raghava
-
టాలీవుడ్ నటుడిని సన్మానించిన మెగాస్టార్.. ఎందుకో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి తన వంతు సాయంగా సమాజం కోసం కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పేరిట సేవా కార్యక్రామాలు చేస్తూ ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నారు. గత 26 ఏళ్లుగా పేద ప్రజలకు ఉచితంగా రక్తనిధులు సమకూరుస్తున్నారు. అయితే చిరంజీవి అభిమానులు ప్రతి ఏటా రక్తదానం క్యాంపులు కూడా నిర్వహిస్తుంటారు. అలా బ్లడ్ బ్యాంక్ ప్రారంభం నుంచి రక్తదానం చేసే వారిలో నటుడు మహర్షి రాఘవ ముందు వరుసలో ఉంటారు. ఇప్పటి వరకు ఆయన వందసార్లు చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయనను మెగాస్టార్ అభినందించారు. ప్రత్యేకంగా ఇంటికి ఆహ్వానించి సత్కరించారు. ఆయన సేవలను మెగాస్టార్ కొనియాడారు. రక్తదానం విషయంలో ప్రతి ఒక్కరూ రాఘవను ఆదర్శంగా తీసుకోవాలని చిరు ఆకాక్షించారు. ఇలాంటి దాతల వల్లే ఎంతోమందికి రక్తం అందిస్తున్నామని తెలిపారు. కాగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. భోళాశంకర్ తర్వాత చిరంజీవి నటిస్తోన్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. MEGASTAR #Chiranjeevi garu felicitates Maharshi Raghava's milestone 100th Blood Donation at @CCTBloodBank Chiranjeevi Blood Bank Boss @KChiruTweets#MegastarChiranjeevi pic.twitter.com/q6yNNGDZSz — Chiranjeevi Army (@chiranjeeviarmy) April 18, 2024 -
చిరంజీవి కోసం వంద సార్లు రక్తదానం చేసిన సీనియర్ నటుడు..(ఫొటోలు)
-
హైదరాబాద్‌లో స్టూడియోల మాటేమిటి?
సాక్షి, హైదరాబాద్: సినీ దర్శకుడు మహి వి.రాఘవకు ఏపీ ప్రభుత్వం రెండు ఎకరాల స్థలాన్ని సంతర్పణ చేయనుందంటూ ఎల్లోమీడియాలో వచ్చిన కథనంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెనుకబడిన తన ప్రాంత అభివృద్ధి కోసమే మదనపల్లి సమీపంలోని హార్సిలీ హిల్స్‌లో మినీ స్టూడియో నిర్మాణానికి స్థలం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దరఖాస్తు చేశానని.. తన ప్రాంతానికి మంచి చేయాలనే సంకల్పం లేకపోతే హార్సిలీ హిల్స్‌లో ఎందుకు స్టూడియో నిర్మించాలనుకుంటాను? అని రాఘవ ఇప్పటికే స్పష్టం చేయగా.. ఆంధ్రజ్యోతి మాత్రం యాత్ర–2 సినిమా చేసినందుకు రెండెకరాలు కట్టబెడుతున్నారంటూ తన అక్కసునంతా వెళ్ల్లగక్కింది. ఈ కథనాన్ని పలువురు సినీ ప్రముఖులు తప్పుపడుతున్నారు. చంద్రబాబు హయాంలో ఆయన సినీ దోస్తులకు హైదరాబాద్‌లో వందల ఎకరాలకు ఎకరాలు కట్టబెట్టారని.. ఇప్పుడు రాయలసీమ ప్రాంత వాసులకు ఉపయోగపడేలా మినీ స్టూడియో కోసం రెండెకరాలు అడిగితే బాబుకు బాకా ఊదే ఆంధ్రజ్యోతి, ఎల్లోమీడియా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడుతున్నారు. చంద్రబాబు ధారాదత్తం చేసిన భూముల గురించి ఆంధ్రజ్యోతి, ఎల్లోమీడియాకు ప్రశ్నించే దమ్ముందా? అని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌లో చంద్రబాబు ఇచ్చినవన్నీ ఒప్పేనా?: కల్యాణ్ ఈ మేరకు నటుడు, నిర్మాత, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు ఓ.కల్యాణ్ నిలదీశారు. ఈ మేరకు మంగళవారం ఒక వీడియో విడుదల చేస్తూ.. రాయలసీమలోని హార్సిలీ హిల్స్‌లో మినీ స్టూడియో కోసం డైరెక్టర్ మహి వి.రాఘవ్ రెండు ఎకరాల స్థలాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరడం తప్పయితే.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సినిమా రంగానికి చెందిన పలువురికి హైదరాబాద్‌లో స్థలాలు ఇవ్వడం తప్పు అనిపించలేదా? అని ప్రశ్నించారు. హార్సిలీ హిల్స్‌లో రెండు ఎకరాలు సంతర్పణ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని.. అసలు ఇంతవరకూ దానిపై ఎలాంటి జీవో రాలేదని.. ఎంత ధరకు ఇస్తున్నారు? దేనికోసం ఇస్తున్నారు? ఇల్లు కట్టుకోవడానికి ఇస్తున్నారా? లేదా స్టూడియో నిర్మాణానికా అన్నది ఆలోచించకుండా ఇష్టానుసారం రాయడం సరికాదన్నారు. హైదరాబాద్‌లో సినిమా వాళ్లకు చంద్రబాబు ఇచ్చినవన్నీ ఒప్పు అనుకున్నప్పుడు రాఘవకు ఇస్తే కూడా ఒప్పు అనుకోవాలి కదా? ఇక్కడ తప్పు అనుకున్నప్పుడు హైదరాబాద్‌లో స్థలాలు కట్టబెట్టడం కూడా తప్పే కదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఇచ్చిన స్థలాలన్నీ తప్పు అంటారా? ఒప్పు అంటారా? అన్న విషయం తెలుగు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను ప్రశ్నించారు. గతంలో ఎందరికో సబ్సిడీపై భూములు సినీ రంగం అభివృద్ధికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అక్కినేని నాగేశ్వరరావుకు ప్రభుత్వం 14 ఎకరాల స్థలాన్ని తక్కువ ధరకు స్టూడియో నిర్మాణానికి ఇచ్చిందని, ఎన్టీఆర్ కూడా ప్రభుత్వం ఇచ్చిన భూమిలో స్టూడియోలు కట్టుకున్నారని కల్యాణ్ చెప్పారు. పద్మాలయ స్టూడియో, రామానాయుడు స్టూడియో, ఆనంద్ సినీ సర్వీసెస్(5 ఎకరాలు), ప్రసాద్ ల్యాబ్‌కు కూడా అప్పట్లో సబ్సిడీ ధరకు ప్రభుత్వం స్థలం ఇచ్చిందన్నారు. ప్రసాద్ ల్యాబ్‌కు ఎదురుగా కె.రాఘవేంద్రరావు, ఆయన సోదరుడు కృష్ణమోహన్‌కు కూడా స్థలం ఇచ్చారని, రాఘవేంద్రరావు స్థలం వెనుక సంగీత దర్శకుడు చక్రవర్తికి కూడా స్థలం ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రసాద్ ఐ మ్యాక్స్‌కు నెక్లెస్ రోడ్డులో స్థలం ఇచ్చిన విషయం గుర్తులేదా? అని ప్రశ్నించారు. సినీ కార్మికుల కోసం ఫిల్మ్‌నగర్ సమీపంలోని చిత్రపురి కాలనీకి 67 ఎకరాల స్థలం ఇచ్చారని, తెలంగాణ ఏర్పడ్డాక డైరెక్టర్ ఎ¯Œ.. శంకర్‌కు స్టూడియో నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలాన్ని ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. నిర్మాత రామానాయుడుకు వైజాగ్ రుషికొండలో దాదాపు 20 ఎకరాల స్థలం ఇచ్చిన విషయం తెలియదా? అని ప్రశ్నించారు. -
ఢిల్లీ లిక్కర్ కేసులో మాగుంట రాఘవకు బెయిల్
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మాగుంట రాఘవకు ఊరట లభించింది. మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు 15 రోజుల పాటు బెయిల్ మంజూరు చేసింది. తన అమ్మమ్మ అనారోగ్యంతో ఉందని బెయిల్ కోసం రాఘవ హైకోర్టును ఆశ్రయించగా.. నేడు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. కాగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మాగుంట రాఘవను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫిబ్రవరి 10న అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. సౌత్ గ్రూప్ తరఫున చెల్లించిన రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారంలో రాఘవరెడ్డి పాత్ర ఉందని.. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఈడీ ఆరోపించింది. -
బుల్లితెరపై కందనూలు కుర్రాడు.. పదేళ్ల కష్టం తర్వాత..
సాక్షి, మహబూబ్‌నగర్: కష్టాన్ని నమ్ముకుంటే ఏదో ఒకరోజు ఫలితం ఉంటుందని నిరూపించాడు నాగర్‌కర్నూల్‌కు చెందిన రాఘవ. తాను పడ్డ పదేళ్ల కష్టానికి నేడు బుల్లితెర హీరో అయ్యాడు. కొందరు స్నేహితుల సహకారంతో నేడు ఓ ప్రముఖ ఛానల్లో ప్రసారమవుతున్న గీతగోవిందం సీరియల్లో హీరోగా.. రంగులరాట్నం అనే మరో సీరియల్లోనూ సెకండ్ లీడ్రోల్లో నటిస్తున్నారు. షార్ట్ ఫిలిమ్స్ నుంచి.. రాఘవ డిగ్రీ వరకు నాగర్‌కర్నూల్‌లోనే చదివారు. 2012లో కొందరు స్నేహితులతో కలిసి కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తీశారు. 2013లో హైదరాబాద్ బస్సెక్కా రు. అక్కడ జ్ఞానేశ్వర్ అనే షార్ట్ ఫిలిమ్ డైరెక్టర్‌తో కొన్నాళ్లు కథలు రాశారు. అయిదేళ్ల పాటు మోడలింగ్, షార్ట్‌ఫిలిమ్స్‌లోనూ ప్రయత్నాలు చేశారు. టిక్‌టాక్‌తోనే.. స్నేహితుడు శేఖర్ సలహా మేరకు 2018లో టిక్‌టాక్‌లో అడుగుపెట్టి సుమారు 250 వీడియోలు చేశారు. ఈ వీడియోలతో తెలుగు రాష్ట్రాల కంటే తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో రాఘవకు మంచి పేరొచ్చిందనే చెప్పాలి. తన ఫిజిక్, నటన సూర్యను పోలి ఉండటంతో జూనియర్ సూర్య అంటూ కామెంట్లు మేలు చేశాయి. వీడియోలు చూసిన ఓ డైరెక్టర్ ఫోన్లో సంప్రదించి అవకాశం ఇచ్చారు. చదవండి: ‘గృహలక్ష్మి’ సీరియల్ నా జీవితానికి టర్నింగ్ పాయింట్.. మొదటిసారి యాడ్‌లో.. దీపక్ అనే యాడ్స్ డైరెక్టర్ కడపకు చెందిన పీఎస్కే టీ పౌడర్ యాడ్‌లో నటించేందుకు అవకాశం ఇవ్వడంతో 2019లో యాడ్ షూటింగ్లో పాల్గొన్నారు. ఇదే ఏడాది నందగోకుల్ నెయ్యికి సంబంధించిన యాడ్లోనూ నటించారు. సీరియల్స్‌లో అవకాశం.. 2020 అక్టోబర్ 2న మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ నుంచి రాఘవకు ఫోన్ వచ్చింది. గీతగోవిందం సీరియల్లో హీరో కావాలని.. ఆడిషన్స్‌లో పాల్గొనే అవకాశం ఇచ్చారు. సెలెక్టయినా లాక్డౌన్ రావడంతో ఈ ప్రాజెక్టు వాయిదాపడింది. 2021లో అనిల్ అనే డైరెక్టర్ రంగులరాట్నం సీరియల్ తీస్తుండడంతో అందులో సెకండ్ హీరోగా రాఘవను ఎంపిక చేయగా మొదట ఇదే సీరియల్ టెలికాస్ట్ అయింది. జనవరి 2, 2022న గీతగోవిందం ప్రారంభం కాగా ఫిబ్రవరి 2న సీరియల్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. హీరో అవ్వడమే లక్ష్యం.. ప్రస్తుతం రెండు సీరియల్స్‌లో నటిస్తున్నా. వీటితో పాటే ఇతర ప్రయత్నాలు చేస్తున్నా. సినీ హీరో అవ్వడమే లక్ష్యం. ఈ ప్రయాణంలో చాలామంది స్నేహితులు సహకరించారు. ప్రోత్సహించడమే కాకుండా ఆర్థికంగా కూడా ఆదుకున్నారు. వారి సహకారం ఎప్పటికీ మర్చిపోను. – రాఘవ, సీరియల్ హీరో -
ప్రముఖ నటుడు మహర్షి రాఘవ ఇంట విషాదం
ప్రముఖ నటుడు మహర్షి రాఘవ ఇంట విషాదం చోటు చేసుకుంది. రాఘవ తల్లి గోగినేని కమలమ్మ(84) బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆమెకు ఇద్దరు కుమారులు కాగా అందులో రాఘవ పెద్దవాడు.రెండో కుమారుడు వెంకట్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. కమలమ్మ అంత్యక్రియలు గురువారం నాడు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో జరగనున్నట్లు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. ఇదిలా ఉండగా దర్శకుడు వంశీ రూపొందించిన `మహర్షి` చిత్రంలో హీరోగా నటించి పాపులర్ అయిన రాఘవ ఆ సినిమానే తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు. దాదాపు 170కిపైగా చిత్రాల్లో నటించారు. `చిత్రం భళారే విచిత్రం`, `జంబలకిడిపంబ`, `కోరుకున్న ప్రియుడు`, `శుభాకాంక్షలు`, `సూర్యవంశం` వంటి సినిమాలు ఆయనకు పేరు తెచ్చిపెట్టాయి. సినిమాల్లోనే కాకుండా పలు సీరియల్స్‌లోనూ ఆయన నటించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు మహర్షి రాఘవ. -
వనమా రాఘవ రిమాండ్ పొడిగింపు
పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచకు చెందిన మండిగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఖమ్మం జైలులో ఉన్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు కుమారుడు వనమా రాఘవ రిమాండ్‌ను పొడిగించారు. ఈ కేసులో రాఘవను 8వ తేదీన అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించిన విషయం విదితమే. ఆయన రిమాండ్ గడువు శుక్రవారంతో ముగియగా శనివారం ఆన్లైన్ విధానంలో కోర్టుకు హాజరుపరిచారు. ఈ సందర్భంగా మరో 14రోజుల పాటు అంటే.. వచ్చేనెల 4వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ కొత్తగూడెం రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముద్దసాని నీలిమ ఆదేశాలు వెలువరించారు. కాగా, ఇప్పటికే రాఘవ తరఫున బెయిల్ కోసం పిటిషన్ వేయగా తిరస్కరణకు గురైంది. అలాగే, ఇదే కేసులో నిందితులుగా ఉన్న రామకృష్ణ తల్లి సూర్యావతి, సోదరి మాధవి కూడా బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా శుక్రవారం తిరస్కరించారు. దీంతో వీరు హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిసింది. ఇక రాఘవను విచారణ కోసం ఈసారైనా పోలీసులు కస్టడీకి కోరతారా, లేదా అన్నది త్వరలోనే తేలనుంది. జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ పట్టణ పోలీసుస్టేషన్లలో మరో రెండు కేసులకు సంబంధించి పోలీసులు పిటీ (ప్రిజనల్ ట్రాన్స్ఫర్) వారెంట్లు దాఖలు చేయడం కూడా రిమాండ్‌ను పొడిగించేందుకు దోహదపడినట్లు తెలుస్తోంది. -
వనమా రాఘవ రిమాండ్ రిపోర్ట్ ను కోర్టుకు సమర్పించిన పోలీసులు
-
పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేయాలి : కొ౦డారఘవరెడ్డి
-
కంప్యూటర్ ముచ్చట తీరుస్తున్న కుర్రాళ్లు!
మాటెత్తితే ప్రపంచమంతా డిజిటల్ మయమైందని అంటుంటాం.. జనాలు ఆఫ్‌లైన్‌లో కనపడటం లేదు, ఆన్‌లైన్‌కే పరిమితమయ్యారు అని తిట్టుకొంటాం... పిల్లలు మైదానాల్లో ఆడుకోవడం మానేసి కంప్యూటర్గేమ్స్కు పరిమితమయ్యారన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తాం...యువత సోషల్నెట్వర్కింగ్కు బానిస అయ్యిందని ఆందోళన వ్యక్తం చేస్తాం... అయితే ప్రభుత్వ అధికార గణాంకాల ప్రకారం చూసుకొన్నా ఇప్పటికీ మన దేశంలో ప్రతి పది ఇళ్లకూ ఒకే కంప్యూటర్ ఉంది! మరి ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి, పీసీని సామాన్యుల దరి చేర్చడానికి ప్రయత్నిస్తున్నారు... ముకుంద్, రాఘవలు. విద్యా, వైజ్ఞానిక, సంఘ జీవనంలో ఇప్పుడు కంప్యూటర్ ఒక తప్పనిసరి అవసరం. మరి అందుకోసం ‘మా వల్లనే ఐటీ సెక్టార్ అభివృద్ధి జరిగిందని, సెల్‌ఫోన్ కూడా తమ వల్లనే సామాన్యులకు దగ్గరైంది...’ అని డబ్బా కొట్టుకొనే నేతలు ఏం చేస్తున్నారో కానీ... ఇద్దరు యువకులు మాత్రం ఆరేళ్లుగా ఒక అద్వితీయ ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ మధ్యతరగతి కుటుంబాలకు పీసీని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తక్కువ ధరలోనే పీసీలను అందుబాటులో ఉంచి.. చాలా మంది ముచ్చట తీరుస్తున్నారు. మరి అదెలా సాధ్యం అవుతోందంటే... మన మెట్రో నగరాల్లో పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఉన్నాయి... వాటిల్లో వందల, వేలాది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మరోవైపు పీసీల్లో అధునాతన వెర్షన్లు ఒకదాని తర్వాత ఒకటిగా వస్తున్నాయి. ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్డేట్ చేసుకోవాల్సిన రీతిలోనే చాలా సార్లు పీసీలను కూడా మార్చేస్తూ ఉంటాయి ఐటీ కంపెనీలు. మరి అలా మార్చేయాల్సి వచ్చినప్పుడు పాత కంప్యూటర్లను ఏం చేస్తారు?! దాదాపు ఆరేళ్ల క్రితం ఈ సందేహం వచ్చిందట ముకుంద్‌కు. చెన్నైకి చెందిన ఈ యువకుడు అప్పటికే గ్రాడ్యుయేషన్‌ను మధ్యలోవదిలి కంప్యూటర్ విడిభాగాలను అమ్మే తన స్నేహితుడితో కలిసి పనిచేస్తున్నాడు. ఈ సందేహం వచ్చిన వెంటనే కొన్ని ఐటీ కంపెనీ ఆఫీసులను సందర్శించి అక్కడి పనితీరు గమనించాడు. చాలా చోట్ల పనితీరు బాగానే ఉన్నా..పాత డెస్క్‌టాప్ పీసీలను స్టోర్‌రూమ్‌లలోనూ, పార్కింగ్ ప్లేస్‌లలోనూ పెట్టి ఉంచడాన్ని గమనించాడు. ‘ఇ-వేస్ట్’ అంటూ కంపెనీలు పక్కన పెట్టేసిన ఆ పీసీలను సేకరించడం మొదలు పెట్టాడు ముకుంద్. ఈ విషయంలో ముకుంద్‌కు అతడి సమీప బంధువు రాఘవ తోడయ్యాడు. రూ.4,500 ధర నుంచే దొరుకుతాయట ఐటీ కంపెనీల వద్ద సెకండ్ హ్యాండ్ కంప్యూటర్లు. వాటి కాన్ఫిగరేషన్‌ను బట్టి.. తక్కువ ధర, తగిన ధరను చెల్లిస్తూ వాటిని కొనడం మొదలు పెట్టారు వీళ్లిద్దరూ. అలా సేకరించిన కంప్యూటర్లతో 2009లో బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ‘రెన్యూ ఐటీ’ పేరుతో ఒక షాప్‌ను నెలకొల్పి వాటిని అమ్మడం మొదలు పెట్టారు. మొదట కొందరు ఎన్జీవోలకు తక్కువ ధరకే ఈ కంప్యూటర్లను అమ్మారట. ఎటువంటి ప్రచార అవసరాలూ లేకుండా ఒకరికి మరొకరు చెప్పడం ద్వారా వీళ్ల గురించి అనేక మందికి తెలిసింది. సెకండ్ హ్యాండ్ కంప్యూటర్లు కొనడానికి అందరూ ఎగబడ్డారు. విద్యాసంస్థల వాళ్లు, విద్యార్థులు, గ్రాఫిక్ డిజైనర్లు, ఆర్జేలు, డాక్టర్లు, టీచర్ల దగ్గర నుంచి కారు డ్రైవర్ల వరకూ అన్ని వర్గాల ప్రజలూ తమ వద్దకు వచ్చి కంప్యూటర్లను కొనుగోలు చేయడం మొదలు పెట్టారని ముకుంద్, రాఘవలు చెబుతారు. అయితే ఇలా సెకండ్ హ్యాండ్ కంప్యూటర్లు అమ్ముతున్న వీళ్ల అనుమతి లేదంటూ ప్రభుత్వాధికారులు వెంటపడ్డారు. లంచం ఇస్తే అనుమతి ఇస్తామని ఆఫర్ కూడా ఇచ్చారు. అలా డిమాండ్ చేసిన ఒక అధికారికి తమ వద్ద అమ్మకానికి ఉన్న ల్యాప్‌టాప్‌ను ఇచ్చి వదిలించుకొన్నారీ యువకులు. 2011లో భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఇ-వేస్ట్ మేనేజ్మెంట్ చట్టం’ వీళ్లకు వరంగా మారింది. అ చట్టం ప్రకారం అన్ని ఐటీ కంపెనీలూ.. తమ వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ వేస్ట్‌ను గుర్తింపు పొందిన అమ్మకం దారులకు అమ్మాల్సి ఉంటుంది. అప్పటికే ఆ వ్యాపారంలో గుర్తింపు పొందిన ‘రెన్యూ ఐటీ’కి తిరుగులేకుండా పోయింది. ప్రస్తుతం వీళ్లిద్దరి వ్యాపారం ఏడాదికి ఆరు కోట్ల రూపాయల టర్నోవర్‌కు చేరుకొంది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల్లోని అనేక ఐటీ కంపెనీల దగ్గర నుంచి వృథాగా ఉన్న పీసీలను, ల్యాప్‌టాప్‌లను వీళ్లు కొనుగోలు చేస్తున్నారు. కంపెనీలు అతి తక్కువ ధరకు అయినా వాటిని వదిలించుకోవాలని భావిస్తుండటం వీళ్లకు కలిసొస్తోంది. ‘రెన్యూ ఐటీ’కి కూడా పెద్దగా లాభాపేక్ష లేదని, తాము గ్రామీణ భారతీయులకు, పేద, మధ్య తరగతి కుటుంబాలకు కంప్యూటర్లను అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం చేస్తున్నామని ముకుంద్, రాఘవలు చెబుతున్నారు. కంప్యూటర్ కొనడం అనేది భారతీయ కుటుంబాలకు ఇప్పుడు ఒక సంబరం. కానీ ధరల విషయంలో మాత్రం చాలా కుటుంబాలకి అందడం లేదవి. ఇటువంటి నేపథ్యంలో తమకు తోచిన పరిష్కార మార్గం ద్వారా చాలా మంది కంప్యూటర్ కోరికను తీరుస్తున్నారు ఈ యువకులు. అనేక భారతీయ కుటుంబాలను డిజిటల్ బూమ్‌లో భాగం చేస్తున్న ఈ యువకులను ప్రత్యేకంగా అభినందించవచ్చు. కంప్యూటర్ కొనడం అనేది భారతీయ కుటుంబాలకు ఇప్పుడు ఒక సంబరం. కానీ ధరల విషయంలో మాత్రం చాలా కుటుంబాలకు అందడం లేదవి. ఇటువంటి నేపథ్యంలో తమకు తోచిన పరిష్కార మార్గం ద్వారా చాలామంది కంప్యూటర్ కోరికను తీర్చుతున్నారు ఈ యువకులు. -
బడుగులపై పిడుగు
బల్లికురవ, ఇంకొల్లు, న్యూస్‌లైన్: బల్లికురవ మండలం కొత్తూరులో బత్తిన హనుమంతరావు, పెంట్యాల ఆంజనేయులుకు చెందిన మెట్టపొలం ఆరు ఎకరాలను అదే గ్రామానికి చెందిన పరిమి శింగరకొండ, యన్నం ఆంజనేయులు, మన్నెం అమరయ్యలు తలా రెండెకరాల చొప్పున కౌలుకు తీసుకుని మిర్చి సాగుచేశారు. వాతావరణం అనుకూలించడంతో పంట దిగుబడులు కూడా ఆశాజనకంగానే ఉన్నాయి. కోసిన మిర్చిని పొలాల్లోని కళ్లాలు చేసి ఎండబెట్టారు. సోమవారం ఉదయం ఆకాశం మేఘావృతమై ఉండటంతో వర్షం పడుతుందేమోనని పరిమి శింగరకొండ (45), యన్నం ఆంజనేయులు కుమారుడు రాఘవ (16), మన్నెం అమరయ్య కుమారుడు పవన్‌కుమార్ (12) కళ్లాల్లో ఉన్న మిర్చికి పరదాలు కప్పేందుకు పొలం వెళ్లారు. పరదాలు కప్పిన తరువాత వర్షం పెరగడంతో అక్కడే పరదాలతో వేసిన గుడారం కిందకు ముగ్గురూ చేరారు. ఆ గుడారమే వారి పాలిట మృత్యుకుహరమైంది. గుడారంపై పిడుగు పడటంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు. పశువులు తోలుకుని ఉదయం 11 గంటల సమయంలో పొలం చేరుకున్న గ్రామస్తులు ముగ్గురూ మరణించడం గమనించి గ్రామస్తులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని అద్దంకి సీఐ వీవీ రమణకుమార్ సందర్శించి మృతుల కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. వీఆర్వో పోతురాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. రెక్కాడితేగానీ..డొక్కాడని కుటుంబాలు: పరిమి శింగరకొండ, యన్నం ఆంజనేయులు, మన్నెం అమరయ్యలు బంధువులు. వీరు ముగ్గురికీ సెంటు భూమిలేదు. రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు వారివి. వీరు కలిసి పొలం కౌలుకు తీసుకుని తలా రెండెకరాల మెట్ట, రెండెకరాల మాగాణిలో మిర్చి, వరి సాగు చేస్తూ కుటుంబాలు నెట్టుకొస్తున్నారు. పిడుగుపాటుకు మృతిచెందిన శింగరకొండకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆంజనేయులుకు కుమారుడు రాఘవ, కుమార్తె అంజమ్మ ఉన్నారు. అంజమ్మను శింగరకొండ కుమారుడు శివకు ఇచ్చి వివాహం చేశారు. రాఘవ ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షల్లో సీ గ్రేడులో ఉత్తీర్ణుడయ్యాడు. ఇంటర్మీడియెట్‌లో చేరే పనిలో ఉన్నాడు. అమరయ్యకు ఇద్దరు కుమారులు కాగా.. పెద్ద కుమారుడు పవన్‌కుమార్ చనిపోయాడు. దీంతో ఈ మూడు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. మృతుల బంధువుల రోదనలతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పూసపాడులో... ఇంకొల్లు మండలం పూసపాడుకు చెందిన గంటా వెంకట సుబ్బారావు మిరప సాగు చేశాడు. కోతలు పూర్తయి కళ్లాల్లో ఆరబెట్టారు. సోమవారం తెల్లవారుజామున ఆకాశం మేఘావృతమై ఉండటంతో మరో ఐదుగురితో కలిసి మిర్చిపై పరదాలు కప్పేందుకు వెళ్లారు. మిరపకాయలు తడవకుండా పట్టలు కప్పుతుండగా ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో శీలం కనకాంబరం (42) అనే కూలీ అక్కడికక్కడే మృతిచెందాడు. పక్కనే ఉన్న మృతుని కుమారుడు క్రాంతికుమార్, గంటా వెంకట సుబ్బయ్య, శీలం అనీల్, శీలం సన్ని, మద్దిరాల సుందరరావులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన చీరాల ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీఆర్ఓ జి.కోటయ్య ఫిర్యాదు మేరకు ఇంకొల్లు ఏఎస్ఐ ఆర్.ఎస్.ఎన్ మూర్తి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబాలను గ్రామ సర్పంచ్ పర్చూరు సింగయ్యతో పాటు పరామర్శించారు. కనకాంబరం వ్యవసాయ కూలిపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇద్దరు ఆడపిల్లలకు వివాహం చేశాడు. కుమారుడిని కష్టపడి చదివిస్తున్నాడు. పిడుగుపడి కనకాంబరం మృతిచెందగా..తండ్రికి సాయమందించేందుకు వెళ్లిన కొడుకు క్రాంతికుమార్ గాయాలపాలవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
పంబలకడి జంబ సినిమా స్టిల్స్