
సాక్షి, చెన్నై: క్యాన్సర్‌తో పెద్దకుమారుడు మరణించడం ఓ కుటుంబాన్ని కలిచి వేసింది. నీ వెంటే మేమూ అంటూ ఆ కుటుంబంలోని నలుగురు సోమవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. వివరాలు.. సేలం జిల్లా అమ్మాపేట సమీపంలోని వలకాడుకు చెందిన మురుగన్, కోకిల దంపతులకు కుమారులు మదన్ కుమార్ (14), వసంతకుమార్(12), కార్తీక్(9) ఉన్నారు. సమీప గ్రామంలోని ఓ సెలూన్‌లో మురుగన్ పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం ఆ ఇంటి తలుపులు ఎంతకు తెరచుకోలేదు. దీంతో పక్కింట్లో ఉన్న వాళ్లకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంట్లో మురుగన్, కోకిల, వసంతకుమార్, కార్తీక్‌లు విగతజీవులుగా పడివున్నారు. మృతదేహాలను పరిశీలించగా అందరూ విషం సేవించినట్టు తేలింది. చదవండి: (హుస్నాబాద్‌లో విషాదఛాయలు)
విచారణలో బయటపడిన నిజాలు
సేలం అమ్మాపేట పోలీసులు కేసు నమోదు చేసిన మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. విచారణలో 8 నెలల క్రితం పెద్దకుమారుడైన మదన్ కుమార్ క్యాన్సర్‌తో మరణించినట్టు తెలిసింది. దీంతో ఆ కుటుంబం తీవ్ర శోక సంద్రంలో మునిగింది. స్థానికులతోసరిగ్గా మాట్లాడకుండా పెద్దకుమారుడిని తలచుకుంటూ అతడి ఫొటో వద్దే మురుగన్, కోకిల్ కూర్చుని ఉండేవారు. మురుగన్ పనికి వెళ్లడం మానేశాడు. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. ఇద్దరు కుమారులకు విషమిచ్చి దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment