
సాక్షి, చెన్నై: తమిళనాడులోని మధురై యోగప్పనగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ఆదివారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేశారు. వారిలో ఐదుగురు మృతిచెందగా, ముగ్గురికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రాత్రి 7 గంటల సమయంలో ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న వీరిని పక్కింటి వాళ్లు గుర్తించి, మధురై రాజాజీ ఆస్పత్రికి తరలించారు.
అయితే చికిత్స పొందుతూ ఐదుగురు మృతిచెందగా, మరో ముగ్గురికి చికిత్స చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, వ్యాపారంలో నష్టాల వల్లే వీరు ఆత్మహత్యకు పాల్పడ్డట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.