family suicide
-
ముగ్గురి ప్రాణం తీసిన ఆన్లైన్ బెట్టింగ్..
రాజేంద్రనగర్ (హైదరాబాద్): ఆన్లైన్ బెట్టింగ్ ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. ఆన్లైన్ బెట్టింగ్ విషయంలో దంపతుల మధ్య జరిగిన గొడవలే ఈ మరణాలకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి ఈ ఘటన వెలుగులోకి వచి్చంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన ఆనంద్ (38) ఇందిర (36) దంపతులు. వీరికి శ్రేయాన్స్ (4) ఒక్కడే కొడుకు. పాల వ్యాపారం చేసే ఆనంద్ మూడేళ్ల క్రితం నుంచి బండ్లగూడజాగీర్ సన్‌సిటీ ఏరియాలోని యమున అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్నాడు. ఆనంద్ ఆన్లైన్లో గేమ్స్ ఆడుతూ బెట్టింగ్‌ల కారణంగా దాదాపు రూ.15 లక్షల వరకు అప్పులు చేసి, ఆర్థికంగా చితికిపోయాడు. దీంతో దంపతుల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. 15 రోజుల క్రితం ఇరు కుటుంబాలకు చెందిన వారితోపాటు స్నేహితులు వచ్చి ఆన్లైన్లో గేమ్స్ ఆడొద్దని, బుద్ధిగా ఉండి కుటుంబాన్ని పోషించుకోవాలని చెప్పారు. అయినా ఆనంద్ ప్రవర్తనలో మార్పు రాలేదు. మూడురోజుల క్రితం మరోసారి ఆనంద్ ఆన్లైన్ బెట్టింగ్ ఆడినట్టు సమాచారం. ఇదే విషయమై సోమవారం ఉదయం నుంచి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గొడవ జరిగిన సమయంలో ఇందిర తన కుటుంబసభ్యులకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. ఆనంద్ కూడా తన స్నేహితులతోపాటు బంధువులకు ఫోన్ చేసి తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సమాచారం అందించాడు. దీంతో ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలతోపాటు బంధుమిత్రులు ఫోన్లు చేసినా, ఇద్దరూ లిఫ్ట్ చేయలేదు. దీంతో వారంతా కంగారుపడి అపార్ట్మెంట్ వచ్చి చూడగా, మృతదేహాలు కనిపించాయి. వెంటనే రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలాన్ని చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. భార్యను చంపి.. ఆపై ఆత్మహత్య ! ఘటనాస్థలిని పరిశీలించాక...దంపతులు మధ్య గొడవ జరిగి ఉండొచ్చని, ఆ క్రమంలోనే పెనుగులాటలో భార్య చంపి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత కొడుకుకు క్రిమిసంహారక మందు తాగించి, ఆనంద్ కూడా అదే మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. తండ్రీకొడుకు నోటి నుంచి నురగలు వస్తున్న ఆనవాళ్లు కనిపించాయి. అయితే ఇందిర నోటి నుంచి ఎలాంటి నురుగులు రాలేదు. పోస్టుమార్టం నివేదిక తర్వాత అసలు విషయాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు. ఉదయం నుంచే దంపతులు గొడవ పడుతున్నట్టు వాచ్మెన్ పోలీసులు తెలిపాడు. -
Anakapalle: జ్యూయలరీ వ్యాపారి కుటుంబం ఆత్మహత్య
పనులు పూర్తి చేసుకొని నాన్న ఇంటికొస్తే పిల్లలకు ఆనందం. భర్త కోసం ఎదురుచూసే గృహిణి మనసుకు నిశ్చింత. ఆయన వస్తూ వస్తూ తినడానికేమైనా తెస్తే పిల్లలు ఎగబడి తింటారు. ఈరోజూ అలాగే చేశారు. ఆయన బిర్యానీ తెస్తే అందరూ చక్కగా తిన్నారు. ముద్ద నోట్లో పెట్టే సరికి వారికి తెలీదు.. క్షణాల్లో ప్రాణం తీసే సైనెడ్ అందులో ఉందని. తెలుసుకునే లోగానే విగత జీవులయ్యారు.. తొమ్మిదేళ్ల పాపాయిని ఒంటరిగా ఒదిలేసి. తింటుండగా వాంతి కావడంతో ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. సాక్షి, అనకాపల్లి: పట్టణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక జ్యూయలరీ వ్యాపారి కుటుంబ సభ్యులతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బిర్యానీలో ౖసైనెడ్ కలిపి భార్య, ముగ్గురు పిల్లలతో తినిపించి బలవన్మరణానికి యత్నించాడు. ఈ హృదయవిదారక ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. వీరిలో నలుగురు మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన జ్యూయలరీ వ్యాపారి కొడవలి శివరామకృష్ణ తన కుటుంబంతో ఏడాది క్రితం అనకాపల్లికి వచ్చారు. అనకాపల్లి టౌన్లో పెరుగుబజారు సమీపంలో జ్యూయిలరీ షాపును ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేసుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులతో స్వస్థలాన్ని వీడిన రామకృష్ణ స్థానిక ఉడ్ పేటలో ఫైర్ స్టేషన్ పక్కన లక్ష్మీ ప్యారడైజ్ అపార్ట్మెంట్లో భార్య మాధవి దేవి (40), కుమార్తెలు వైష్ణవి (15), జాహ్నవి (12), కుసుమప్రియ తో కలిసి నివాసముంటున్నారు. తన పిల్లలను స్థానిక సిటీ పబ్లిక్ స్కూల్లో చదివిస్తున్నారు. పిల్లలు తొమ్మిది, ఏడు, మూడు తరగతులు చదువుతున్నారు. అనకాపల్లికి వచ్చిన ప్రారంభంలో రామకృష్ణ ఓ బంగారం షాపులో ఉద్యోగం చేసేవాడు. ఆ తరువాత సొంతంగా జ్యూయలరీ షాపు పెట్టుకున్నాడు. ఏడాదిన్నర నుంచి అనకాపల్లి టౌన్లోనే ఉన్నా వ్యాపారరీత్యాగానీ, పని నిమిత్తంగానీ ఎవరితోనూ వివాదం పెట్టుకున్న సందర్భాలు లేవు. అయితే ఆ కుటుంబం చుట్టుపక్కల వారితో కలివిడిగా ఉండేవారు కాదని, ముభావంగా అంటీముట్టనట్టు ఒంటరిగా ఉండేవారని స్థానికులు తెలిపారు. భార్యాపిల్లలకు తెలీకుండా! రామకృష్ణ గురువారం రాత్రి 9 గంటలకు దుకాణం నుంచి ఇంటికి వచ్చాడు. ౖసైనెడ్ కలిపిన బిర్యానీ తీసుకొచ్చాడు. ఆ విషయం భార్యాపిల్లలకు తెలీదు. కుటుంబమంతా బిర్యానీ తిన్నారు. అంతలో చిన్న కూతురు కుసుమ వాంతి చేసుకుంది. కొద్ది క్షణాల్లోనే మిగతావారంతా నేలకొరిగారు. ఈ విషయం గమనించిన కుసుమ పక్కింటికి వెళ్లి అమ్మ, నాన్న నిద్రపోయి లేవలేదు అని ఏడుస్తూ చెప్పింది. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వాంతులు చేసుకున్న చిన్నారిని హుటాహుటిన స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. అనంతరం కేజీహెచ్‌కు తరలించారు. మూడేళ్లుగా దూరం రామకృష్ణ అప్పులు చేసి ఎవరికీ తెలియకుండా అనకాపల్లి టౌన్లో నివసిస్తున్నట్టు అనకాపల్లి చేరుకున్న అతని సోదరుడు వెంకటేశ్వరరావు చెప్పిన వివరాల ప్రకారం తెలుస్తోంది. సుమారుగా మూడేళ్లుగా కుటుంబ సభ్యులతో సఖ్యత లేదని తెలుస్తోంది. మృతదేహాలను చూసేందుకు ఒక సోదరుడు మినహా కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదు. ఆధారాలు లేవు ఘటన స్థలంలో ఆత్మహత్యకు సంబంధించిన ఎటువంటి ఆధారాలూ లభించలేదని డీఎస్పీ వి.సుబ్బరాజు చెప్పారు. క్లూస్‌టీమ్ ఇంటిలో అన్ని గదులనూ క్షణంగా పరిశీలించిందని పేర్కొన్నారు. బిర్యానీ ప్యాకెట్లతో భోజనం చేస్తూ అక్కడిక్కడే నలుగురు మృతి చెందగా, కుసుమప్రియ అపాయం నుంచి తప్పించుకుందని, ప్రస్తుతం కేజీహెచ్‌లో కోలుకుంటోందన్నారు. శివరామకృష్ణ అన్నయ్య వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ దాడి మోహనరావు చెప్పారు. -
ఏం కష్టం వచ్చిందో.. ముగ్గురు చిన్నారులు సహా కుటుంబం ఆత్మహత్య
సూరత్: గుజరాత్లో విషాదం చోటుచేసుకుంది. ఏం కష్టమొచ్చిందో ఏమో ఓ కుటుంబమంతా ఆత్మహత్యకు పాల్పడింది. ముగ్గురు చిన్నారులతో సహా కుటుంబంలోని ఏడుగురు విగతజీవులుగా మారారు. తల్లిదండ్రులు, భార్య, పిల్లలకు విషమిచ్చిన ఓ వ్యాపారి ఉరేసుకొని తాను కూడా ప్రాణాలు వదిలాడు. కుటుంబం మొత్తం మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా అలజడి నెలకొంది. ఈ ఘోర ఘటన సూరత్‌లో శుక్రవారం అర్ధరాత్రి వెలుగుచూసింది. వివరాలు.. సూరత్‌లోని పాలన్ పూర్లోని ఓ అపార్ట్ మెంట్లో ఫర్నీచర్ వ్యాపారి మనీష్ సోలంకి కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు నివసిస్తున్నారు. శుక్రవారం రాత్రి మనీష్ తన పిల్లలకు, తల్లిద్రండులకు, భార్యకు విషమిచ్చి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ముగ్గురు పిల్లలతో సహా కుటుంబంలోని ఏడుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. శనివారం ఉదయం మనీష్ సహోద్యోగి కాల్ చేయగా లిఫ్ట్ చేయకపోవడంతో ఇంటికి చేరుకున్నాడు. ఇంటి తలుపులు కూడా తీయకపోవడంతో అనుమానం వచ్చి వెనక డోర్ వద్దనున్న కిటీకిని ధ్వంసం చేసి ఇంట్లోగా వెళ్లగా ఈ దారుణం గురించి తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటన స్థలంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. మృతులను మనీష్ సోలంకి(35) అతని భార్య రీటా(32), ముగ్గురు పిల్లలు, మనీష్ తల్లిదండ్రులు కాంతిలాల్(65), శోభన(60) గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం అప్పు తీసుకున్నవారు తిరిగి ఇవ్వకపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువకావడంతో మనీష్ సోలంకి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. చదవండి: పెళ్లైన వ్యక్తితో వివాహేతర సంబంధం.. యువతి హత్య -
భార్య అప్పులు.. భర్త కుంగుబాటు.. పిల్లలతో సహా అఘాయిత్యం
సాక్షి,చైన్నె: కట్టుకున్న భార్య ఇష్టానుసారంగా చేసిన అప్పుల కారణంగా ఓ భర్త కుంగి పోయాడు. తీసుకున్న అప్పులు చెల్లించాలని ఒత్తిడి పెరగడంతో కుటుంబం అంతా ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం ఈ దారుణ ఘటన కోయంబత్తూరులో వెలుగు చూసింది. వివరాలు.. కోయంబత్తూరు నగరం పరిధిలోని వడ వెళ్లి వేంబు అవెన్యూలోని ఆ బహుళ అంతస్తుల భవనంలోకి కొంతకాలం క్రితం రాజేష్ (34) కుటుంబం అద్దెకు చేరింది. రాజేష్ ఇంజినీరుగా పనిచేస్తూ వచ్చాడు. అతడి భార్య లక్ష్య(29) ఫ్రెంచ్ కోర్సులో పట్ట భద్రురాలు. వీరికి యక్షిత(10) అనే కుమార్తె ఉంది. వీరితో పాటు రాజేష్ తల్లి ప్రేమ (70) ఆ ఇంట్లో ఉన్నారు. వీరి ప్లాట్ తలుపులు గత రెండు రోజులుగా తెరచుకోలేదు. ఆదివారం ఉదయం దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపు పగల కొట్టి చూడగా, ఓ గదిలో రాజేష్ ఉరివేసుకుని మరణించి ఉండటం వెలుగు చూసింది. మరో గదిలో లక్ష్య, యక్షిత, ఇంకో గదిలో ప్రేమ విషం తాగి మరణించి ఉండడం వెలుగు చూసింది. ఆ ఇంట్లో లభించిన లేఖతో వీరు ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. నాలుగో తరగతి విద్యార్థిని అయిన తన కుమార్తె చదువుతున్న పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఒకరితో తన భార్యకు పరిచయం ఏర్పడిందని రాజేష్ ఆలేఖలో వివరించాడు. అతడి వద్ద కొంత మొత్తాన్ని తన భార్య అప్పుగా తీసుకుని ఉందని, అతడికి కావాల్సి వ్యక్తులు వద్ద కూడా అప్పులు చేసి ఆ సొమ్మును ఏం చేసిందో తనకు తెలియదని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆ అప్పు మొత్తం 31 లక్షలకు చేరిందని వివరించాడు. ఈ సొమ్ము చెల్లించాలని సంబంధిత ఉపాధ్యాయుడు, అతడికి చెందిన వారు ఒత్తిడి తెస్తూవచ్చారని, ఈ అప్ప చెల్లించలేని పరిస్థితుల్లో తామంతా ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆ లేఖలో రాజేష్ పేర్కొన్నాడు. దీంతో వీరికి అప్పు ఇచ్చిన వారి వద్ద పోలీసులు విచారిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కోయంబత్తూరు ఆసుపత్రికి తరలించారు. వీరికి స్నేహితులు,బంధవులు ఎవురైనా ఉన్నారా..? అని విచారిస్తున్నారు. రాజేష్ కుటుంబానికి సన్నిహితంగా ఎవరూ లేదని తేలడంతో ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతంరం మార్చురీలోనే ఉంచారు. సోమవారం లేదా మంగళవారం వారి అంత్యక్రియల విషయంపై అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
తార్నాకలో ప్రైవేట్ ఉద్యోగి ఘాతుకం.. కాపాడాల్సినవాడే.. కడతేర్చాడు
కంటికిరెప్పలా ఇంటిల్లిపాదినీ కాపాడేవాడే, కుటుంబానికి అండగా ఉండాల్సినవాడే దారుణానికి ఒడిగట్టాడు. కన్నతల్లిని, కట్టుకున్న ఇల్లాలిని, అభమూ శుభమూ లియని కన్న కూతురునూ కడతేర్చాడు. కడకు తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీ పోలీసుస్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది. తనతో చెన్నై రావడానికి నిరాకరించిన భార్యతో పాటు కుమార్తెను, కన్నతల్లిని చంపేశాడు. ఆపై తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఓ ప్రైవేట్ ఉద్యోగి. సోమవారం మధ్యాహ్నం ఈ విషాద ఉదంతం వెలుగులోకి వచి్చంది. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు.. చెన్నైకి చెందిన ప్రతాప్ (34) అక్కడి ఓ కార్ల కంపెనీలో డిజైన్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు దాదాపు ఎనిమిదేళ్ల క్రితం తార్నాక ప్రాంతానికి చెందిన సింధూర (32)తో వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఆద్య ఉంది. సింధూరకు రెండు నెలల క్రితం హిమాయత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో ఉద్యోగం వచి్చంది. దీంతో ఆమెతో పాటు ఆద్య, ప్రతాప్ తల్లి రాజతి నగరానికి వచ్చారు. తార్నాకలోని రూపాలీ అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్నారు. చెన్నైలోనే ఉద్యోగం చేస్తున్న ప్రతాప్ వారాంతాల్లో ఇక్కడికి వచ్చి వెళ్తుండేవాడు. చెన్నై వెళదామనే విషయంపై కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. బెడ్రూంల్లో నిద్రిస్తుండగా.. చెన్నైలో స్థిరపడటానికి ఉద్యోగం వదిలి రావాలంటూ భార్య సింధూరపై ప్రతాప్ ఒత్తిడి తెస్తున్నాడు. దీనికి ఆమె అంగీకరించడంపోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదాలు, గొడవలు జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ వీకెండ్లో రావడంతో శుక్రవారం ప్రతాప్ నగరానికి వచ్చాడు. చెన్నై వెళ్లే విషయమై రెండు రోజులుగా వీరి మధ్య గొడవలు జరిగి ఆదివారం రాత్రి తారస్థాయికి చేరింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ప్రతాప్.. కుటుంబాన్ని హతమార్చి తానూ తనువు చాలించాలని నిర్ణయించుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున ప్రధాన బెడ్రూంలో నిద్రిస్తున్న భార్య, కుమార్తెను, కొద్దిసేపటి తర్వాత పక్కనే మరో బెడ్రూంలో పడుకుని ఉన్న తల్లినీ చంపివేశాడు. హాల్లో సీలింగ్ ఫ్యాన్‌కు తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సింధూర సహోద్యోగులు ఫోన్ చేయడంతో.. సింధూర సోమవారం విధులకు హాజరుకావాల్సి ఉంది. ఆమె బ్యాంక్‌కు రాకపోవడంతో ఆరా తీసేందుకు సహోద్యోగులు ఫోన్ చేశారు. సింధూర నుంచి స్పందన రాకపోవడంతో మధ్యాహ్నం వరకు ప్రయత్నించారు. చివరకు మధ్యాహ్నం 2 గంటల సమయంలో సింధూర అపార్ట్‌మెంట్‌కు వచ్చారు. ఎంత పిలిచినా లోపల నుంచి స్పందన లేకపోవడంతో పక్కన అపార్ట్మెంట్లో నివసించే సింధూర తల్లి జమునను తీసుకువచ్చారు. వీరికి ఫ్లాట్‌లోకి హాల్లో ఫ్యాన్‌కు వేలాడుతున్న ప్రతాప్ మృతదేహం కనిపించింది. బెడ్స్‌పై ఉన్న సింధూర, ఆద్యలను పరిశీలించారు. సింధూర కొన ఊపిరితో ఉండటంతో సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించి డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. చికిత్స ప్రారంభించడానికి ముందే ఆమె తుది శ్వాస విడిచింది. నలుగురి మృతదేహాలను పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం మార్చురీకి తరలించారు. సింధూర తల్లి జమున ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంత ఘోరం జరుగుతుందనుకోలేదు: సింధూర తల్లి జమున ‘ప్రతాప్ మాకు దగ్గరి బంధువు హైదరాబాద్ నుంచి చెన్నై షిఫ్ట్ కావాలనే విషయంపై భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నాయి. కానీ.. ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదు’ అని జమున మీడియాతో అన్నారు. రాజతి మెడపై ఉన్న గుర్తుల్ని బట్టి ఉరి బిగించి లేదా గొంతు నులిమి చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. సింధూర, ఆద్యల మృతికి కారణాన్ని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. పోస్టుమార్టం పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక నివేదిక వచ్చిన తర్వాతే దీనిపై స్పష్టత వస్తుందని ఇన్స్పెక్టర్ ఎల్.రమేష్ నాయక్ తెలిపారు. ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సింధూర కోసం వాళ్ల ఆఫీస్ వారు వచ్చి చూసేదాకా ఇంతటి ఘోరం జరిగిందని నాకు తెలియదు. ఆమె ఫోన్ ఎత్తట్లేదు అని ప్రతాప్ కూడా స్పందించట్లేదని కంగారు పడుతూ వచ్చి చెప్పారు. ఎంత కొట్టినా తలుపులు కూడా తీయట్లేదని ఆందోళన చెందారు. అప్పుడు వచ్చి చూస్తే ఈ ఘోరం కనిపించింది. మేం పక్క అపార్ట్మెంట్లో ఉంటాం. ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మా దగ్గరికి వస్తే సరిపోయేది కదా. ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు కదా. -
చేదు మిగిల్చిన షుగర్ వ్యాధి.. వేదన చూడలేక కుటుంబమంతా..
సాక్షి, తమిళనాడు: బిడ్డలు మధుమేహం (షుగర్) బారిన పడడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. చికిత్స అందిస్తున్నా.. వ్యాధి అదుపులోకి రాకపోవడంతో తట్టుకోలేకపోయారు. దీంతో కుటుంబమంతా పాలారులో దూకి మంగళవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. సేలంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. సేలం నగరంలో పరిధిలోని దాదగాపట్టి నెసవాలర్ కాలనీకి చెందిన యువరాజ్ (35) పాన్‌విళి (30) దంపతులకు నితీషా (7), అక్షర (5) అనే కుమార్తెలున్నారు. నితీషా మూడేళ్ల క్రితం మధుమేహం బారిన పడింది. అప్పటి నుంచి బాలికకు చికిత్స అందిస్తూ వస్తున్నారు. ఈ సమయంలో మూడు రోజుల క్రితం అక్షర కూడా మధుమేహం బారినపడినట్టు వైద్య పరిశోధనల్లో తేలింది. దీంతో ఆ దంపతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తమ కుమార్తెలిద్దరూ పడుతున్న వేదనను చూసి తట్టుకోలేక పోయారు. ఈ క్రమంలో సోమవారం యువరాజ్ తన తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లకు ఓ లేఖ రాసి పెట్టి కుటుంబంతో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో మేట్టూరు సమీపంలోని తమిళనాడు – కర్ణాటక సరిహద్దుల్లోని ఈరోడ్ జిల్లా పరిధిలోని అడి పాలారు నదిలో యువరాజ్, పాన్‌విలి, నితిషా, అక్షర మృతదేహాలు మంగళవారం సాయంత్రం తేలాయి. సమాచారం అందుకున్న భవానీ డీఎస్పీ అమృత వర్షిణి ఘటనా స్థలానికి చేరుకుని ఆ నలుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం అందియూరు జీహెచ్‌కు తరలించారు. ఈ విషయమై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఆ లేఖ ఆధారంగా కుటుంబం ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు నిర్ధారించారు. -
బెంగళూరులో విషాదం.. విగతజీవులుగా తల్లీ, కొడుకు, కూతురు
సాక్షి, బెంగళూరు: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన హృదయవిదారక ఘటన బెంగళూరు మహాలక్ష్మీ లేఔట్లో చోటుచేసుకుంది. యశోద (70), కుమార్తె సుమన (41) కుమారుడు నరేశ్‌గుప్తా (36) మృతులు. విషం తాగి ప్రాణాలు తీసుకున్నట్లు అనుమానం ఉందని మంగళవారం ఉత్తరవిభాగ డీసీపీ వినాయకపాటిల్ తెలిపారు. ఇంటి పెద్ద మరణంతో కుంగుబాటు వివరాలు.. యశోదకు ముగ్గురు సంతానం. వీరిలో ఒక కుమార్తెకు పెళ్లయి రాజాజీనగరలో ఉంటోంది. కుమారుడు నరేశ్‌గుప్తా కాంట్రాక్టర్‌గా పనిచేసేవాడు. యశోద భర్త నాలుగునెలల క్రితం చనిపోవడంతో ఆమె మానసికంగా కుంగిపోయింది. భర్త వినియోగిస్తున్న వస్తువులను అనాథ ఆశ్రమానికి అందజేసి ఆ ఇంటిని ఖాళీ చేసి మహాలక్ష్మీలేఔట్ ఆంజనేయ గుడి వద్ద అపార్టుమెంటులోని రెండో అంతస్తులో ఓ ఫ్లాటులోకి మారారు. ఇద్దరు పిల్లలతో కలిసి యశోద ఉంటున్నారు. కుమార్తె సుమనకు ఆరోగ్య సమస్య ఉండటంతో ఇంకా వివాహం కాలేదు. అంతేగాక నరేశ్‌గుప్తా కూడా అవివాహితుడు. ఘటన జరిగిన అపార్టుమెంటు ఫోన్ చేసినా స్పందన లేదని.. మంగళవారం యశోదకు బంధువులు పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ ఫోన్ తీయలేదు. కూతురు వచ్చి ఫ్లాట్ కాలింగ్‌బెల్ నొక్కినా స్పందన లేదు. ఆమె సెక్యూరిటీ గార్డుకు చెప్పగా, అతడు వచ్చి తలుపు తీసి చూడగా ముగ్గురూ మరణించి ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి కేసు నమోదు చేసి మృతదేహాలను ఎంఎస్.రామయ్య ఆసుపత్రికి తరలించారు. రెండురోజుల క్రితం యశోద, సెక్యూరిటీగార్డును పిలిచి రెండురోజులు ఉండటం లేదు, పాలు, పేపరు మీరే తీసుకోండి అని చెప్పింది. ఆర్థిక ఇబ్బందులు లేనప్పటికీ కుటుంబ సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానాలున్నాయి. -
ఇద్దరు పిల్లలు సహా దంపతుల ఆత్మహత్య.. ఏం కష్టమొచ్చిందో పాపం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదారాబాద్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. చందానగర్ పాపిరెడ్డి కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాజీవ్ గృహకల్ప బ్లాక్ నెంబర్ 18లో నివాసముంటున్న కుటుంబం... ఆదివారం అర్ధరాత్రి బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇద్దరు పిల్లలు సహా భార్యాభర్తలు విగతజీవులుగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. కుటుంబ కలహాలా? లేదా అప్పుల వ్యవహారం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇదీ చదవండి: తండ్రి కొడుకుల జంట హత్య కేసు: చీకటి జీవితాల్లో వెలుగు దివ్వెలు -
కుమార్తె డ్రైవర్‌తో వెళ్లిపోయిందని.. ఫ్యామిలీ మొత్తం..
సాక్షి, బెంగళూరు: కూతురు వేరే కులం వ్యక్తిని ప్రేమించి వెళ్లిపోయిందని తీవ్ర ఆవేదనకు గురైన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన కర్ణాటకలో కోలారు జిల్లా హండిగనాళ గ్రామంలో మంగళవారం జరిగింది. శ్రీరామప్ప (69) తన భార్య సరోజ (55), కుమారుడు మనోజ్ (25), కూతురు అర్చనతో హండిగనాళలో ఉంటున్నారు. ఇదే గ్రామానికి చెందిన డ్రైవర్ నారాయణ స్వామిని ప్రేమించిన అర్చన సోమవారం ఇల్లు వదిలి అతనితో వెళ్లిపోయింది. అర్చన ఒక్కలిగ అగ్రవర్ణానికి చెందిన అమ్మాయి కాగా, నారాయణస్వామి దళిత వ్యక్తి. కూతురు కనిపించడం లేదని అదే రోజు ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గ్రామంలో తమ పరువు పోయిందని, ఇక జీవించలేమని నిర్ణయించుకున్నారు. తమ మరణానికి అర్చనే కారణమంటూ సూసైడ్‌నోట్ రాసి పురుగుల మందు తాగి శ్రీరామప్ప, భార్య, కుమారుడు ప్రాణాలు తీసు కున్నారు. అదనపు ఎస్పీ కుశాల్ చౌక్సే, పోలీసు లు సంఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇంటికి తిరిగి రావాలని, లేకపోతే అందరం చచ్చిపో తామని అక్కకు తమ్ముడు మనోజ్ పంపిన మెసేజ్‌లను ఫోన్లో పోలీసులు గుర్తించారు. చదవండి: (భార్యను పుట్టింటికి పంపించి.. అక్క కూతురితో పెళ్లికోసం.. బావపై..) -
అతని బతుకు లెక్క తప్పింది
రాజమహేంద్రవరం(తూర్పుగోదావరి జిల్లా): అప్పుడప్పుడు ఆ చిన్నారులిద్దరూ తండ్రితో సరదాగా హోటల్‌కు వెళ్లేవారు. ఆదివారం కూడా అదే తరహాలో నాన్న వెళ్దామంటే ఆ చిన్నారులు సంబరపడిపోయారు. తనతోపాటు మృత్యుఒడికి తీసుకుపోతాడని వారికి తెలియదు. కంటికి రెప్పలా చూసుకున్న తండ్రే ప్రాణాలను చిదిమేస్తాడని అనుకోలేదు. పిడింగొయ్యి బుచ్చియ్యనగర్కు చెందిన పక్కి సత్యేంద్రకుమార్(40) ఆదివారం రాత్రి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పిల్లలు రిషిత(12), హిద్విక(07)లు కూడా తండ్రితోపాటు చెరువులో విగత జీవులుగా తేలారు. ఈ ఘటన హృదయాలను కలచివేసింది. రాజమహేంద్రవరం వీఎల్‌పురం కనకదుర్గమ్మ గుడివీధిలో భార్యాపిల్లలతో ఉండేవాడు. అకౌంటెంట్‌గా జీఎస్టీలు ఫైల్ చేసేవాడు. డాన్‌బాస్కో స్కూల్లో రిషిత ఏడవ తరగతి, హిద్విక రెండవ తరగతి చదివేవారు. ఆదివారం అతని భార్య స్వాతి, తల్లిదండ్రులతో కలిసి విశాఖ వెళ్లింది. మానసికంగా తీవ్ర దిగులు చెందుతున్న సత్యేంద్రకుమార్ తనువు చాలించాలనుకుంటున్నాడని కుటుంబ సభ్యులెవరూ గుర్తించలేకపోయారు. పిల్లలంటే ఎంతో మమకారం. విడిచి ఉండలేకపోయేవాడు. తాను లేకపోతే పిల్లలేమవుతారని భావించాడో ఏమో గాని తనతోపాటు వారినీ విషాదాంతమొందించాడు. ఆదివారం సాయంత్రం హోటల్లో భోజనం పేరిట పిల్లలిద్దరినీ తీసుకెళ్లాడు. తర్వాత వీరి ఆచూకీ కనిపించలేదు. విశాఖ నుంచి తిరుగు ప్రయాణమైన భార్య స్వాతి ఫోన్ చేసినా ఎత్తలేదు. ఇంటికొచ్చి చూస్తే పిల్లలు కూడా కనిపించలేదు. దీంతో కంగారు పడి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోమవారం ఉదయం రాజవోలు చెరువులో ముందుగా కుమార్తెలిద్దరి శవాలు బయటపడ్డాయి. తర్వాత సత్యేంద్రకుమార్ విగతజీవిగా తేలాడు. చెరువులోకి దూకేముందు గట్టుపై బైక్, సెల్‌ఫోన్ విడిచి పెట్టాడు. లెటర్ రాశాడు. తానెందుకు ప్రాణాలు తీసుకుంటున్నదీ అందులో వివరించాడు. ధవళేశ్వరం, బొమ్మూరు పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్లు మంగాదేవి, విజయకుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. రైలు టిక్కెట్లు తీసి పంపించి... ఏ శుభకార్యానికి వెళ్లినా అందరం కలిసి వెళ్లే వాళ్లం.. విశాఖపట్నం శుభకార్యానికి వెళ్దామంటే ఈసారి తనకు పని ఉంది రాలేనని సత్యేంద్రకుమార్ చెప్పారని అతని భార్య స్వాతి పేర్కొంది. తనకు, అత్తమామలకు టిక్కెట్లు తీసి పంపించి ఇలా శోకం మిగిల్చారంటూ కన్నీరుమున్నీరవుతోంది. తిరిగి వెళ్లి వచ్చేసరికి అందనంత దూరానికి వెళ్లిపోయి తనను ఒంటరి దాన్ని చేసేవా బావా రోదిస్తున్న తీరు స్థానికుల గుండెల్ని పిండేసింది. అందరితోను కలివిడిగా నవ్వుతూ పలకరించే సత్యేంద్రకుమార్, ఇద్దరు కుమార్తెలు మృత్యువాతపడడాన్ని అతని సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. వీఎల్‌పురం, బుచ్చియ్యనగర్ ప్రాంతాల్లో విషాధ చాయలు అలుముకున్నాయి. కష్టాన్ని తమతో పంచుకుంటే ఇంత దారుణం జరిగేది కాదంటూ మృతుని తల్లితండ్రులు సుశీల, సత్యనారాయణ కన్నీటి పర్యంతమవుతున్నారు. పార్థివ దేహాలకు నివాళి వీఎల్‌పురంలో తండ్రీ కుమార్తెల పార్థివ దేహాలకు సోమవారం రాత్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. జరిగిన ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయాలని బొమ్మూరు సీఐ విజయ్ కుమార్‌కు ఆదేశించారు. బతకాలని ఉన్నా... సత్యేంద్రకుమార్ తనతోపాటు పిల్లలనూ మృత్యుఒడికి చేర్చిన ఘటనపై ఆయన నివాస ప్రాంత వాసులకు కన్నీరు తెప్పించింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఇద్దరు కుమార్తెలకు తాను చనిపోతే సమాజంలో గుర్తింపు, గౌరవం ఉండదని..అందుకే వెంట తీసుకువెళ్లినట్లు సత్యేంద్రకుమార్ సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నాడు. అకౌంట్స్ కన్సల్టెన్సీ ఆఫీసు నిర్వహించేవాడు. అనుకున్న మేర ఆదాయం రాలేదని ఆందోళన చెందేవాడు. ఆర్థికంగా ఎదిగే అవకాశం లేని దురదృష్టవంతుడ్ని అంటూ సత్యేంద్రకుమార్ లేఖలో ప్రస్తావించాడు. మరణానికి మూడొంతులు అకౌంట్స్ టెన్షనే కారణమన్నాడు. బతకాలనే ఉంది..కానీ జీవితం ఇలాగే ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నానన్నాడు. సున్నితంగా తాను ఆలోచించానని అనుకోవద్దన్నాడు. చావడానికి కూడా చాలా ధైర్యం కావాలంటూ లేఖ ముగించాడు. ఈ లేఖ అందరి హృదయాలనూ కదిలించింది. -
కుర్మల్ గూడలో కుటుంబం ఆత్మహత్య
-
రాఘవ కోసం 8 ప్రత్యేక బృందాలతో గాలించాం: ఏఎస్పీ రోహిత్ రాజ్
-
భద్రాచలం జైలుకు వనమా రాఘవ
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచకు చెందిన నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్యే వనమా కుమారుడు రాఘవేంద్రరావు (రాఘవ) కటకటాల్లోకి వెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించి రాఘవపై ఐపీసీ సెక్షన్లు 302, 306, 307 కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. నాటకీయ పరిణామాల మధ్య శనివారం మధ్యాహ్నం కొత్తగూడెం రెండో అదనపు ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముద్దసాని నీలిమ ఎదుట హాజరుపర్చారు. మేజిస్ట్రేట్ రాఘవకు 14 రోజులు రిమాండ్ విధించడంతో.. వెంటనే భద్రాచలం సబ్ జైలుకు తరలించారు. తీవ్ర ఉత్కంఠ మధ్య.. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడైన వనమా రాఘవను శుక్రవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో రాఘవను పాల్వంచలోని ఏఎస్పీ కార్యాలయానికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని పోలీసు బలగాలు తమ అధీనంలోకి తీసుకుని.. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశాయి. శనివారం తెల్లవారుజాము నుంచే వనమా బాధితులు, ప్రజలు, బీజేపీ, ఇతర పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఏసీపీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. రాఘవను ఉరితీయాలని, లేదంటే తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. శనివారం మధ్యాహ్నం రాఘవను మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చేందుకు పాల్వంచ నుంచి కొత్తగూడేనికి పోలీసు వాహనంలో తీసుకొస్తున్న క్రమంలో.. కొత్తగూడెం శివారులోని బ్రిడ్జి వద్ద బీజేపీ కార్యకర్తలు వాహనాన్ని అడ్డుకున్నారు. రాఘవను ఎన్కౌంటర్ చేయాలని, కోర్టుకు తీసుకెళ్లి సమయం వృథా చేయొద్దని ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా తోపులాట జరగగా.. పోలీ సులు, బీజేపీ శ్రేణులను చెదరగొట్టి ముందు కు కదిలారు. మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చాక.. మధ్యాహ్నం 2 గంటల సమయంలో భద్రాచలం సబ్‌జైలు అధికారులకు అప్ప గించారు. రాఘవకు దుస్తులతో కూడిన సంచీని ఇచ్చారు. తొలిరోజు మొదటి బ్యారక్‌లో ఇతర ఖైదీలతో పాటే రాఘవను ఉంచినట్టు జైలువర్గాలు తెలిపాయి. బాధితులు ముందుకు రావాలి రాఘవను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చే ముందు ఏఎస్పీ రోహిత్‌రాజ్ మీడియాతో మాట్లాడారు. ఈనెల 7న కారు (నెక్సాన్– టీఎస్28ఎల్ 0001)లో ఏపీ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న రాఘవేంద్రరావు, అతడి అనుచరులు గిరీష్, మురళీకృష్ణను దమ్మపేటలోని మందలపల్లి క్రాస్‌రోడ్డు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. రాఘవపై మరో 12 కేసులున్నాయని, వాటిపైనా దర్యాప్తు చేపట్టామని, బాధితులెవరైనా ముందుకొస్తే వారి ఫిర్యాదులనూ పరిగణలోకి తీసుకుంటామని ప్రకటించారు. ఎనిమిది మందిపై కేసు రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనకు సంబంధించి పోలీసులు ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు. ఆత్మహత్య చేసుకోవడంతోపాటు భార్య, ఇద్దరు పిల్లల చావుకు కారణమైన మండిగ నాగరామకృష్ణ (40)ను ఏ1గా చూపారు. ఏ2గా వనమా రాఘవేంద్రరావు, ఏ3గా రామకృష్ణ తల్లి సూర్యవతి, ఏ4గా అక్క మాధవి, తర్వాతి నిందితులుగా రాఘవకు సహకరించిన అనుచరులు ముక్తిని గిరీష్, దావా శ్రీని వాస్, రమాకాంత్, కొమ్ము మురళీకృష్ణలను చేర్చారు. ఇందులో రాఘవ, గిరీష్, మురళీకృష్ణలను అరెస్టు చేశామని, మిగతావారు పరారీలో ఉన్నారని చెప్పారు. రామకృష్ణ తల్లి సూర్యావతి, అక్క మాధవి శుక్రవారం వరకు మీడియాతో మాట్లాడగా.. వారు పరారీలో ఉన్నట్టు చూపడం గమనార్హం. క్యాంపు కార్యాలయంలోనే రాసలీలలు? కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని ఓ మండల స్థాయి మహిళా ప్రజాప్రతినిధితో అత్యంత సన్నిహితంగా ఉండే రాఘవ.. ఇటీవల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోనే ఆమెతో గడిపారనే ప్రచారం టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ విషయం తెలిసిన కొందరిని రాఘవ మచ్చిక చేసుకున్నారని సమాచారం. ఈ విషయంపైనా పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలిసింది. పోలీసులతో టచ్‌లోనే రాఘవ? ఐదు రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్న రాఘవ.. గతంలో పాల్వంచలో పనిచేసిన కొం దరు పోలీసు అధికారులతో టచ్‌లోనే ఉన్న ట్టు విశ్వసనీయంగా తెలిసింది. వారి సూచ నల ప్రకారమే.. రాఘవ వివిధ ప్రాంతాలు, సిమ్‌కార్డులు మారుస్తూ ఆచూకీ తెలియ కుండా జాగ్రత్తపడినట్టు ఓ పోలీసు అధికారి తెలి పారు. అయితే రాఘవ వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవు తుండటంతో.. అతడికి సహకరించిన పోలీసులను ఉన్నతాధికారులు తీవ్రంగా మందలించారని సమాచారం. ఈ క్రమంలో వారు ఇచ్చిన సమాచారంతోనే రాఘవను, అతడి అనుచరులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. కాగా.. ఈనెల 3న అజ్ఞాతంలోకి వెళ్లిన రాఘవ.. శుక్రవారం దాకా కూడా గిరీశ్‌కు చెందిన నెక్సాన్ (టీఎస్28ఎల్ 0001) కారులోనే తిరిగినట్టు తెలుస్తోంది. ఈ సమయంలో మహబూబాబాద్, వరంగల్‌తోపాటు ఖమ్మం, రాజమండ్రి తదితర ప్రాంతాలకు వెళ్లినట్టు సమాచారం. -
వనమా రాఘవపై 12 కేసులున్నాయి: ఏఎస్పీ
సాక్షి, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేంద్రరావుపై ఇప్పటివరకూ 12 కేసులున్నట్లు కొత్త గూడెం జిల్లా ఏఎస్పీ రోహిత్‌రాజ్ తెలిపారు. రాఘవ కోసం 8 ప్రత్యేక బృందాలతో గాలించినట్లు ఏఎస్పీ పేర్కొన్నారు. నిన్న(శుక్రవారం) దమ్మపేట వద్ద రాఘవను అరెస్ట్ చేశామన్న ఏఎస్పీ.. అతని డ్రైవర్ మురళీ, అనుచరుడు గిరీష్‌ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.ఈరోజు రాఘవను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్లు రోహిత్‌రాజ్ స్పష్టం చేశారు. రాఘవ డబ్బులే కాకుండా రామకృష్ణ భార్యను కూడా ఆశించినట్లు సెల్ఫీ వీడియోలో ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రామకృష్ణ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. -
మ్యాగజైన్ స్టోరీ 8th January 2022
-
అతన్ని వదలొద్దు.. నాకు కడుపుకోత మిగిల్చాడు
-
వనమా రాఘవేంద్ర అరెస్ట్
-
మాతో చెబితే ఇలా జరిగేది కాదు!
పాల్వంచ: ‘మా ఆస్తుల పంపకాల విషయంలో వనమా రాఘవేందర్రావును కలిశాం. కానీ ఆయన ఏం మాట్లాడాడో మా తమ్ముడికే తెలుసు. మాతో చెబితే పరిష్కారమార్గం ఆలోచించే వాళ్లం. కానీ ఇం టికి పెద్దదిక్కుగా ఉండాల్సిన తమ్ముడే ప్రాణా లు తీసుకున్నాడు. భార్యాపిల్లల్ని కూడా చంపుకున్నాడు..’అని రామకృష్ణ సోదరి కొమ్మిశెట్టి లోగ మాధవి చెప్పారు. శుక్రవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. ‘మా నాన్న విధి నిర్వహణలో భాగంగా తహసీల్దార్ ఎక్కిన జీపులో ప్రయాణిస్తుండగా నక్సల్స్ మందుపాతరలో చనిపోయారు. మరో తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. నా భర్త కూడా ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు. ఇక మిగిలింది మా అమ్మ, నేను, రామకృష్ణ. మా కుటుంబంలో మగదిక్కు తమ్ముడే. మాకు ఏం కావాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా ఆయనే చూసుకుంటాడనుకున్నాం. అయితే రామకృష్ణకు వ్యాపారాల్లో నష్టం వచ్చి అప్పుల పాలయ్యాడు. అప్పులు తీర్చి మిగిలిన ఆస్తుల పంపకాన్ని చూసుకోవాలని భావించినా సాధ్యపడలేదు. మా నాన్న ఉన్నప్పటి నుంచి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఆయన కుటుంబం బాగా తెలుసు. అందుకే వనమా వెంక టేశ్వరరావుతో మాట్లాడేందుకు వెళ్తే ఆరోగ్యం బాగో లేకపోవడంతో రాఘవేందర్ మాట్లాడాడు. అయితే ఆయ నేం మాట్లాడాడో.. మా తమ్ముడు ఎలా క్షోభకు గురయ్యాడో మాకు తెలియదు. తెలిస్తే మా సమస్యను మరోలా పరిష్కరించుకునే వాళ్లం. ఆస్తుల పంపకాలు కూడా నాలుగైదు రోజుల్లోనే సెటిల్ అయ్యేవి. ఇంతలోనే ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇంత మానసిక బాధ పడాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు.’అంటూ మాధవి విలపించారు. కావాలనే రాఘవను ఇరికిస్తున్నారు పాల్వంచ: ‘ఆస్తి పంపకాల విషయంలో పెద్ద మనిషి అని వనమా రాఘవేందర్రావును కలిశాం. ఆయన మా మేలు కోరి పలు సూచనలు చేశాడు. కానీ ఎవరో కావాలనే ఈ కేసులో ఆయనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరో నా కొడుకును ప్రేరేపించి తప్పుదోవ పట్టించి చావుకు కారణమయ్యారు..’ అని రామకృష్ణ తల్లి సూర్యావతి కన్నీటి పర్యంతమయ్యారు. పాత పాల్వంచలో శుక్రవారం తనను కలిసిన విలేకరులతో ఆమె మాట్లాడారు. ఆస్తి కోసం కుమారుడు రామకృష్ణ తనను ఎంతో ఇబ్బంది పెట్టాడని చెప్పారు. చాలాచోట్ల అప్పులు చేసిన అతను ఒకే సారి రూ.లక్షల్లో అప్పు ఉందని చెప్పాడని తెలిపారు. రాఘవతో మాటల సందర్భంగా జరిగిన విషయాలేవీ మా వద్ద ప్రస్తావించకుండా భార్య, పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడడం తనను ఎంతో బాధకు గురిచేసిందన్నారు. తన భర్త నక్సల్స్ పేల్చిన మందుపాతరలో చనిపోతే ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని, కలెక్టర్ స్పందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. -
‘నాలుగో సింహం’ బోనులో.. ‘వనమా’లు జనంలో
సాక్షి, హైదరాబాద్: అది శాంతిభద్రతలను రక్షించే కీలకమైన పోలీసు విభాగం.. కానీ మంచి పోస్టింగ్ కావాలంటే ‘సిఫార్సు’ కావాల్సిందే, లేదంటే లూప్లైన్లో కాలం వెళ్లదీయాల్సిందేనన్నది ఆ శాఖలో అనధికార నినాదం! కొన్ని జిల్లాల్లో ఎస్పీ స్థాయి నుంచి ఎస్సై దాకా నేతల సిఫార్సు లేనిదే పోస్టింగ్ దక్కలేని పరిస్థితి ఉందన్నది బహిరంగంగా మాట్లాడుకునే రహస్యం! ఇలా మంచి పోస్టింగ్ కోసం రాజకీయ నాయకులను ఆశ్రయిస్తున్న కొందరు పోలీసు అధికారులు.. సంబంధిత నేతకుగానీ, వారి కుటుంబ సభ్యులు, అనుచరులకుగానీ వ్యతిరేకంగా చర్యలు తీసుకోగలరా అన్నది ప్రశ్నార్థకం. ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు కుమారుడు రాఘవేంద్రరావు ఘటనతో ఈ ‘సిఫార్సు’ల వ్యవహారం పోలీసుశాఖలో తీవ్ర కలవరం రేపుతోంది. వనమా రాఘవేంద్రరావుపై ఎన్నో ఏళ్లుగా ఫిర్యాదులున్నా పోలీసు అధికారులు పెద్దగా స్పందించకపోవడానికి కారణమూ ఇదేనన్న చర్చ జరుగుతోంది. ఇంటెలిజెన్స్ వర్గాలూ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుండటం పోలీసు ఉన్నతాధికారులను ఒత్తిడిలోకి నెట్టేస్తోంది. చెప్పినట్టు వినాల్సిందే.. కొత్తగూడెం పాల్వంచలో జరిగిన వ్యవహారంలో పోలీసుశాఖ ముందే స్పందించి ఉంటే.. ఈ స్థాయిలో వ్యవహారాలు జరిగేవి కాదన్న వాదన వినిపిస్తోంది. 2017 నుంచే వనమా రాఘవేంద్రరావుపై హత్య, ఆత్మహత్యకు ప్రేరేపించారన్న కేసులు ఉన్నా యి. 2018లో ఒక క్రిమినల్ కేసు, 2019లో మరొకటి, 2020లో ఇంకొకటి.. ఇలా నాలుగుకుపైగా క్రిమినల్ కేసులున్నాయి. అయితే రామ కృష్ణ కుటుంబం ఆత్మహత్యతో పాటు మరికొన్ని కేసుల్లోనూ బాధితులు పోలీసులపైనా ఆరోపణలు చేస్తున్నారు. తాము స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్తున్నారు. దీనికి కారణం రాఘవ తన తండ్రి సిఫార్సు లేఖలతో ఇప్పించిన పోస్టింగ్‌లే అనడంలో ఏమాత్రం సందేహం లేదన్న వాదన వినిపిస్తోంది. రాఘవ ఇప్పించిన పోస్టింగ్‌లో ఉంటూ ఆయనకు వ్యతిరేకంగా వెళ్లలేని స్థితిలో పోలీసు అధికారులు ఉండిపోవడం వివాదాస్పదంగా మారిందని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారం, సదరు సెల్ఫీ వీడియో సోషల్‌మీడియాలో సంచలనం కావడంతో.. ఇప్పుడు తప్పనిసరిగా చర్య తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. పోస్టింగ్కో రేటు పెట్టి.. రాష్ట్ర పోలీసుశాఖలో కొన్నిచోట్ల ఎస్పీ స్థాయి అధికారులకు పోస్టింగ్ దక్కాలంటే భారీ రేటు ఉందని.. డీఎస్పీ, ఇన్స్పెక్టర్, ఎస్సై పోస్టింగులకు ఒక్కో రేటు ఉందని ఆరోపణలు ఉన్నాయి. కొందరు అధికారులు పోస్టింగ్ సిఫార్సుల కోసం ప్రజాప్రతినిధులకు లక్షల రూపాయలు ఇస్తున్నారని పోలీసు వర్గాలే చెప్తున్నాయి. ఎస్సై పోస్టింగ్ సిఫార్సు కోసం రూ.5లక్షలు, సీఐ స్థాయిలో రూ.10 లక్షలదాకా.. డీఎస్పీ/ఏసీపీ పోస్టింగ్ కోసం రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలు వసూలవుతున్నట్టు పేర్కొంటున్నాయి. కొద్దిరోజుల క్రితం జరిగిన ఓ ఎస్పీ బదిలీ వివాదాస్పదంగా మారుతోంది. ఏకంగా రూ.45 లక్షలు ఇచ్చి సంబంధిత అధికారి ఎస్పీగా పోస్టింగ్ తెచ్చుకున్నట్టు చర్చ జరుగుతోంది. ఎక్కడ చూసినా.. బెదిరింపులు, కబ్జాలు.. ►ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేల కుమారుల వ్యవహారం వివాదాస్పదంగా మారుతున్నట్టు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సహకరించకపోతే ఏకంగా ఏసీబీ దాడులు చేయిస్తామని పోలీస్, రెవెన్యూ సిబ్బందిని బెదిరించే స్థాయికి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే జిల్లాలో మరో ఎమ్మెల్యే కుమారుడు ఇసుక రవాణాలో తమకు పూర్తిగా సహకరించే అధికారులకు పోస్టింగ్ ఇప్పించుకున్నట్టు ఆరోపణలున్నాయి. ►ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక ఎమ్మెల్యే తరఫున ఆయన సోదరుడు పోలీసు అధికారులతో సెటిల్మెంట్లు చేస్తున్నట్టు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే జిల్లాలో ఓ మాజీ ఎమ్మెల్యే భార్య, ఇద్దరు అల్లుళ్ల పెత్తనం మరీ మితిమీరినట్టు ఇంటెలిజెన్స్ నివేదికలు చెప్తున్నాయి. బెదిరింపులు, కబ్జాలు సహా సదరు నియోజకవర్గంలో వారు ఎలా చెప్తే పోలీసు అధికారులు అలా వినాల్సిందేనన్న ఆరోపణలున్నాయి. మరో ఎమ్మెల్యే కుమారుడు అన్నీ తానై డీఎస్పీ నుంచి ఎస్సై దాకా పోస్టింగ్‌లకు సిఫార్సులు చేయిస్తున్నట్టు చెప్తున్నారు. ►నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఓ కీలక ఎమ్మెల్యే సోదరుడు నిబంధనలకు విరుద్ధంగా క్రషర్ నడిపిస్తున్నాడన్న ఫిర్యాదులు వస్తే.. సదరు బాధితులపైనే ఉల్టా కేసులు పెట్టించి హింసించారన్న ఆరోపణలున్నాయి. మరో ఎమ్మెల్యే సోదరుడు తన ఇసుక దందాకు అడ్డొస్తున్న వారిపై పోలీసుల సాయంతో అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఓ సీనియర్ ఎమ్మెల్యే తనయులపైనా భూకబ్జా, ఇసుక దందా ఆరోపణలున్నాయి. మరో ఎమ్మెల్యే సోదరుడు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ.. భూకబ్జాదారులతో చేతులు కలిపి విలువైన భూములను కాజేసినట్టు నిఘా విభాగం ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చింది. ►ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఓ ఎమ్మెల్యే కుమారుడు పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్ మాఫియాకు సహకరిస్తున్నారని ఫిర్యాదులున్నా పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇదే జిల్లాలో ఓ ఎమ్మెల్యేకన్నా ఆయన కుటుంబ సభ్యులదే ఎక్కువ పెత్తనమన్న విమర్శలున్నాయి. వారు ఏకంగా రూ.2 వేల కోట్ల విలువైన భూములకు నకిలీ పత్రాలు సృష్టించి కాజేశారని.. దానిపై ఫిర్యాదు చేసిన వారిపై అక్రమంగా కేసులు పెట్టించారన్న ఆరోపణలూ ఉన్నాయి. ►ఇక ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో ఓ ఎమ్మెల్యే సోదరుడు తానే ఎమ్మెల్యే అయినట్టుగా వ్యవహరించడం, భూకబ్జా వ్యవహారాలు మానవ హక్కుల సంఘం దాకా వచ్చాయి. సదరు ఎమ్మెల్యే సోదరుడు బెదిరింపులు, అక్రమ కేసులతో వేధిస్తున్నారంటూ మూడు ఫిర్యాదులు అందాయి. ఇదే జిల్లాలో మరో ఎమ్మెల్యే భార్య పోలీస్, రెవెన్యూ అధికారుల ద్వారా వసూలు చేస్తున్న కమిషన్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. ఉల్టా వారిపైనే కేసులు నమోదుచేయడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ►ఖమ్మంలో వనమా రాఘవ వ్యవహారం ఇటీవలే బయటపడింది. మరో ఎమ్మెల్యే భర్త కూడా ప్రతీదందాలో తన వాటా అంటూ వసూలు చేస్తున్నారని.. ఇవ్వకపోతే పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అదే విధంగా ఓ ఎమ్మెల్సీకి వరుసకు సోదరుడయ్యే వ్యక్తి చేస్తున్న పనులు ఎస్పీస్థాయి అధికారులకు కూడా చికాకు తెప్పించాయని, వారు ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేసే వరకు వ్యవహారం వెళ్లిందని సమాచారం. ►వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఓ సీనియర్ ఎమ్మెల్యే కుమారుడు ప్రభుత్వ పోస్టింగ్‌లలో జోక్యం చేసుకుంటున్నారని.. పోలీసు, రెవెన్యూ అధికారుల ద్వారా రియల్ ఎస్టేట్ వెంచర్లలో వాటాలు వసూలు చేస్తున్నారని చర్చ జరుగుతోంది. ఇదే జిల్లాలో మరో ఎమ్మెల్యే చీకటి వ్యవహారాలకు పోలీసులు సెక్యూరిటీ కల్పించడం ఇటీవల వివాదాస్పదమైంది. ►మెదక్ జిల్లాలో ఓ ఎమ్మెల్యే సోదరుడు తప్పుడు కేసులు నమోదు చేయిస్తానంటూ కొందరిపై బెదిరింపులకు దిగినట్టు ఇంటెలిజెన్స్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. సిఫార్సులతో చేతులు కట్టేస్తున్నారు! ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలుంటే తప్ప పోస్టింగులు ఇవ్వద్దొన్న మౌఖిక ఆదేశాలుండటంతో పోలీసు ఉన్నతాధికారులు సైతం చేతులు కట్టేసుకోవాల్సి వస్తోందన్న చర్చ నడుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 80శాతం పోస్టింగులు సిఫార్సు లేఖల ద్వారానే జరుగుతున్నాయని.. ప్రతిభ, అంకితభావ సేవలను దృష్టిలో పెట్టుకొని మిగతా వారికి అవకాశం కల్పిస్తున్నా నాలుగు రోజుల ముచ్చటగానే మిగిలిపోతోందని ఉన్నతాధికారవర్గాలు చెప్తున్నాయి. సమర్థవంతమైన అధికారులకు పోస్టింగ్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని, అక్రమాలకు పాల్పడుతున్న ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులకు సహకరిస్తున్న అధికారులపై ఎప్పటిప్పుడు ఇంటెలిజెన్స్ నివేదికలిస్తున్నా మార్పు రావడం లేదని వాపోతున్నాయి. వ్యవస్థలో మార్పు రాకపోతే మరింత విపరీత పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా సిఫార్సు లేఖలతో కాకుండా.. సమర్థత ఆధారంగా పోస్టింగులు ఇస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. -
వనమా రాఘవేంద్ర అరెస్ట్
సాక్షి, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేంద్రరావు పోలీసులకు చిక్కాడు. శుక్రవారం మధ్యాహ్నం ఆయనను టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రకటించగా.. రాత్రి 10 గంటలకు రాఘవను అదుపులోకి తీసుకున్నట్టు కొత్త గూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్ ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట పరిసరాల్లో రాఘవ ఉన్నట్టు సమాచారం అందిందని.. దమ్మ పేట మీదుగా రాజమండ్రికి వెళ్తున్న రాఘవ వాహనాన్ని పోలీసులు వెంబడించి పశ్చిమగోదావరి జిల్లా చింతలపుడి వద్ద అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. రాఘవను పాల్వంచకు తరలించామని.. ప్రాథమిక విచారణ పూర్తిచేశాక కోర్టులో హాజరుపరుస్తామని పోలీసు అధికారులు వెల్లడించారు. పరారీపై ప్రచారాల మధ్య.. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న నాగ రామ కృష్ణ, ఆయన భార్య శ్రీలక్ష్మి, కుమార్తెలు సాహిత్య, సాహితితో కలిసి ఈనెల 3న ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. తమ ఆత్మహత్యలకు రాఘవ కారణమంటూ చనిపోయే ముందు రామృకృష్ణ తీసిన సెల్ఫీ వీడియో ఈ నెల 6న వైరల్‌గా మారింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించింది. అప్పటి నుంచే రాఘవ పరారీలో ఉన్నారు. ఆయనను ఆరో తేదీనే కొత్తగూడెం పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారని, శుక్రవారం రాత్రి వరకు రాఘవ పోలీసుల అదుపులో ఉన్నాడనే ప్రచారం జరిగింది. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యతోపాటు పాత కేసులకు సం బంధించిన స్టేట్మెంట్లు రికార్డ్ చేసి రౌడీషీట్ తెరుస్తామని పాల్వంచ ఏఎస్పీ రోహిత్‌రాజ్ ప్రకటించా రు కూడా. ఇది జరిగిన మరుసటి రోజే రాఘవను అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు ప్రకటించ డం గమనార్హం. అయితే శని, ఆదివారాలు కోర్టుకు సెలవులని.. రాఘవకు బెయిల్ రాకుండా ఉండేం దుకే శుక్రవారం రాత్రి అరెస్ట్ చూపారనే ప్రచారం జరుగుతోంది. రాఘవ వ్యవహారాలన్నింటినీ తిరగదోడిన పోలీసులు.. కేసుల నమోదుకు సంబంధించి ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలిసింది. పోలీసుల అదుపులో మరో నలుగురు రాఘవ అక్రమాల వివరాలు తెలుసుకునేందుకు రెండు రోజుల క్రితమే ఆయన అనుచరులు నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు విశ్వస నీయంగా తెలిసింది. పాల్వంచకు చెందిన ఇద్దరు, లక్ష్మీదేవిపల్లి మండలం, కొత్తగూడెం పట్టణానికి చెందిన ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకుని.. కీలక సమాచారాన్ని రాబట్టినట్టు సమాచారం. వారిలో ఇద్దరు అప్రూవర్‌గా మారినట్టు తెలిసింది. కొత్తగూడెం బంద్ రాఘవను వెంటనే అరెస్టు చేసి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల నేతలు శుక్రవా రం కొత్తగూడెం నియోజకవర్గ బంద్ నిర్వహించారు. ఆందోళనకు దిగిన పార్టీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాత కేసులో ఎమ్మెల్యే ఇంటిగోడకు నోటీసు పాల్వంచకు చెందిన ఫైనాన్స్ వ్యాపారి వెంకటేశ్వరరావు ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొం టూ, బెయిల్‌పై ఉన్న రాఘవను విచారణ రావాలం టూ పోలీసులు శుక్రవారం పాల్వంచలోని ఎమ్మెల్యే వనమా ఇంటి గోడకు నోటీసు అంటించడం చర్చనీయాంశమైంది. వెంకటేశ్వరరావు గతేడాది జూలై 29న తన చావుకు రాఘవ, మరో 42 మంది కారణమంటూ సూసైడ్ నోట్ రాసి.. పురుగుల మందు తాగాడు. విచారణలో ఉన్న ఆ కేసుకు సంబంధించి రాఘవ ముందస్తు బెయిల్‌పై ఉన్నారు. నోరువిప్పుతున్న రాఘవ బాధితులు రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య అనంతరం నెలకొన్న పరిస్థితులు, చోటు చేసుకుంటోన్న పరిణామాలను చూసి రాఘవ బాధితులు ఒక్కరొక్కరుగా తెరపైకి వస్తున్నారు. బాధిత మహిళలు కొందరు శుక్రవారం ‘సాక్షి’తో తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. తమకు జరిగిన అన్యాయం గురించి పోలీసులతో పాటు ఉన్నతాధికారులను కలిసినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు స్పందించి ఉంటే రాఘవ దాష్టీకాలకు అప్పుడే తెరపడేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం కోసం వెళితే డాక్యుమెంట్లు చింపేశారు.. నవభారత్ (పాల్వంచ)లో రూ.50 లక్షల విలువైన స్థలాన్ని రాఘవ అనుచరులు 2020 ఏప్రి ల్లో కబ్జా చేశారు, న్యాయం కోసం వెళ్తే రాఘవ నా వద్ద ఉన్న స్థలం డాక్యుమెంట్లు చించివేశారు, తర్వాత నాతో పాటు నా అన్నపైనా ఆయన అనుచరులు దాడి చేశారు. న్యాయం కోసం పోలీసుల దగ్గరికి వెళ్తే ఫిర్యాదు కూడా తీసుకోలేదు. నన్ను, నాన్న, అన్నను అకారణంగా పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. చివరకు రెవెన్యూ అధికారులూ నా గోడును పట్టించుకోలేదు. దీంతో పురుగుల మందు తాగి ఎలాగో బయటపడ్డా. అప్పుడే పోలీసులు స్పందించి ఉంటే ఈ రోజు పచ్చని కుటుంబం బతికి ఉండేది. – జ్యోతి, పాల్వంచ వారసత్వ భూమిని కాజేశారు.. పాల్వంచ పట్టణంలోని కాంట్రాక్టర్ కాలనీలో మా మామ గారికి మూడెకరాల ఖాళీ స్థలం ఉంది. అది నా భర్త జాన్రాంకుమార్కు వారసత్వ ఆస్తిగా వచ్చింది. 2020 మార్చిలో ఆ భూమిని చదును చేస్తుంటే రాఘవ.. అనుచరులు, పోలీసులతో అక్కడికి వచ్చాడు. ఆ భూమి తనదని బెదిరించాడు. పోలీసులు ఏ విషయం ఆరా తీయకుండా నన్ను, నా భర్తను జీపులో పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. మరుసటి రోజు భూమి కాగితాలతో రాఘవ ఇంటికి వెళ్తే ఆయన దుర్భాషలాడారు. ఆ స్థలం జోలికి వస్తే చంపుతానని బెదిరించారు. ఇప్పటికీ ఆ భూమి రాఘవ అధీనంలోనే ఉంది. – శ్రీదేవి, పాల్వంచ చదవండి: వనమా రాఘవేంద్ర అరెస్ట్ పై కొనసాగుతున్న సస్పెన్స్ -
టీఆర్ఎస్ నుంచి వనమా రాఘవ సస్పెన్షన్
-
టీఆర్ఎస్ నుంచి వనమా రాఘవ సస్పెన్షన్
హైదరాబాద్: ఓ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాఘవను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వచ్చినట్లు టీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనలో వనమా రాఘవేంద్రరావు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. వనమా అరాచకాలను చెబుతూ రామకృష్ణ ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో వెలుగులోకి వచ్చింది. వనమా రాఘవా తనను మానసికంగా వేధించాడని ఈ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు రామకృష్ణ. వనమా అరాచకాలను చెబుతూ కన్నీటిపర్యంతమయ్యాడు. ఏ భర్తకూడా వినకూడని మాటలను రాఘవ అన్నారని ఆవేదన చెందాడు. రాజకీయ, ఆర్థిక బలంతో రాఘవ.. పబ్బం గడుపుకోవాలని చూశారని విమర్శించాడు. తాను చనిపోతే నా భార్య, పిల్లలను వదిలిపెట్టరు అందుకే.. వారితో పాటు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. ఈ క్రమంలోనే వనమా రాఘవను సస్పెండ్ చేసింది టీఆర్ఎస్ పార్టీ. -
వనమా రాఘవేంద్ర అరెస్ట్ పై కొనసాగుతున్న సస్పెన్స్
సాక్షి, హైదరాబాద్: పాల్వంచ రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్ కేసులో వనమా రాఘవేంద్రరావు చుట్టు ఉచ్చు బిగుస్తుంది. వనమాకు సంబంధించి మరో కేసు వెలుగులోకి వచ్చింది. మనుగురు ఫైనాన్స్ వ్యాపారి మలిపెద్ది వెంకటేశ్వర్లు సూసైడ్ కేసులో ఎఎస్పీ శబరిష్ ఎదుట విచారణకు హాజరవ్వాలని అధికారులు నోటీసులు జారీచేశారు. వనమాను శుక్రవారం మధ్యాహ్నంకల్లా లొంగిపోవాలని పోలీసులు హెచ్చరికలు జారీచేశారు. పోలీసులు రాఘవకు సంబంధించి పాత కేసులపై మరోసారి విచారణ చేపట్టారు. ప్రస్తుతానికి.. వనమాను వెతకడానికి 8 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. నిన్న (గురువారం)వనమాను అరెస్టు చేసినట్లు కొన్నివదంతులు వ్యాపించాయి. దీన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. అయితే, వనమా.. రాజమండ్రిలో ఉన్నట్లు సమాచారం రావడంతో కొన్ని టీంలు అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. వనమా వ్యవహరం ఇప్పుడు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తోంది. గడువులోగా రాఘవేంద్ర అరెస్టా? లొంగుబాటా? అనేదానిపై సస్సెన్స్ కొనసాగుతుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. చదవండి: ఎమ్మెల్యే తనయుడితో పోరాడలేకే వెళ్లిపోతున్నాం -
వనమా రాఘవేందర్ అరెస్టుపై హైడ్రామా!
సాక్షి,భద్రాద్రి కొత్తగూడెం: రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఉదంతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేందర్రావు అరెస్టుపై హైడ్రామా కొనసాగుతోంది. కొత్తగూడెం పోలీసులు గురువా రం మధ్యాహ్నం రాఘవేందర్‌ను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నట్లు ప్రసార మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. స్వయంగా ఎమ్మెల్యేనే తన కుమారుడిని పోలీసులకు అప్పగించారని, విచారణ నిమిత్తం రాఘవేందర్‌ను పోలీసులు కొత్తగూడెం తీసుకెళ్లారనే ప్రచారం సాగింది. కానీ రాత్రి వరకు జిల్లా పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో మీడి యాతో మాట్లాడిన పాల్వంచ ఏఎస్పీ రోహిత్‌రాజ్.. రాఘవేందర్ కోసం తెలంగాణ, ఏపీలో ఎనిమిది ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు. ఆయన గత నేరచరిత్రనూ వెలికితీసి పాత కేసులకు సంబంధించి స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తామని తెలిపారు. అంతే కాకుండా రౌడీషీట్ తెరుస్తామని వెల్లడించారు. ఒకవేళ రాఘవేందర్ బెయిల్ పిటిషన్ దాఖలుచేసినా గట్టిగా కౌంటర్ దాఖలు చేస్తామని ఏఎస్పీ చెప్పారు. కాగా, వీలైనంత త్వర లో అతడిని పట్టుకుని కోర్టులో హాజరుపరుస్తామని ఎస్పీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కేసులో కీలకంగా కారు ఇదిలాఉంటే.. రామకృష్ణకు చెందిన కారు (ఏపీ 28 బీ2889) ఈ కేసును కీలక మలుపు తిప్పింది. భార్య, ఇద్దరు పిల్లలతో సహా తానూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న రామకృష్ణ.. తన కారులోనే ఆత్మహత్యకు కారణాలపై సెల్ఫీ వీడియో చిత్రీకరించారు. అనంతరం ఫోన్‌ను అదే కారులో పెట్టారు. ఇటు సూసైడ్ నోట్ కూడా పోలీసులకు రామకృష్ణ కారు నుంచే లభ్యమైంది. ఫోన్, సూసైడ్ నోట్ తన తల్లి, సోదరికి చిక్కుతుందనుకున్నారో లేక మంటల్లో కాలి సాక్ష్యాలు పోలీసులకు దొరకవనుకున్నారో తెలియదు గానీ.. ఫోన్, సూసైడ్ నోట్‌ను కారులోనే ఉంచి ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
ఎమ్మెల్యే తనయుడితో పోరాడలేకే వెళ్లిపోతున్నాం
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ కుటుంబ ఆత్మహత్య ఉదంతంలో కొత్త కోణం వెలుగు చూసింది. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ తీసిన సెల్ఫీ వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన తల్లి సూర్యావతి, అక్క మాధవితోపాటు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవేందర్రావు పెట్టిన బాధలను ఆ వీడియోలో వివరించారు. చనిపోయే ముందు తన కారులో కూర్చొని 8:55 నిమిషాల నిడివి గల వీడియో తీసిన రామకృష్ణ తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, మానసిక క్షోభను వివరించారు. ఇది అందరినీ కలచివేస్తోంది. వీడియోలో రామకృష్ణ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే... ►వాళ్లుండేది (తల్లి, అక్క) సొంతిళ్లు.. రూ. పది వేల అద్దె వస్తుంది. వాళ్లకు సంవత్సరానికి పంట కౌలు వస్తుంది. నాకు పొలం మీద ఆదాయం రాదు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేను వనమా రాఘవేందర్రావు గారి వద్దకు వెళ్లా. ఈ సమస్య తేలాలంటే నీ భార్యను తీసుకొని హైదరాబాద్‌కు రా. పిల్లలు లేకుండా. అప్పడు నీ సంగతి చూస్తా. అప్పటివరకు ఈ సమస్య పరిష్కారం కాదు. ఎక్కడికి వెళ్లినా ఎవరూ ఏమీ చేయలేరు. నయాపైసా నీకు రాకుండా చేస్తానని రాఘవేందర్రావు నాతో చెప్పారు. ►సాయం కోసం వెళ్తే నా భార్యను పంపాలన్న ఇలాంటి దుర్మార్గుడిని ఏం చేయాలి? కనీసం డబ్బు రూపంలో అడిగినా నేను ఇచ్చేవాడిని. కానీ నా భార్యను కోరుకున్నాడు. దాన్ని జీర్ణించుకోలేకపోయా (ఈ విషయం నా భార్యకు తెలియదు). వీళ్లతో పోరాడే స్థితిలో నేను లేను. రాజకీయ, ఆర్థిక అండదండలూ లేవు. నేనొక్కడినే ఏదైనా చేసుకుంటే రేపు నా భార్య పరిస్థితి ఏంటి? ఆమెను అసలు వీళ్లు ఏం చేస్తారో, నా పిల్లలు ఏమైపోతారో కూడా అర్థంకావడం లేదు. నడిరోడ్డుపై వదిలేసి నా దారి నేను చూసుకోవడం బాధ్యత కాదు. కాబట్టి నాతోపాటే వారినీ తీసుకెళ్లిపోతున్నా. ►నా జీవితం ఎలాగైనా ఫర్వాలేదు. ఇంకా వేరే కుటుంబాలు పాడవకుండా ఊళ్లో మిగిలిన పెద్దలు, నాయకులంతా కలిసి నా తండ్రి ద్వారా నాకు వచ్చే ఆస్తిని.. నాకు ఆర్థికసాయం చేసిన వారికిచ్చి నా అప్పు తీర్చండి. మిగిలింది వారి (అమ్మ, అక్క)కే వదిలేయండి. ►రాఘవేందర్రావు వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. ఇంకా చాలా కుటుంబాలు నాశనమవుతాయి. ఈ మధ్య కాలంలోనే పాల్వంచలో ఒకతను ఆయన పేరు రాసి చనిపోయాడు. నెల రోజులు ఎక్కడో దాక్కొని ఆ తర్వాత వచ్చాడు. మూడు, నాలుగు నెలల్లోనే మళ్లీ ఇలా దురాగతాలు చేస్తోంటే సామాన్యులు ఎలా బతుకుతారు? కుదిపేసిన సెల్ఫీ వీడియో... ఎమ్మెల్యే తనయుడిపై రామకృష్ణ చేసిన ఆరోపణలు ఉమ్మడి జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయాలను కుదిపేశాయి. అజ్ఞాతంలో ఉన్న రాఘవను అరెస్ట్ చేసి శిక్షించాలంటూ మూడు రోజుల నుంచి ఆందోళన చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, బీఎస్పీ శ్రేణులు గురువారం ఆందోళనను ఉధృతం చేశాయి. పాల్వంచలోని ఎమ్మెల్యే నివాసాన్ని బీజేపీ నాయకులు ముట్టడించగా పోలీసులు అరెస్ట్ చేశారు. జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కొత్తగూడెంలో వనమా రాఘవ దిష్టిబొమ్మను దహనం చేశారు. వామపక్ష నేతలు శుక్రవారం కొత్తగూడెం నియోజకవర్గ బంద్‌కు పిలుపునిచ్చారు. రాఘవేందర్‌పై ఆరు కేసులు.. వనమా రాఘవేందర్‌రావుపై పాల్వంచ పట్టణం, రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం ఆరు కేసులున్నాయి. 2013లో పాల్వంచ మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘించి చీరలు పంపిణీ చేసిన ఘటనలో ఐపీసీ 336, 353, 171, 188 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ►2017లో పాల్వంచలోని కేటీపీఎస్ సెంటర్లో ఆర్టిజన్లకు ఉద్యోగాలు కల్పించాలని ఆందోళన చేస్తూ అధికారుల విధులకు ఆటంకం కలిగించినట్లు ఐపీసీ 427, 149 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ►2020లో ఓ స్థల వివాదంలో రాఘవేందర్ అనుచరులు గిరిజన మహిళపై దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ ఘటనలో రాఘవపై ఐపీసీ 158, 307 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు వెళ్లడం సంచలనంగా మారింది. ►2020లో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినట్లు కేసు నమోదైంది. ►2021లో పాల్వంచ జయమ్మ కాలనీకి చెందిన మలిపెద్ది వెంకటేశ్వర్లు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా.. అందుకు కారకుల్లో రాఘవ పేరు కూడా ఉండటంతో ఐపీసీ 306 సెక్షన్ కింద కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన ఏ1గా ఉన్నారు. ►తాజాగా నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనలో రాఘవేందర్‌పై 302, 307, 306 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఆయన ఏ2గా ఉన్నారు.