సాక్షి, లక్నో : దేశంలో కరోనా వ్యాప్తి స్వల్పంగా తగ‍్గుముఖం పట్టినట్టుగా కనిపిస్తోంది. కొన్ని రోజులుగా వివిధ రాష్ట్రాల్లో పాజిటవిటీ రేటు, పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. దీంతో ఇప్పటి వరకు విధించిన కోవిడ్ నిబంధనలను ప్రభుత్వాలు సడలిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉత‍్తరప్రదేశ్ సర్కార్ శుక్రవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ కరోనా గైడ్ లైన్స్ సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తెరుచుకునేవి, మూసివేసినవి ఇవే..
1. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలు సోమవారం నుంచి తెరుచుకోనున్నాయి. 1 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు భౌతిక తరగతులు ప్రారంభం కానున్నాయి.
2. ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల్లో పూర్తి స్థాయిలో ఉద్యోగులు పని చేసేందుకు అనుమతి.
3. జిమ్స్ తెరుచుకోనున్నాయి.
4. రెస్టారెంట్లు, సినిమా హాల్స్, హోటల్స్ తెరుచుకోనున్నాయి. కానీ, తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలి. ఆ ప్రాంతాల్లో కోవిడ్ డెస్క్ లను ఏర్పాటు చేయాలి.
5. స్విమ్మింగ్ పూల్స్ మూసివేత.
కాగా, గడిచిన 24 గంటల్లో యూపీలో 2,321 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అవగా, 13 మంది వైరస్ కారణంగా మరణించారు. మరోవైపు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment