ఏకాంతంగా చర్చలు జరిపారు. సాధారణంగా పావుగంట నుంచి అరగంట వరకు సమావేశం కావడం పరిపాటి. కానీ నరసింహన్, కేసీఆర్ ఇద్దరూ దాదాపు గంటన్నర పాటు మాట్లాడుకున్నారు. ఆ సమయంలో ఇతరులెవరినీ లోనికి అనుమతించకపోవడం గమనార్హం. అయితే విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో వస్తున్న ఇబ్బందులను సీఎం గవర్నర్‌కు సుదీర్ఘంగా వివరించారు. ఇంటర్, ఎంసెట్ విషయంలో ఏపీ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని వెల్లడించారు. కనీసం తమతో సంప్రదించకుండానే ఇంటర్, ఎంసెట్ తేదీలను ప్రకటించిన సంగతిని గవర్నర్ దృష్టికి తెచ్చారు. అందువల్లే తాము ప్రత్యేకంగా తేదీలను ప్రకటించాల్సి వచ్చిందని వివరించారు. గత ఏడాది ఇంజనీరింగ్ అడ్మిషన్ల విషయంలోనూ తమతో విభేదించారని... అప్పటి నుంచి వారి వ్యవహారశైలి ఏకపక్షంగానే కొనసాగుతోందని గవర్నర్‌కు సీఎం తెలిపారు. నదీ జలాల విషయంలోనూ పొరుగు రాష్ట్రం కావాలని వివాదాలు సృష్టిస్తోందన్నారు. సీలేరు ప్రాజెక్టు ఎప్పటికీ తెలంగాణదేనంటూ దాని చరిత్రను గవర్నర్‌కు కేసీఆర్ వివరించారు. దాంతోపాటు ఇప్పుడు బూర్గంపహాడ్‌ను కూడా కావాలని ఏపీ కోరుతోందని... కిన్నెరసాని ప్రాజెక్టును దక్కించుకుని తెలంగాణకు అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తోందని గవర్నర్ దృష్టికి తెచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావాలనే ఇబ్బందులు సృష్టిస్తున్నా.. తాము సంయమనం పాటిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగిన వెంటనే ఆగమేఘాల మీద విద్యుత్ సమస్యను ఏపీ తెరపైకి తెచ్చి ఇబ్బందులకు గురి చేసిందని వివరించారు. కాగా.. ఎంసెట్ విషయంలో తాను చేసిన సూచనలపై సీఎం కేసీఆర్ అభిప్రాయాన్ని గవర్నర్ నరసింహన్ కోరినట్లు తెలిసింది. అయితే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ వైఖరిని బట్టి తాము నడుచుకుంటామని సీఎం చెప్పినట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. నేడు కేరళ పర్యటనకు సీఎం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు శుక్రవారం కేరళ పర్యటనకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కొచ్చి నగరానికి బయలుదేరుతారు. అక్కడ రాత్రి బస చేసి.. శనివారం త్రిసూర్‌లో జరిగే లూలూ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అష్రాఫ్ అలీ కుమార్తె వివాహానికి కేసీఆర్ హాజరవుతారు. అనంతరం పీచి డ్యామ్ సమీపంలో ఉన్న కేరళ అటవీ పరిశోధన ఇన్స్టిట్యూట్ను సందర్శించి, అధికారులతో సమావేశమవుతారు. -
కిన్నెరసాని .. రానంటోంది !
సాక్షి, ఖమ్మం : కిన్నెరసాని ప్రాజెక్టుతో బీడు భూములకు సాగు నీరు అందుతుందని ఆశించిన ఆయకట్టు రైతుల కల నెరవేరలేదు. భూసేకరణ పరిహారం, నిధుల విడుదల లేకపోవడంతో కాలువ పనులకు మోక్షం కలగడం లేదు. ఈ ప్రాజెక్టు కుడి కాలువ పూర్తి అయినా ఎడమ కాలువ పనులు మధ్యలోనే నిలిచాయి. భూసేకరణ పరిహారం విషయంలో గత ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం, పరిష్కారం దిశగా చర్యలు తీసుకోకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే కొద్ది మొత్తం నిధులతో పూర్తయ్యే ప్రాజెక్టుల జాబితాలో నూతన ప్రభుత్వం కిన్నెరసానిని చేర్చడంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురించాయి. కిన్నెరసాని ప్రాజెక్టులో ఏటా పుష్కలంగా నీరుంటుంది. కొత్తగూడెం థర్మల్ పవర్ ప్రాజెక్టుతోపాటు కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీల దాహార్తిని ఈ ప్రాజెక్టే తీర్చుతుంది. జలయజ్ఞంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో అప్పటి అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టుకు రూ.36.54 కోట్లతో రూపకల్పన చేశారు. కిన్నెరసాని ప్రాజెక్టుకు సమీపంలోని పాల్వంచ, బూర్గంపాడు, కొత్తగూడెం మండలాల్లో సుమారు 10 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కుడి, ఎడమ కాలువలను డిజైన్ చేశారు. కుడి కాలువ ద్వారా కొత్తగూడెంలోని 3 వేల ఎకరాలకు, ఎడమ కాలువ ద్వారా పాల్వంచ, బూర్గంపాడు మండలాల్లో 7 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ప్రాజెక్టు పనులకు 2005 డిసెంబర్ 31న వైఎస్ శంకుస్థాపన చేశారు. నిబంధనల ప్రకారం ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నా వైఎస్ మరణం తర్వాత ఈ పనులు నత్తనడకన సాగాయి. కేవలం కుడి కాలువ పనులే పూర్తి అయ్యాయి. ఎడమ కాలువ పనులు పూర్తి కాకున్నా ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా 2012 డిసెంబర్లో ముఖ్యమంత్రి కిరణ్‌కమార్‌రెడ్డి కుడి కాలువకు నీటిని వ దిలారు. దీనికి నిరసనగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేసినా ఫలితం లేకుండా పోయింది. నిలిచిన ఎడమ కాలువ పనులు... ఎడమ కాలువకు సంబంధించి 24.25 కిలోమీటర్ల మేరకు కాలువ తీయాలి. ప్రాజెక్టు నుంచి బూర్గంపాడు మండలం వరకు ఈ కాలువను తవ్వించాలి. అయితే ఇప్పటి వరకు కేవలం 19 కిలోమీటర్ల మేర మాత్రమే కాలువ పనులను అధికారులు పూర్తి చేయించారు. ఇంకో ఆరు కిలోమీటర్లు పూర్తి అయితే భూములకు సాగు నీరు అందేది. భూసేకరణే అసలు సమస్య... కాలువ నిర్మాణానికి భూ సేకరణ కూడా ప్రధాన సమస్యగా మారింది. నష్టపోయిన తమ భూములకు మార్కెట్ ధర ప్రకారం డబ్బు చెల్లించడం లేదని కొందరు రైతులు, తమ భూములను వదులుకునేందుకు ఇష్టం లేక మరి కొందరు అడ్డుకుంటున్నారు. బూర్గంపాడు మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతులు భూసేకరణ విషయంలో అభ్యంతరం చెప్పడమే కాక, కోర్టును ఆశ్రయించారు. దీంతో ఇదే మండలంలోని టేకులచెరువు నుంచి లక్ష్మీపురం వరకు భూసేకరణ నిలిచింది. దీనికి తోడు మధ్యలో కొంత అటవీ శాఖ భూములుండగా.. వాటికీ ఇప్పటివరకు అనుమతులు రాలేదు. కాలువ మధ్యలో రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి ఆ శాఖకు రూ 2.25 కోట్లు చెల్లించిన అధికారులు అనుమతులు తెచ్చుకునప్పటికీ ఈ పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహించారు. ఈ కాలువ పరిధిలో మొత్తం 10 పిల్ల కాల్వల నిర్మాణం చేపట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు నాలుగు మాత్రమే తవ్వించారు. పెరగనున్న అంచనా వ్యయం.. కొంతమేర నిధులు వెచ్చిస్తే పూర్తయ్యే ఈ పనులపై ప్రస్తుత ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే ప్రాజెక్టు అంచనా వ్యయం గతంతో పోలిస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరికొంత పెరిగే అవకాశం ఉంది. ఈ పనులను కాంట్రాక్టు తీసుకున్న ఆర్విన్స్ సంస్థ ప్రస్తుతం ఉన్న ధరలను పరిగణనలోకి తీసుకొని నిర్మాణ వ్యయం పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పెట్టింది. ఈ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తే వచ్చే ఖరీఫ్ నాటికైనా సాగు నీరు అందుతుందని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. -
పూడికతీస్తే నీరేనీరు
సాక్షి, ఖమ్మం: కిన్నెరసాని, తాలిపేరు ప్రాజెక్టుల్లో పూడికతీతకు మోక్షం కలగనుంది. సిల్ట్ తీసి ఇసుక మైనింగ్ చేసే ప్రతిపాదనపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగా జిల్లాలోని కిన్నెరసాని, తాలిపేరు రిజర్వాయర్లలో పూడికతీతపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం మైనింగ్ అధికారులను ఆదేశించింది. ఇదే జరిగితే రిజర్వాయర్ల నిర్మాణం నుంచి పేరుకుపోయిన సిల్ట్ తీయడంతో పాటు ఇసుక రూపంలో ప్రభుత్వానికి ఆదాయం రానుంది. అలాగే ఈ రిజర్వాయర్ల నీటి సామర్థ్యం పెరిగి వీటి పరిధిలో వేలాది ఎకరాల బీడు భూములు సాగులోకి రానున్నాయి. రిజర్వాయర్లలో ఇసుక పూడిక తీసి నీటి నిల్వ సామర్థ్యం పెంచే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇసుక సిల్ట్‌తో నిండిన రిజర్వాయర్లలో తవ్వకాలకు అనుమతి ఇచ్చే చర్యలకు పూనుకుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే నీటి పారుదల, మైనింగ్ శాఖ అధికారులతో చర్చించిన ప్రభుత్వం సాధ్యాసాధ్యాలను తేల్చాలని ఆదేశించింది. జిల్లాలోని కిన్నెరసాని, తాలిపేరు ప్రాజెక్టుకు ప్రతిసారి వర్షాకాలంలో ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు, ఇసుక కూడా వస్తున్నాయని మైనింగ్ అధికారులు ప్రాథమికంగా ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. కాగా, దీనిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నివేదిక అందజేయాలని ప్రభుత్వం జిల్లా మైనింగ్ అధికారులను ఆదేశించింది. దీంతో ఈ రిజర్వాయర్ల నిర్మాణ సమయంలో నీటి నిలువ సామర్థ్యం ఎంత..? ప్రస్తుతం ఎంత మేరకు ఇసుక, ఒండ్రు మట్టితో నిండింది.. సిల్ట్ తీస్తే ఏ మేరకు ప్రయోజనం కలుగనుంది..? తదితర అంశాలపై నివేదిక తయారు చేసే పనిలో సంబంధిత అధికారులు నిమగ్నమయ్యారు. 10 అడుగులు పెరగనున్న కిన్నెరసాని.. పాల్వంచ మండలంలో కిన్నెరసాని-యానంబైల్ గ్రామాల మధ్య 1974 నవంబర్ 29న బహుళార్ధక ప్రాజెక్టుగా కిన్నెరసాని రిజర్వాయర్‌ను నిర్మించారు. దీని విస్తీర్ణం 2.5 కిలోమీటర్లు కాగా నీటి నిల్వ సామర్థ్యం 407 అడుగులు. పాల్వంచ మండలంలోని రాళ్లవాగు, పిక్ డ్యామ్, వరంగల్ జిల్లా పాకాల చెరువు, గుండాల అడవుల నుంచి ఈ రిజర్వాయర్‌లోకి వరద నీరు వస్తుంది. ప్రధానంగా అడవి మార్గం నుంచి వరద వస్తుండడంతో ఇసుకతో పాటు ఒండ్రు మట్టి కూడా భారీగా చేరుతుంది. దీంతో ఏటా నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతోంది. 1999 వరకు దీని పర్యవేక్షణ బాధ్యతలను నీటి పారుదల శాఖ చూసేది. ఆ తర్వాత కేటీపీఎస్ అధికారులకు అప్పగించారు. కిన్నెరసాని రిజర్వాయర్ నుంచి నిత్యం 110 క్యూసెకుల నీరు కేటీపీఎస్, ఎన్ఎండీసీ, నవభారత్ కర్మాగారాలతోపాటు కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలకు తాగునీటి అవసరాలకు సరఫరా చేస్తున్నారు. అలాగే ఎడమ, కుడి కాలువ పరిధిలో పది వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నారు. కిన్నెరసాని రిజర్వాయర్ నీట్టి మట్టం తగ్గితే భవిష్యత్‌లో నీటి కొరత ఏర్పడుతుందన్న ఉద్దేశంతో కేటీపీఎస్, నవభారత్ కర్మాగారాలు ప్రత్యామ్నాయ చర్యలపై గతంలోనే దృష్టి సారించాయి. దగ్గరలోని గోదావరి నీటిని ఈ కర్మాగారాలకు తరలించేందకు కే టీపీఎస్ యాజమాన్యం రూ.100 కోట్లతో గోదావరి నుంచి పైపులైన్ నిర్మించుకుంది. నవభారత్ కర్మాగార యాజమాన్యం కూడా సుమారు రూ.20 కోట్లు వెచ్చించి గోదావరి నుంచి 4 క్యూసెక్యుల నీటిని తీసుకొచ్చేందుకు పైపులైన్ల నిర్మాణం పూర్తి చేసింది. అయితే ప్రాజెక్టు నిర్మాణం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు రిజర్వాయర్‌లో సిల్ట్ తీయలేదు. వరదలా నీరు వస్తుండడంతో ఇసుక భారీగా రిజర్వాయర్‌లోకి చేరుతుంది. నీళ్లు తక్కువగా ఉన్నప్పుడే సిల్ట్ తీసేందుకు అనువుగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. సీల్ట్ తీస్తే 10 అడుగుల మేర నిల్వ సామర్థ్యం పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ తీసే ఇసుకకు మంచి డిమాండ్ ఉంటుంది. దీంతో ప్రభుత్వానికి ఆదాయం రానుంది. తాలిపేరు ఆయకట్టుకు మహర్దశ.. చర్ల మండలంలోని పెదమిడిసిలేరు సమీపంలో తాలిపేరు ప్రాజెక్టు నిర్మించిన తర్వాత 1986 నుంచి సాగుకు నీరు విడుదల చేస్తున్నారు. దీని పూర్తి స్థాయి నీటి మట్టం 246.9 అడుగులు. ఈ ప్రాజెక్టులోకి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని చింతవాగు, పగిడివాగు, జెర్రిపోతులవాగు, పూసువాగు, బాసవాగుతో పాటు మరో రెండు వాగుల ద్వారా వచ్చే నీరు తాలిపేరు ప్రాజెక్ట్‌లోకి చేరుతుంది. తెలంగాణ భూభాగంలో ఎక్కడా వర్షాలు కురవకున్నా ఛత్తీస్‌గఢ్ అడవిలో ఎక్కడ చిన్నపాటి వర్షం పడినా వరద నీరు వస్తుంది. ఇదంతా ఇసుక, ఒండ్రుమట్టితో ప్రాజెక్టు నిండుతుంది. దీంతో ఈ ప్రాజెక్టు సుమారు ఏడు అడుగుల మేర సిల్ట్‌తో పూడినట్లు సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. రిజర్వాయర్ పూడికను తీస్తే నీటి నిల్వ సామర్థ్యంతో పాటు ఆయకట్టు మరో ఐదు వేల ఎకరాలు పెరగనుంది. అలాగే ఆయకట్టు చివరి భూమల వరకు సాగు నీరు అందనుంది.