విషాదం: కుటుంబమంతా ఆత్మహత్య
విషాదం: కుటుంబమంతా ఆత్మహత్య
Published Sun, Mar 26 2017 12:16 PM | Last Updated on Tue, Sep 5 2017 7:09 AM
మంత్రాలయం: కర్నూలు జిల్లా మంత్రాలయంలో విషాదం చోటుచేసుకుంది. శ్రీ రాఘవేంద్రస్వామి దర్శనానికి వచ్చిన ఒక కుటుంబంలోని ముగ్గురు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానిక విజయేంద్ర వసతి భవనంలో పుదుచ్చేరికి చెందిన దంపతులు తమ పదేళ్ల కూతురికి విషం ఇచ్చి అనంతరం ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement