hanumantarao
-
సిద్దిపేటలో జర్నలిస్ట్ కుటుంబం ఆత్మహత్య
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేటలో జిల్లాలో గురువారం విషాదం చోటు చేసుకుంది. జిల్లాకేంద్రంలోని భారత నగర్లో ఓ కుటుంబం పురుగల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. స్థానికంగా నివాసముంటున్న హనుమంతరావు అనే వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలకు పురుగుల మందు ఇచ్చి తాను తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన చుట్టుపక్కల వారు హాస్పిటల్‌కు తరలించేలోపే హనుమంతరావుతో సహా ఇద్దరు పిల్లలు మృతి చెందారు. హనుమంతరావు భార్య చికిత్స పొందుతుండగా, ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. హనుమంతరావు ఓ వార్త పత్రికలో రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణాలుగా భావిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. కటుంబంలోని ముగ్గురు మృతి చెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది. -
పుట్టపర్తికి ఘన నివాళి
ప్రొద్దుటూరు కల్చరల్: పుట్టపర్తి నారాయణాచార్యుల వర్ధంతి సందర్భంగా శివాలయం సెంటర్లోని పద్మశ్రీ డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యుల కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మొల్ల సాహితీపీఠం అధ్యక్షుడు గానుగపెంట హనుమంత రావు మాట్లాడుతూ 14 భాషాల్లో పాండిత్యం కలిగిన అసాధరణ మేధావి పుట్టపర్తి అని కొనియాడారు. కడపలో పుట్టపర్తి నారాయణాచార్యుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, ఆయన నివశించిన భవనాన్ని స్మారక భవనంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో అగస్త్యేశ్వరస్వామి ఆలయం కమిటీ చైర్మన్ శంకరనారాయణ, మొల్లా సాహితీ పీఠం ఉపాధ్యక్షులు మునెయ్య, పేరి గురుస్వామి, పుట్టపర్తి సాహితీపీఠం కార్యదర్శి జింకా సుబ్రమణ్యం, రచయితలు, కవులు డాక్టర్ గోపాల్‌రెడ్డి, మునిస్వామి, భాస్కర్‌రాజు, అశోక్, తవ్వా సురేష్ పాల్గొన్నారు. అలాగే అనిబిసెంటు మున్సిపల్ హైస్కూల్లోని స్త్రీశక్తి భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వెంకటశివారెడ్డి మాట్లాడుతూ పుట్టపర్తి ప్రొద్దుటూరు వాసి కావడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో ఆడిటర్ గోపాలరావు, నిర్వహణ కార్యదర్శి రాంప్రసాద్‌రెడ్డి, రామాంజనేయరెడ్డి, ఖాసీం సాహెబ్, ప్రధానోపాధ్యాయుడు కాశీప్రసాదరెడ్డి, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాబు ఆత్మపరిశీలన చేసుకోవాలి: వీహెచ్
హైదరాబాద్: ఎమ్మెల్యేలను పశువుల మాదిరిగా కొనుగోలు చేస్తున్నారని గతంలో కేసీఆర్‌ను విమర్శించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే పనిని ఆంధ్రప్రదేశ్‌లో చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు విమర్శించారు. ఇతర పార్టీల వారిని ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకోవడం ఎంతవరకు సమంజసమో బాబు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని వీహెచ్ సూచించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ ఆత్మహత్యపై కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ పార్లమెంట్లో అబద్ధాలు చెప్పారని, దీనిపై ప్రివిలైజ్ మోషన్ నోటీసు ఇవ్వాలని హైకమాండ్‌కు సూచించినట్లు వీహెచ్ తెలిపారు. రోహిత్ మరణానికి సామాజిక బహిష్కరణే కారణమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వీసీ అప్పారావు, ఎమ్మెల్సీ రాంచంద్రరావులను శిక్షించాల్సిందేనని వీహెచ్ డిమాండ్ చేశారు. -
దూరదర్శన్ అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్ట్
-
అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్ట్
-
దూరదర్శన్ అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్ట్
విజయవాడ : దూరదర్శన్ ఉన్నతోద్యోగి ఒకరు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. విజయవాడ దూరదర్శన్ కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ హనుమంతరావు గురువారం లక్షన్నర లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు పట్టుబడ్డారు. టెలీ సీరియల్స్ బిల్లు మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేయటంతో బాధితులు సీబీఐని ఆశ్రయించారు. దాంతో రంగంలోకి దిగిన సీబీఐ...అధికారి లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం హనుమంతరావును అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.