- రెండు గేట్ల ద్వారా రాత్రికి నీటి విడుదల
పాల్వంచ రూరల్(ఖమ్మం జిల్లా)
ఖమ్మం జిల్లా పాల్వంచ సమీపంలోని కిన్నెరసాని ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో పెరుగుతోంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్ధ్యం 407 అడుగులు కాగా ఆదివారం సాయంత్రం వరకు 405.70 అడుగులకు నీటి మట్టం చేరింది. ఆదివారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకూ ప్రాజెక్టుకు చెందిన రెండు గేట్లు ఎత్తివేసి 10వేల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తామని నీటిపారుదల అధికారులు చెప్పారు. ఈ నీటి విడుదల వల్ల యానంబయలు, ఉలవమాల, చంద్రాలబయలు గ్రామ పంచాయతీలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోతాయని చెప్పారు. అందుకే ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు కోరారు.
కిన్నెరసాని ప్రాజెక్టుకు పెరుగుతున్న ఇన్‌ఫ్లో...
Published Sun, Aug 7 2016 6:25 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM
Advertisement