
ప్రముఖ నటుడు మహర్షి రాఘవ ఇంట విషాదం చోటు చేసుకుంది. రాఘవ తల్లి గోగినేని కమలమ్మ(84) బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆమెకు ఇద్దరు కుమారులు కాగా అందులో రాఘవ పెద్దవాడు.రెండో కుమారుడు వెంకట్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. కమలమ్మ అంత్యక్రియలు గురువారం నాడు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో జరగనున్నట్లు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు.
ఇదిలా ఉండగా దర్శకుడు వంశీ రూపొందించిన `మహర్షి` చిత్రంలో హీరోగా నటించి పాపులర్ అయిన రాఘవ ఆ సినిమానే తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు. దాదాపు 170కిపైగా చిత్రాల్లో నటించారు. `చిత్రం భళారే విచిత్రం`, `జంబలకిడిపంబ`, `కోరుకున్న ప్రియుడు`, `శుభాకాంక్షలు`, `సూర్యవంశం` వంటి సినిమాలు ఆయనకు పేరు తెచ్చిపెట్టాయి. సినిమాల్లోనే కాకుండా పలు సీరియల్స్‌లోనూ ఆయన నటించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు మహర్షి రాఘవ.
Comments
Please login to add a commentAdd a comment