సాక్షి, సిద్దిపేట: సిద్దిపేటలో జిల్లాలో గురువారం విషాదం చోటు చేసుకుంది. జిల్లాకేంద్రంలోని భారత నగర్‌లో ఓ కుటుంబం పురుగల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. స్థానికంగా నివాసముంటున్న హనుమంతరావు అనే వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలకు పురుగుల మందు ఇచ్చి తాను తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన చుట్టుపక్కల వారు హాస్పిటల్‌కు తరలించేలోపే హనుమంతరావుతో సహా ఇద్దరు పిల్లలు మృతి చెందారు.
హనుమంతరావు భార్య చికిత్స పొందుతుండగా, ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. హనుమంతరావు ఓ వార్త పత్రికలో రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణాలుగా భావిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. కటుంబంలోని ముగ్గురు మృతి చెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment