భద్రాచలం: భద్రాచలం వద్ద ఈసారి గోదావరి ఉధృతి పాత రికార్డులన్నీ బద్దలుగొట్టే పరిస్థితి కనిపిస్తోంది. గోదావరి చరిత్రలో 1986 ఆగస్టు 16న 75.6 అడుగుల వరద రావడం ఇప్పటివరకు ఉన్న రికార్డు. ఆ తర్వాత 1990 ఆగస్టు 24న 70.8 అడుగుల వరద రెండో స్థానంలో నిలిచింది.
ఈసారి వరద రెండో రికార్డును శుక్రవారం రాత్రి 8గంటలకు దాటేసింది. ఇప్పటివరకు జూలై నెలలో గోదావరికి వచ్చిన వరదల్లో ఇదే అత్యధికం. ప్రవాహం మరింతగా పెరుగుతుందన్న అంచనాల మేరకు.. 1986 నాటి రికార్డును కూడా తాజా వరద అధిగమిస్తుందా అన్న చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే జూలై నెలలోనే కాకుండా.. గోదావరి వరదల్లోనే ఇదే అతి పెద్దదిగా నమోదు కానుంది.
Comments
Please login to add a commentAdd a comment