ఆదివాసీ మహిళపై లైంగిక దాడి | sexual assault on aadivasi woman | Sakshi
Sakshi News home page

ఆదివాసీ మహిళపై లైంగిక దాడి

Published Thu, Dec 28 2017 9:30 AM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM

sexual assault on aadivasi woman

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం కృష్ణసాగర్‌ సమీపంలోని దేవగుంపునకు చెందిన ఆదివాసీ వివాహితపై లైంగికదాడి జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. దేవగుంపునకు చెందిన ఓ వివాహిత అడవిలో కట్టెలు తెచ్చుకునేందుకు బుధవారం మధ్యాహ్నం ఒంటరిగా వెళ్లింది.  ఆమెను కృష్ణసాగర్‌కు చెందిన ఓ వ్యక్తి వెంబడించాడు. జనసంచారం లేని ప్రాంతంలో ఆమె కాళ్లు, చేతులు కట్టేసి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ప్రతిఘటించిన మహిళను తీవ్రంగా కొట్టాడు. ఈ విషయం ఎవరికైనా చెపితే చంపుతానని బెదిరించాడు. నిస్సహాయురాలైన ఆమె రెండు గంటలపాటు అడవిలోనే రోదించింది. సాయంత్రం ఏడుస్తూ ఇంటికి చేరింది. విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది. లైంగికదాడికి పాల్పడిన వ్యక్తి చెప్పులు అక్కడ వదిలేసి పారిపోవటంతో ఆమె వాటిని  ఇంటికి తీసుకొచ్చింది. కుటుంబసభ్యులు, గ్రామస్తులతో కలసి కృష్ణసాగర్‌ గ్రామానికి వచ్చి స్థానిక పెద్దల దృష్టికి తీసుకెళ్లింది. స్థానికులు అంబులెన్స్‌ సహాయంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. సుమారు ఇరవై ఐదేళ్ల వయసున్న బాధితురాలికి ఇద్దరు చిన్నపిల్లలు, భర్త ఉన్నారు. కాగా, దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement