కుమారుడు సాత్విక్‌తో రామయ్య(ఫైల్)
సాక్షి, నాగార్జునసాగర్(నల్లగొండ): అనారోగ్య సమస్యలు, మానసిక సంఘర్షణతోనే జెన్‌కో ఉద్యోగి కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు ఉద్యోగి రామయ్య తండ్రి వెంకటయ్య ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇటీవల కుమారుడు, భార్యతో కలిసి జెన్‌కో ఉద్యోగి కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. రామయ్యతో పాటు, భార్య నాగమణి, కుమారుడు సాత్విక్‌ను స్వగ్రామం చింతలపాలెంలో దహన సంస్కారాలు పూర్తి చేశారు.
రామయ్యకు కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఇటీవల మిర్యాలగూడలో పరీక్షలు చేయించుకోగా హెచ్‌ఐవీ ఉన్నదని, అదే విధంగా కరోనా కూడా సోకినట్లు తేలడంతో తీవ్ర మానసిక సంఘర్షణకు లోనైనట్లు తోటి ఉద్యోగులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రామయ్య కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుని ఉంటాడ ని అనుమానిస్తున్నారు. తొలుత కుమారుడు సాత్వి క్‌ను బ్రిడ్జి పైనుంచి కృష్ణానదిలోకి తోసేసి అనంతరం దంపతులు చేతులు పట్టుకుని దూకినట్లు తెలుస్తోంది.
మొదట సాత్విక్ మృతదేహం, అనంతరం చేతులు పట్టుకుని ఉన్న రామయ్య దంపతుల మృతదేహాలు తేలినట్లు జాలర్లు చెబుతున్నారు. తనకున్నజబ్బులు బయటకు తెలిస్తే సమాజం చిన్నచూపు చూస్తుందని ప్రతికూల భావనతో కుంగిపోయి అఘాయిత్యానికి పాల్పడినట్లు గ్రామస్తులు చెప్పుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment