బుక్కపట్నంలో కలకలం | Family Suicide In Ananthapur | Sakshi
Sakshi News home page

బుక్కపట్నంలో కలకలం

Published Tue, May 29 2018 9:09 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM

Family Suicide In Ananthapur - Sakshi

రమాదేవి, కృష్ణ దంపతులు (ఫైల్‌)

బెంగళూరుకు వెళ్లేందుకు ఇంటినుంచి బయల్దేరిన తల్లీ కూతుళ్లు కనిపించడం లేదు. బ్యాగు, పిల్లల దుస్తులు చెరువు వద్ద పడి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. తల్లీపిల్లలు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారా.. లేక ఇంకేమైనా జరిగిందా.. అనేది తెలియడం లేదు. వారి జాడ కోసం గాలిస్తున్నారు.

బుక్కపట్నం: మండల కేంద్రం బుక్కపట్నంలో బైపాస్‌ సమీపాన ఎస్సీ కాలనీకి చెందిన గంగమ్మ కుమార్తె రమాదేవి (28)కి పెనుకొండ మండలం శెట్టిపల్లికి చెందిన కృష్ణతో ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. పొట్టకూటి కోసం బెంగళూరుకు వలస వెళ్లారు. అక్కడ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి బబ్లూ (6), జోసియో (4) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల రమాదేవి పిల్లలతో కలిసి పుట్టినిల్లు అయిన బుక్కపట్నం వచ్చింది. సోమవారం ఉదయం ఏడు గంటలకు బెంగళూరు వెళ్లేందుకుని ఇంటి నుంచి బయల్దేరారు.

చెరువు వద్ద కలకలం  
బుక్కపట్నం చెరువు తూము వద్ద ఒక బ్యాగ్, సెల్‌ ఫోన్, ఇద్దరు చిన్నారుల దుస్తులను అటువైపు వచ్చిన వారు గమనించారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. వెంటనే కొత్తచెరువు ఎస్‌ఐ రాజేష్, సిబ్బంది చెరువు వద్దకు చేరుకుని దుస్తులు, బ్యాగ్‌ ఎవరివని ఆరా తీయగా గంగమ్మ తన కుమార్తె రమాదేవి, మనవళ్లవని తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement