affected areas
-
CM KCR: వరదలు విదేశీ కుట్రే.. సీఎం కేసీఆర్ సంచల వ్యాఖ్యలు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం/ వరంగల్: మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న వరదల వెనుక ఇతర దేశాల కుట్రలు దాగి ఉన్నాయంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘కడెం ప్రాజెక్టు వద్ద కనీవినీ ఎరుగని వరదను చూశాం. క్లౌడ్ బరస్ట్ కారణంగానే అలా అకస్మాత్తు వరదలు వస్తాయి. ఇతర దేశాల వాళ్లు మన దేశం మీద క్లౌడ్ బరస్ట్ కుట్రలు చేస్తున్నారని అంటున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కుట్రలు చేస్తున్నట్టు సమాచారం అందుతోంది’’ అని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల పరిధిలో ముంపు ప్రాంతాలను పరిశీలించిన సందర్భంగా కేసీఆర్ ఈ మాటలు అన్నారు. ఈ నెల 29వ తేదీ వరకు భారీ వర్షాలు పడతాయని సమాచారం ఉందని.. అందువల్ల గోదావరికి వరద ముప్పు ఇంకా తొలగిపోలేదని, తీర ప్రాంతాల ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గోదావరి వరద ముంపు బాధితులకు అండగా ఉంటామని.. భవిష్యత్తులో ఏ గ్రామం కూడా వరద ముంపులో ఉండకుండా చర్యలు చేపడతామని ప్రకటించారు. నదికి ఇరువైపులా అవసరమైన చోట కరకట్టలను బలోపేతం చేయడంతోపాటు కొత్త కరకట్టలను నిర్మిస్తామన్నారు. పర్యటన సందర్భంగా కేసీఆర్ గోదావరి వరదను పరిశీలించి.. అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. ఇంకా వానలు పడతాయి.. వాతావరణ శాఖ అంచనాలు, ప్రైవేట్ వాతావరణ ఏజెన్సీల లెక్కల ప్రకారం ఈనెల 29 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురవనున్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇప్పటికే వాగులు, చెరువులు నిండుకుండల్లా ఉన్నాయని, ఇకపై కురిసే ప్రతీ చినుకు వరదగా మారుతుందని తెలిపారు. ఈ విషయాన్ని గుర్తుంచుకుని వానాకాలం ముగిసేదాకా నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలు, ఆయా జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. తక్షణ సాయంగా రూ.10 వేలు ముంపు బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని.. రెండు నెలల పాటు బియ్యాన్ని ఉచితంగా అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. భద్రాచలంలో ముంపు కాలనీల వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని.. వారి కోసం సింగరేణి సంస్థతో కలిసి రూ.1,000 కోట్లతో ఎత్తయిన ప్రాంతంలో కొత్త ఇళ్లతో కాలనీ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆ కాలనీ శంకుస్థాపనకు తానే స్వయంగా వస్తానని చెప్పారు. ఆ పర్యటనలో ఆలయం, పట్టణ అభివృద్ధి పనుల విషయాలు మాట్లాడుతాన్నారు. కరకట్టలు బలోపేతం చేస్తాం.. కొత్తవి కట్టిస్తాం భవిష్యత్‌లో భద్రాచలం, పినపాక నియోజకవర్గాలకు ముంపు భయం లేకుండా చర్యలు చేపడతామని.. దీనిపై ఐఐటీ ప్రొఫెసర్లు, సీడబ్ల్యూసీ ఇంజనీర్లు, రాష్ట్రానికి చెందిన నిపుణులతో కమిటీ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. భద్రాచలం ప్రాంతంలో గత ఐదు వందల ఏళ్ల వర్షపాతం, వరదల వివరాల ఆధారంగా కొత్త లెవల్స్‌ను నిర్ధారిస్తామని చెప్పారు. నిపుణుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రస్తుత కరకట్టను బలోపేతం చేయడంతోపాటు బూర్గంపాడు వైపు అవసరమైన చోట కరకట్టలు నిర్మిస్తామని వెల్లడించారు. విలీన మండలాల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కూడా ప్రయత్నిస్తామని. దీనిపై ఏపీ అధికారులతో మాట్లాడుతామని చెప్పారు. వరద తగ్గే వరకు పునరావాస కేంద్రాలు రామన్నగూడెంలో పునరావాస శిబిరాన్ని పరిశీలించిన అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడారు. వరద తగ్గే వరకూ పునరావాస కేంద్రాలు కొనసాగుతాయని చెప్పారు. ‘‘వరదలు వచ్చినప్పుడల్లా రామన్నగూడెంలో నష్టం జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ కాలనీలను పరిశీలించాను. ఈ ప్రాంతానికి వరద ముంపు రాకుండా, ఇబ్బంది లేకుండా శాశ్వత చర్యలు తీసుకుంటాం’’ అని ముంపు బాధితులకు కేసీఆర్ భరోసా ఇచ్చారు. నెలాఖరుదాకా అలర్ట్‌గా ఉండాల్సిందే.. ఏటూరునాగారం ఐటీడీఏలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించిన సీఎం కేసీఆర్.. నెలాఖరు వరకూ భారీ వర్షాలు కొనసాగే నేపథ్యంలో అంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాలు, వరదలు వచ్చినా ప్రాణనష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్న అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులను అభినందించారు. ప్రతిశాఖ అధికారులు మూడు షిఫ్టులుగా పనిచేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను దశలవారీగా ఎత్తైన ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. గత ప్రభుత్వాలు తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే చేపట్టాయని.. ఇప్పుడు ఎన్ని నిధులు ఖర్చయినా సరే శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. వరద పరిస్థితులపై భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడేలా నీటిపారుదల శాఖ అధికారులు ప్రత్యేకంగా ఒక బుక్‌ను తయారు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. వరదతో చాలాచోట్ల మిషన్ భగీరథ పైపులు దెబ్బతిన్నాయని.. వాటికి తక్షణమే మరమ్మతులు చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏటూరు నాగారం ప్రాంతంలో కరకట్టల పటిష్టత కోసం అవసరమైతే రూ.100 కోట్లు అదనంగా ఇస్తామన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్‌డిపో ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులు కోరినందున.. వెంటనే మంజూరు చేస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సీఎం ఏరియల్ సర్వే రెండు హెలికాప్టర్లు సిద్ధంగా ఉంచాలి భారీ వర్షాలు, వరద ముప్పు తొలగిపోయే వరకు ములుగు జిల్లా కేంద్రంలో ఒక హెలికాప్టర్‌ను, భద్రాచలంలో మరొక హెలికాప్టర్‌ను సిద్ధంగా ఉంచాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఏజెన్సీ ప్రజలు ఇబ్బందిపడకుండా పాత బ్రిడ్జిలు, కాజ్ వేలు, కల్వర్టులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. కరెంటును కూడా యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని సూచించారు. వరద ప్రభావిత జిల్లాలకు తక్షణ నిధులు వరద ప్రభావిత జిల్లాలకు తక్షణ సాయం కింద ప్రత్యేకంగా నిధులు ఇస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ములుగు జిల్లాకు రూ.2.50 కోట్లు, భద్రాచలానికి రూ.2.30 కోట్లు, భూపాలపల్లి జిల్లా కు రూ.2 కోట్లు, మహబూబాబాద్‌కు రూ.కోటీ 50 లక్షలు మంజూరు చేస్తున్నామన్నారు. ఆదివారం భద్రాచలం బ్రిడ్జి వద్ద గోదారమ్మ శాంతించాలని మొక్కుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వరదల వెనుక.. ముంపు ప్రాంతాల పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న వరదల వెనుక ఇతర దేశాల కుట్రలు దాగి ఉన్నాయన్నారు. వరదలపై నిర్వహించిన సమీక్షలో కేసీఆర్ మాట్లాడుతూ ‘‘చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో వచ్చిన వరదను కడెం ప్రాజెక్టు దగ్గర చూశాం. ఏ ఒక్కరోజు కూడా కడెం ప్రాజెక్టు దగ్గర వరద రెండున్నర లక్షల క్యూసెక్కులు దాటలేదు. ఆ ప్రాజెక్టు గరిష్ట విడుదల సామర్థ్యం 2.90 లక్షల క్యూసెక్కులే. కానీ ఈసారి ఐదు లక్షల క్యూసెక్కులకు మించి వరద వచ్చింది. మానవ ప్రయత్నం కాదు కేవలం భగవంతుడి దయవల్లే ఆ ప్రాజెక్టు మనకు దక్కింది. ప్రాజెక్టు వద్ద వరద ఫోటోలు, వీడియోలు చూస్తుంటే.. అంతా నీళ్లుండి మధ్యలో ఓ చిన్న గీతలా డ్యాం కనిపించింది. ఇలా అకస్మాత్తుగా వచ్చే భారీ వరదలకు క్లౌడ్ బరస్ట్ కారణం. ఇతర దేశాల వాళ్లు కావాలని మన దేశం మీద క్లౌడ్ బరస్ట్ కుట్రలు చేస్తున్నారని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. గతంలో జమ్మూకశ్మీర్, లెహ్ (లడఖ్), ఉత్తరాఖండ్ దగ్గర ఈ తరహా కుట్రలు జరిపారు. ఇప్పుడు గోదావరి పరీవాహక ప్రాంతంలో క్లౌడ్‌బరస్ట్ కుట్రలు చేస్తున్నట్టు మనకు సమాచారం ఉంది’’అని కేసీఆర్ పేర్కొన్నారు. ఏటూరునాగారంలోని రామన్నగూడెం వద్ద గోదావరికి సారె సమర్పిస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో సత్యవతి రాథోడ్, సీతక్క క్లౌడ్ బరస్ట్ అంటే..? ఏదైనా ఒక ప్రాంతంలో ఉన్నట్టుండి కొంత సమయంలోనే అతిభారీ వర్షం కురిస్తే దానిని ‘క్లౌడ్ బరస్ట్ (కుంభ వృష్టి)’ అని చెప్పవచ్చు. వాతావరణ శాఖ లెక్క ప్రకారమైతే.. ఒక ప్రాంతంలో ఒక్క గంటలోనే పది సెంటీమీటర్లకన్నా ఎక్కువ వాన కురిస్తే క్లౌడ్ బరస్ట్ అంటారు. తేమశాతం అత్యధికంగా ఉన్న మేఘాలు ఒకే చోట కేంద్రీకృతం కావడం లేదా ఢీకొట్టడం వల్ల అప్పటికప్పుడు ఇలా కుంభ వృష్టి నమోదవుతుంది. నీరంతా ఒకేసారి పోటెత్తి.. అకస్మాత్తు వరదలు వచ్చే ప్రమాదం ఉంటుంది. సీఎం పర్యటన సాగిందిలా.. తొలుత సీఎం కేసీఆర్ ఆదివారం ఉదయం హన్మకొండ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఏటూరునాగారం, మణుగూరు మీదుగా భద్రాచలం చేరుకున్నారు. గోదావరి వంతెనపై కాన్వాయ్ ఆపి వరద ఉధృతిని పరిశీలించారు. గోదావరి మాతకు పసుపు కుంకుమ, కుంకుమలతోపాటు నూతన వస్త్రాలు సమర్పించి పూజ చేశారు. తర్వాత కరకట్ట మీదికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అక్కడి నుంచి పునరావాస శిబిరాలకు చేరుకుని ముంపు బాధితులకు ధైర్యం కల్పించారు. తర్వాత భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో అధికారులతో సమీక్షించి.. హెలికాప్టర్లో ఏటూరునాగారంలోని రామన్నగూడెంకు బయలుదేరారు. ఈ సందర్భంగా గోదావరి వెంట ఏరియల్ సర్వే చేశారు. నదికి ఇరువైపులా వరదలో చిక్కుకున్న గ్రామాల పరిస్థితిని పరిశీలించారు. రామన్నగూడెంలో హెలికాప్టర్ దిగాక కేసీఆర్ నేరుగా ఐటీడీఏ గెస్ట్‌హౌజ్‌కు వెళ్లి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి వరద తాకిడికి గురైన రామన్నగూడెం కరకట్టను పరిశీలించారు. వరద ప్రవాహం తగ్గాలంటూ గోదావరి తల్లికి సారె సమర్పించి పూజ చేశారు. తర్వాత పునరావాస శిబిరానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. వారితో మాట్లాడి ఏర్పాట్లు, భోజన వసతులపై ఆరా తీశారు. కాగా పర్యటనలో సీఎం వెంట మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
వరదలపై సీఎం కేసీఆర్ అనుమానాలు.. కుట్ర కోణం దాగి ఉందా?
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఈ స్థాయిలో వరదలు వస్తాయని ఎవరూ ఊహించలేదని.. క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్ధతిలో వరదలు సృష్టిస్తున్నారని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. గతంలో కశ్మీర్, లేహ్ వద్ద ఇలాంటి కుట్రలు జరిగినట్లు వార్తలొచ్చాయన్నారు. ఇతర దేశాలు క్లౌడ్ బరస్ట్‌తో ఇలాంటి కుట్రలు చేస్తున్నాయనే చర్చ ఉందన్నారు. గోదావరి ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కుట్ర జరిగినట్లు అనుమానం ఉందన్నారు. దీనిపై నిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. చదవండి: తగ్గేదేలే.. ఎవరికి వారే.. అటు గవర్నర్.. ఇటు కేసీఆర్ పోటాపోటీగా.. కాగా, వరద ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా భద్రాచలంలో గోదావరి నదిపై సీఎం కేసీఆర్ గంగమ్మ తల్లికి పూజలు చేసిన అనంతరం కరకట్టను పరిశీలించారు. భద్రాచలం జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ ముంపు బాధితులను సీఎం కేసీఆర్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులు, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న నిత్యావసర వస్తువుల, సౌకర్యాలు, వైద్యం, ఇతర సహాయం గురించి సీఎం ఆరా తీశారు. వారిని పేరుపేరునా పలకరించారు. తమకు అన్నిరకాలుగా సహాయ, సహకారాలు అందుతున్నాయని, స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ అధికారులు తమను కంటికి రెప్పలా కాపాడుతున్నారని సీఎంకు బాధితులు వివరించారు. భద్రాచలంలో వరదలు వచ్చినపుడల్లా ప్రతిసారి ఇక్కడి ప్రజలు ముంపునకు గురికావడం బాధాకరమని సీఎం అన్నారు. శాశ్వత ప్రాతిపదికన కాలనీల నిర్మాణం: తరచుగా వరదల్లో మునిగిపోతున్న భద్రాచలం వాసుల కన్నీళ్లను తుడిచేందుకు సీఎం కేసీఆర్ వారికి శాశ్వత ప్రాతిపదికన నివాసాల కోసం కాలనీలు నిర్మించాలని నిర్ణయించారు. వరద చేరని ఎత్తైన ప్రదేశాల్లో అనువైన స్థలాలను గుర్తించి, బాధితులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి, నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ ను సీఎం ఆదేశించారు. తమకు శాశ్వత ప్రాతిపదికన రిలీఫ్ దొరకుతుండటంతో పునరావాస కేంద్రాల్లోని బాధితులు హర్షం వ్యక్తం చేశారు. -
తగ్గేదేలే.. ఎవరికి వారే.. అటు గవర్నర్.. ఇటు కేసీఆర్ పోటాపోటీగా..
సాక్షి, ఖమ్మం జిల్లా: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఓ వైపు సీఎం కేసీఆర్, మరో వైపు గవర్నర్ తమిళిసై పర్యటనలు కొనసాగుతున్నాయి. భద్రాచలంలో వరద ముంపు ప్రాంతాలను గవర్నర్ పరిశీలిస్తున్నారు. తమిళిపై పర్యటనలో కలెక్టర్, జిల్లా ఎస్పీ కనిపించలేదు. గవర్నర్ వెంట ఏఎస్పీ, ఆర్డీవో మాత్రమే ఉన్నారు. పోటోకాల్ వివాదంపై నో కామెంట్ అంటూ గవర్నర్ మాట దాట వేశారు. బాధితుల సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తానని ఆమె పేర్కొన్నారు. చదవండి: వర్షంలోనే సీఎం కేసీఆర్ పర్యటన.. గోదారమ్మకు శాంతి పూజలు 36 ఏళ్ల తర్వాత గోదావరి రికార్డు స్థాయి నీటి ప్రవాహంతో రావడంతో భద్రాచలం నీట మునిగింది. వరద ముంపు ప్రాంతాలలో సీఎం, గవర్నర్ పర్యటిస్తున్నారు. రోడ్డు మార్గాన హనుమకొండ నుంచి భద్రాచలంకు సీఎం వచ్చారు. మరో వైపు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మణుగూరు చేరుకుని అక్కడ నుంచి అశ్వాపురంలోని వరద ముంపు ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. భద్రాచలంలో సీఎం కేసీఆర్, అశ్వాపురంలో గవర్నర్ తమిళ్ సై పర్యటనలు పోటా పోటీగా సాగుతున్నాయి. -
వర్షంలోనే సీఎం కేసీఆర్ పర్యటన.. గోదారమ్మకు శాంతి పూజలు
సాక్షి, ములుగు/భద్రాద్రి కొత్తగూడెం: భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నది వరద ముంపు పరిస్థితులు, ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుని తగిన సహాయ కార్యక్రమాలు అందించేందుకు నిన్న వరంగల్ చేరుకున్న సీఎం కేసీఆర్.. ఆదివారం ఉదయం భద్రాచలం పర్యటనకు బయలుదేరారు. వర్షాలు కురుస్తుండటంతో, వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్లో ఏరియల్ సర్వేను అధికారులు రద్దుచేసిన నేపథ్యంలో బాధిత ప్రజలకు చేరుకోవడానికి సీఎం కేసీఆర్ రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నారు. చదవండి: సీతక్కకు తప్పిన ప్రమాదం ములుగు, ఏటూరు నాగారం మీదుగా వరద పరిస్థితులను వీక్షిస్తూ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను అడిగి తెలుసుకుంటూ భారీ వర్షంలోనే సీఎం కేసీఆర్ కాన్వాయ్ ప్రయాణం కొనసాగింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షం వరదలు సృష్టించిన బీభత్సాన్ని సీఎం పరిశీలించారు. భద్రాచలంలో గోదావరి నదిపై సీఎం కేసీఆర్ గంగమ్మ తల్లికి శాంతి పూజలు చేసిన అనంతరం కరకట్టను పరిశీలించిన సీఎం, భద్రాచలం జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి చేరుకున్నారు. అశ్వాపురంలో వరద బాధితులు ఆందోళన అశ్వాపురంలో వరద బాధితులు ఆందోళన చేశారు. సీఎం కేసీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నించారు. వరద బాధితులను పోలీసులు అడ్డుకోవడంతో వారి మధ్య తోపులాట జరిగింది. అశ్వాపురం రహదారిపై వరద బాధితులు బైఠాయించారు. -
రెప్ప వాల్చని ఏపీ సర్కారు.. వలంటీర్ నుంచి ఉన్నతాధికారి వరకు..
(వేలేరుపాడు నుంచి సాక్షి ప్రతినిధులు ఐ.ఉమామహేశ్వరరావు, వీఎస్వీ కృష్ణ కిరణ్): కట్టుబట్టలతో ఉన్న పళంగా అందుబాటులో ఉన్న వస్తువులను మూటలుగా కట్టి నెత్తిన పెట్టుకుని.. చంటి పిల్లల్ని చంక నెత్తుకుని.. ముసలి వారిని వాహనాలపై ఎక్కించుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్న దృశ్యాలు లంక గ్రామాల్లో కనిపిస్తున్నాయి. మూగ జీవాలను సైతం రక్షించుకునేందుకు తాపత్రయ పడుతూ.. ఉన్న ఇంటిని, సొంత ఊరిని వదిలి వేలాది మంది ట్రాక్టర్లు, ఆటోలపై సహాయక శిబిరాలకు, బందువుల ఇళ్లకు వెళ్తున్న దృశ్యాలు ఈ ప్రాంతంలో ఊరూరా కనిపిస్తున్నాయి. ‘వరద ముప్పు పెరుగుతోంది.. ఇల్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలి’ అంటూ వలంటీర్, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది అనుక్షణం అప్రమత్తం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ముందు చూపునకు నిదర్శనం. చదవండి: ఆదుకో.. మావయ్యా.. గమనించిన సీఎం జగన్ కాన్వాయ్ ఆపి.. పోలీస్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని పెద్ద ఎత్తున మోహరించడం, శిబిరాల ఏర్పాటు, బాధితులకు పక్కాగా భోజన ఏర్పాట్లు వరద ప్రభావిత ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. భోజన, వసతి ఏర్పాట్లకు అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకం సిబ్బంది సేవలు ఉపయోగించుకుంటున్నారు. అంటు వ్యాధులు ప్రబలకుండా, అనారోగ్య సమస్యలు దరిచేరకుండా 24 గంటల పాటు వైద్య సిబ్బంది విశేష సేవలు అందిస్తున్నారు. అయినవిల్లి మండలంలో ముంపు నుంచి సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్తున్న వరద బాధితులు ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. నిత్యావసర సరుకులు, టార్పాలిన్, బరకాలు పంపిణీ చేయడం ద్వారా ప్రభుత్వం బాధితులకు అడుగడుగునా భరోసా కల్పించింది. ఆంధ్రప్రదేశ్‌లో విలీన మండలాలైన వేలేరుపాడు, కుకునూరు పరిధిలోని అనేక ముంపు గ్రామాల్లో శుక్రవారం ఈ వసతి సౌకర్యాలు కనిపించాయి. ప్రభుత్వ యంత్రాంగం.. వలంటీర్ మొదలు కలెక్టర్ వరకు కంటిపై కునుకు లేకుండా సహాయక చర్యల్లో ముమ్మరంగా నిమగ్నమవడం కనిపించింది. బంధువుల ఇళ్లకు వెళ్లిన వారికీ సాయం ♦వేలేరుపాడు మండలంలో 44 గ్రామాలు(ఏడు రెవెన్యూ పంచాయతీలు), కుకునూరు మండలంలో 72 గ్రామాలు(15 రెవెన్యూ పంచాయతీలు) వరద తాకిడికి గురయ్యాయి. ఈ గ్రామాల్లోని వారు చాలా మంది శిబిరాలు, ఎత్తు ప్రాంతంలో ఉండే అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్రార్థనా మందిరాల్లో తలదాచుకున్నారు. వరద తాకిడికి సెల్‌ఫోన్ నెట్‌వర్క్‌లన్నీ మూగబోయాయి. ♦వేలేరుపాడు మండలంలో ఏర్పాటు చేసిన శివకాశిపురం, కస్తూరిబా బాలికల హైస్కూల్ పునరావాస శిబిరాల్లో 1050 మందికి, కుకునూరు మండలంలో 13 శిబిరాల్లో 2199 కుటుంబాలకు వసతి సౌకర్యం కల్పించారు. శిబిరాల్లో ఉన్న వారికి ఉదయం గుడ్డుతో పాటు టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి.. కూర, సాంబారు, పప్పుతో భోజనం అక్కడే వండి వడ్డిస్తున్నారు. చిన్న పిల్లలకు పాలు సరఫరా చేస్తున్నారు. ♦బంధువుల ఇళ్లకు వెళ్లిన వారికీ ప్రభుత్వం సహాయం అందిస్తోందని జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఎం.ఝాన్సీరాణి, జెడ్పీ సీఈవో కేవీఎస్ రవికుమార్ తెలిపారు. బాధితులకు తక్షణావసరాలకు బియ్యం, నూనె, కందిపప్పు, 8 రకాల కాయగూరలు శుక్రవారం అందించారు. కొయిదా, కట్కూరు గ్రామాలకు హెలికాప్టర్ ద్వారా నిత్యావసరాలు, టార్పాలిన్లు అందించారు. ♦పారిశుధ్యంపై అధికారులు దృష్టి సారించారు. పాము కాటు, గుండెపోటు.. తదితర అత్యవసర మందులు అందుబాటులో ఉంచారు. గర్భిణులు, వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ప్రభుత్వమే కడుపు నింపుతోంది మా కుటుంబం కట్టుబట్టలతో మిగిలింది. నేను పనిపై జంగారెడ్డి గూడెం వెళ్లి వచ్చేలోగా మా ఊరిలోకి నీళ్లు వచ్చేశాయి. ఇంటిలో ఆడవాళ్లు మాత్రమే ఉన్నారు. వాళ్లు ఏం చేయగలరు.. అన్నీ వదిలేసుకుని అధికారులు పెట్టిన ట్రాక్టర్లలో వచ్చి శివకాశీపురంలో తల దాచుకుంటున్నాం. మా ఊరిలో మొత్తం పశువులు అన్నీ పోయాయి. ప్రభుత్వం ఇస్తున్న నిత్యావసరాలతోనే కడుపునింపుకుంటున్నాం. – మడకం బుచ్చయ్య, రేపాకగొమ్ము -
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి
-
ప్రతి కుటుంబానికి రూ. 5 వేలు ఇవ్వాలి: వైఎస్ జగన్
విజయనగరం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం హుదూద్ తుపాన్ బాధితులను పరామర్శిస్తున్నారు. విజయనగరం జిల్లా కోరుకోండలో దెబ్బతిన్ని మామాడి, టేకు, చెరుకు పంటలను పరిశీలించి రైతులను పరామర్శించారు. ఇంత పెద్ద ఎత్తున విపత్తు జరిగినా ప్రభుత్వం ప్రజలను పట్టించుకున్న పాపానపోలేదని వైఎస్ జగన్ విమర్శించారు. ఈ నెల పేదలకు ఉచితంగా ఇస్తామన్న బియ్యాన్ని ఇంతవరకు ఇవ్వలేదని అన్నారు. శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి వరకు ప్రతి కుటుంబానికి తక్షణం 5 వేల రూపాయల ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పబ్లిసిటీ కోసం తప్ప ప్రజలను పట్టించుకోవడం లేదని జగన్ విమర్శించారు. ఇళ్లు దెబ్బతిన్నవారికి 50 వేల రూపాయల ఆర్థిక సాయం, పూర్తిగా ధ్వంసమైన వారికి కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. రుణమాఫీ చేస్తామన్న చంద్రబాబు రీ షెడ్యూల్ కూడా చేయలేదని, దీంతో పంటలు కోల్పోయిన రైతులకు బీమా వచ్చే అవకాశం లేదని జగన్ ఆరోపించారు. -
నింగినంటిన నిత్యవసర ధరలు
-
విశాఖకు 30000ఆహార పొట్లాల పంపిణి
-
కోడిగుడ్డు రూ.15, పాలు లీటర్ రూ.80
-
పంటలను పరిశీలించిన వైఎస్ జగన్
-
అన్నదాతలకు జగన్ భరోసా