మెగాస్టార్ చిరంజీవి తన వంతు సాయంగా సమాజం కోసం కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పేరిట సేవా కార్యక్రామాలు చేస్తూ ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నారు. గత 26 ఏళ్లుగా పేద ప్రజలకు ఉచితంగా రక్తనిధులు సమకూరుస్తున్నారు. అయితే చిరంజీవి అభిమానులు ప్రతి ఏటా రక్తదానం క్యాంపులు కూడా నిర్వహిస్తుంటారు.
అలా బ్లడ్ బ్యాంక్ ప్రారంభం నుంచి రక్తదానం చేసే వారిలో నటుడు మహర్షి రాఘవ ముందు వరుసలో ఉంటారు. ఇప్పటి వరకు ఆయన వందసార్లు చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయనను మెగాస్టార్ అభినందించారు. ప్రత్యేకంగా ఇంటికి ఆహ్వానించి సత్కరించారు. ఆయన సేవలను మెగాస్టార్ కొనియాడారు. రక్తదానం విషయంలో ప్రతి ఒక్కరూ రాఘవను ఆదర్శంగా తీసుకోవాలని చిరు ఆకాక్షించారు. ఇలాంటి దాతల వల్లే ఎంతోమందికి రక్తం అందిస్తున్నామని తెలిపారు.
కాగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. భోళాశంకర్ తర్వాత చిరంజీవి నటిస్తోన్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
MEGASTAR #Chiranjeevi garu
— Chiranjeevi Army (@chiranjeeviarmy) April 18, 2024
felicitates Maharshi Raghava's milestone 100th Blood Donation at @CCTBloodBank Chiranjeevi Blood Bank
Boss @KChiruTweets#MegastarChiranjeevi pic.twitter.com/q6yNNGDZSz
Comments
Please login to add a commentAdd a comment