
లక్నో: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. నిద్రపోతున్న పిల్లలను శాశ్వతంగా నిద్రపుచ్చి అనంతరం తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘజియాబాద్‌లోని ఇందిరాపురమ్‌లో నివాసముంటున్న ఓ జంట ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం వేకువజామున పిల్లలు నిద్రిస్తున్న సమయంలో వారిని హత్య చేశారు.
అనంతరం ఆ జంటతో పాటు మరో మహిళ వారు నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లో ఎనిమిదో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు సంఘటనా స్థలంలోనే మరణించగా మరో మహిళ తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాయపడిన మహిళను మరణించిన వ్యక్తి రెండో భార్యగా భావిస్తున్నారు. అయితే రెండో భార్య ఎందుకు ఆత్మహత్యాయత్నం చేసిందనేది తెలియాల్సి ఉంది. మృతుల ఇంట్లో దొరికిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు విచారణ చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment