
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఇల్లందు కాకతీయనగర్‌కు చెందిన విజయ్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2018లో విజయ్ అలియాస్ శివపై మిస్సింగ్ కేసు నమోదైంది. శివను హత్య చేసి దుండగులు స్మశానంలో పూడ్చి పెట్టారు. ఏఎస్పీ శబరీష్ సమక్షంలో పోలీసలు పంచనామా నిర్వహించారు. ఈ ఘటనపై ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment