సాక్షి, ఖమ్మం జిల్లా: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఓ వైపు సీఎం కేసీఆర్, మరో వైపు గవర్నర్ తమిళిసై పర్యటనలు కొనసాగుతున్నాయి. భద్రాచలంలో వరద ముంపు ప్రాంతాలను గవర్నర్ పరిశీలిస్తున్నారు. తమిళిపై పర్యటనలో కలెక్టర్, జిల్లా ఎస్పీ కనిపించలేదు. గవర్నర్ వెంట ఏఎస్పీ, ఆర్డీవో మాత్రమే ఉన్నారు. పోటోకాల్ వివాదంపై నో కామెంట్ అంటూ గవర్నర్ మాట దాట వేశారు. బాధితుల సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తానని ఆమె పేర్కొన్నారు.
చదవండి: వర్షంలోనే సీఎం కేసీఆర్ పర్యటన.. గోదారమ్మకు శాంతి పూజలు
36 ఏళ్ల తర్వాత గోదావరి రికార్డు స్థాయి నీటి ప్రవాహంతో రావడంతో భద్రాచలం నీట మునిగింది. వరద ముంపు ప్రాంతాలలో సీఎం, గవర్నర్ పర్యటిస్తున్నారు. రోడ్డు మార్గాన హనుమకొండ నుంచి భద్రాచలంకు సీఎం వచ్చారు. మరో వైపు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మణుగూరు చేరుకుని అక్కడ నుంచి అశ్వాపురంలోని వరద ముంపు ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. భద్రాచలంలో సీఎం కేసీఆర్, అశ్వాపురంలో గవర్నర్ తమిళ్ సై పర్యటనలు పోటా పోటీగా సాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment