పాఠశాలలో కరోనా కలకలం | Corona Cases In Schools | Sakshi
Sakshi News home page

పాఠశాలలో కరోనా కలకలం

Published Sun, Sep 26 2021 3:06 AM | Last Updated on Sun, Sep 26 2021 3:06 AM

Corona Cases In Schools - Sakshi

టేకులపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం దంతెలతండా ప్రాథమిక పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులకు, పాఠశాల ఆవరణలోనే ఉన్న అంగన్‌వాడీ కేంద్రంలో ఓ చిన్నారికి శనివారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

శుక్రవారం పాఠశాలకు చెందిన ఓ విద్యార్థి, మండలంలోని ఇప్పలతండాలో పనిచేస్తున్న అంగన్‌వాడీ టీచర్‌ కోవిడ్‌ బారిన పడడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. వారి ఆదేశాల మేరకు పాఠశాలలో శనివారం 29 మంది విద్యార్థులకు, పాఠశాల ఆవరణలోనే ఉన్న అంగన్‌వాడీ కేంద్రంలో పరీక్షలు నిర్వహించగా ఈ మేరకు కేసులు వెలుగుచూశాయి. డీఈవో సోమశేఖరశర్మ, ఎంఈఓ ఠాకూర్‌ రాంసింగ్‌ పాఠశాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మూడు రోజుల పాటు స్కూల్‌కు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement