సాక్షి, హైదరాబాద్: తన కొడుకు వనమా రాఘవపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు బహిరంగ లేఖ రాశారు. రాఘవను నియోజకవర్గానికి, పార్టీ కార్యాకలాపాలకు దూరంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాఘవ విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు. వనమా రాఘవను పోలీసులకు అప్పగించేందుకు సహకరిస్తానని తెలిపారు. పోలీసులు ఎప్పుడు పిలిచినా తన కొడుకును అప్పగిస్తానని వెల్లడించారు.
కాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవపై తీవ్ర ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. భార్య గురించి ఏ భర్త వినకూడని మాటలు రాఘవేందర్ నోటి నుంచి విన్నానంటూ రామకృష్ణ సెల్ఫీ వీడియోలో పేర్కొనడం తాజాగా తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం వనమా రాఘవ పరారీలో ఉన్నారు. అయితే ఈ వ్యవహారంలో వనమా రాఘవకు ఉచ్చు బిగుసుకుంటుండటంతో కొడుకు నిర్వాకంపై కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తాజాగా స్పందించారు. ఈ మేరకు గురువారం ఆయన బహిరంగ లేఖ విడుదల చేశారు.
చదవండి: సంచలనం రేకెత్తిస్తున్న రామకృష్ణ సెల్ఫీ వీడియో..
Comments
Please login to add a commentAdd a comment