
సాక్షి, సిద్దిపేట: ఆర్థిక ఇబ్బందులతో ఓ రైతు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఇద్దరు పిల్లలతో సహ దంపతులు ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లాలో మంగళవారం ఉదయం వెలుగు చూసింది. అక్కన్నపేట మండలం తురకవానికుంట గ్రామానికి చెందిన రైతు గుండా భగవాన్‌రెడ్డి(50), భార్య రాజవ్వ, కొడుకు ప్రేమ్ చందర్ రెడ్డి, కూతురు రోజా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే... వీరిలో భగవాన్‌రెడ్డి, ప్రేమ్ చందర్ రెడ్డి, రోజా మృతి చెందగా ప్రాణాపాయస్థితిలో ఉన్న రాజవ్వను హుస్నాబాద్ ఆస్పత్రిలో చేర్చారు.
రాజవ్వ పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. భార్య ఇద్దరు పిల్లలకు విషమిచ్చి భగవాన్ రెడ్డి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల వల్లే వారు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. కొడుకు కూతురు ఇద్దరూ ఎంబీఏ పూర్తి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment