రెండో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టిందని.. | Father Kills Baby Girl in Bhadradri Kothagudem | Sakshi
Sakshi News home page

రెండో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టిందని..

Oct 1 2019 11:13 AM | Updated on Oct 1 2019 11:26 AM

Father Kills Baby Girl in Bhadradri Kothagudem - Sakshi

సాక్షి, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. అభం శుభం తెలియని నెల రోజుల పసికందును కన్నతండ్రే నీటి తొట్టిలో ముంచి హత్య చేసిన ఘటన చర్ల మండలం రేగుంటలో జరిగింది. సూర్యతేజ, అఖిల దంపతులకు ఇటీవలే ఆడబిడ్డ జన్మించింది. ఈ క్రమంలోనే తెల్లవారుజామున చిన్నారి కనిపించకపోవడంతో భర్త సూర్యతేజను అఖిల నిలదీసింది. సూర్యతేజ పొంతనలేని సమాధానాలు చెప్తుండటంతో అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండో కాన్పులో కూడా ఆడపిల్ల పుట్టిందన్న అక్కసుతో సూర్యతేజనే ఈ దురగతానికి ఒడిగట్టాడని అఖిల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement