భార్యాబిడ్డలను చంపి సాప్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య! | Software engineer family commits suicide in hyderabad | Sakshi
Sakshi News home page

భార్యాబిడ్డలను చంపి సాప్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య!

Published Wed, Jun 25 2014 1:04 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

భార్యాబిడ్డలను చంపి సాప్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య! - Sakshi

భార్యాబిడ్డలను చంపి సాప్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య!

హైదరాబాద్ : హైదరాబాద్ మాదాపూర్లోని మైహోం  అపార్ట్మెంట్లో విషాదం చోటుచేసుకుంది. ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కొడుకుతో సహా దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం ఢిల్లీకి చెందిన సాప్ట్వేర్ ఇంజినీర్ మనీష్ సాహు, అతని భార్య శ్వేతాసాహు,  మూడేళ్ల కుమారుడు యాష్‌ సాహులు బలవన్మరణానికి పాల్పడ్డారు.

మనీష్  సాహు గత నాలుగు రోజుల నుంచి విధులకు హాజరు కాకపోవటంతో తోటి ఉద్యోగులు అతని నివాసానికి వచ్చారు. వారు నివాసం ఉంటున్న 108 ప్లాట్‌ నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. తలుపులు ఎంతకి తెరవకపోవడంతో  పగులకొట్టి చూడగా  సాహు కుటుంబీకులు విఘత జీవులుగా కనిపించారు. మృతదేహాలు ఉన్న పరిస్థితిని బట్టి ఆత్మహత్య జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమిక అంచనా.

వారంతంలో సాహు దంపతులు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. తల్లీకొడుకులు రక్తపు మడుగులో ఉండగా, సాహు అదే గదిలో కిటికీకి ఉరేసుకుని ఉన్నాడు. సాహు ముందుగా భార్యాబిడ్డలను హతమార్చి అనంతరం తాను ఉరి వేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘటనకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్ట్మార్టంకు తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement