బాబు ఆత్మపరిశీలన చేసుకోవాలి: వీహెచ్
హైదరాబాద్: ఎమ్మెల్యేలను పశువుల మాదిరిగా కొనుగోలు చేస్తున్నారని గతంలో కేసీఆర్ను విమర్శించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే పనిని ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు విమర్శించారు. ఇతర పార్టీల వారిని ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకోవడం ఎంతవరకు సమంజసమో బాబు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని వీహెచ్ సూచించారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ ఆత్మహత్యపై కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ పార్లమెంట్లో అబద్ధాలు చెప్పారని, దీనిపై ప్రివిలైజ్ మోషన్ నోటీసు ఇవ్వాలని హైకమాండ్కు సూచించినట్లు వీహెచ్ తెలిపారు. రోహిత్ మరణానికి సామాజిక బహిష్కరణే కారణమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వీసీ అప్పారావు, ఎమ్మెల్సీ రాంచంద్రరావులను శిక్షించాల్సిందేనని వీహెచ్ డిమాండ్ చేశారు.