
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదారాబాద్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. చందానగర్ పాపిరెడ్డి కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాజీవ్ గృహకల్ప బ్లాక్ నెంబర్ 18లో నివాసముంటున్న కుటుంబం... ఆదివారం అర్ధరాత్రి బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇద్దరు పిల్లలు సహా భార్యాభర్తలు విగతజీవులుగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. కుటుంబ కలహాలా? లేదా అప్పుల వ్యవహారం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ఇదీ చదవండి: తండ్రి కొడుకుల జంట హత్య కేసు: చీకటి జీవితాల్లో వెలుగు దివ్వెలు
Comments
Please login to add a commentAdd a comment