సాక్షి, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో సూసైడ్ నోట్ సంచలనంగా మారింది. సూసైడ్ నోట్‌లో టీఆర్‌ఎస్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడి పేరు వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో వనమా రాఘవేందర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పాల్వంచ ఎఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. ప్రస్తుతం వనమా రాఘవేందర్ పరారీలో ఉన్నాడని, అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నామని తెలిపారు. సూసైడ్ లెటర్‌లో రామకృష్ణ తల్లి సూర్యవతి, అక్క మాధవీ పేర్లు కూడా ఉన్నాయనీ.. ఘటనపై పూర్తి విచారణ జరుగుతుందని ఎఎస్పీ తెలిపారు.
చదవండి: భార్యతో వివాహేతర సంబంధం.. భర్త, మరో ముగ్గురు కలిసి..
పాత పాల్వంచ పరిధిలోని ఒక ఇంట్లో గ్యాస్‌లీక్ చేసుకుని కుటుంబం సాముహిక ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. నాగ రామకృష్ణ, శ్రీలక్ష్మి దంపతులు. వీరికి సాహితి, సాహిత్య అనే ఇద్దరు పిల్లలు. నాగ రామకృష్ణ మీ సేవాలోఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఘటనలో దంపతులతో సహా చిన్న కూతురు సజీవ దహనమయ్యారు. మరో కూతురుని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి.. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment