పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచకు చెందిన మండిగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఖమ్మం జైలులో ఉన్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు కుమారుడు వనమా రాఘవ రిమాండ్‌ను పొడిగించారు. ఈ కేసులో రాఘవను 8వ తేదీన అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించిన విషయం విదితమే. ఆయన రిమాండ్ గడువు శుక్రవారంతో ముగియగా శనివారం ఆన్‌లైన్ విధానంలో కోర్టుకు హాజరుపరిచారు.
ఈ సందర్భంగా మరో 14రోజుల పాటు అంటే.. వచ్చేనెల 4వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ కొత్తగూడెం రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముద్దసాని నీలిమ ఆదేశాలు వెలువరించారు. కాగా, ఇప్పటికే రాఘవ తరఫున బెయిల్ కోసం పిటిషన్ వేయగా తిరస్కరణకు గురైంది. అలాగే, ఇదే కేసులో నిందితులుగా ఉన్న రామకృష్ణ తల్లి సూర్యావతి, సోదరి మాధవి కూడా బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా శుక్రవారం తిరస్కరించారు.
దీంతో వీరు హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిసింది. ఇక రాఘవను విచారణ కోసం ఈసారైనా పోలీసులు కస్టడీకి కోరతారా, లేదా అన్నది త్వరలోనే తేలనుంది. జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ పట్టణ పోలీసుస్టేషన్లలో మరో రెండు కేసులకు సంబంధించి పోలీసులు పిటీ (ప్రిజనల్ ట్రాన్స్‌ఫర్) వారెంట్లు దాఖలు చేయడం కూడా రిమాండ్‌ను పొడిగించేందుకు దోహదపడినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment