
సాక్షి, హైదరాబాద్: పాల్వంచ రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్ కేసులో వనమా రాఘవేంద్రరావు చుట్టు ఉచ్చు బిగుస్తుంది. వనమాకు సంబంధించి మరో కేసు వెలుగులోకి వచ్చింది. మనుగురు ఫైనాన్స్ వ్యాపారి మలిపెద్ది వెంకటేశ్వర్లు సూసైడ్ కేసులో ఎఎస్పీ శబరిష్ ఎదుట విచారణకు హాజరవ్వాలని అధికారులు నోటీసులు జారీచేశారు. వనమాను శుక్రవారం మధ్యాహ్నంకల్లా లొంగిపోవాలని పోలీసులు హెచ్చరికలు జారీచేశారు.
పోలీసులు రాఘవకు సంబంధించి పాత కేసులపై మరోసారి విచారణ చేపట్టారు. ప్రస్తుతానికి.. వనమాను వెతకడానికి 8 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. నిన్న (గురువారం)వనమాను అరెస్టు చేసినట్లు కొన్నివదంతులు వ్యాపించాయి. దీన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. అయితే, వనమా.. రాజమండ్రిలో ఉన్నట్లు సమాచారం రావడంతో కొన్ని టీంలు అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది.
వనమా వ్యవహరం ఇప్పుడు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తోంది. గడువులోగా రాఘవేంద్ర అరెస్టా? లొంగుబాటా? అనేదానిపై సస్సెన్స్ కొనసాగుతుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.