సాక్షి, పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో మనిషి అవశేషాలున్న డబ్బా సోమవారం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ వివరణ ఇచ్చారు. ఆరు నెలల క్రితం పాల్వంచ మండలం బండ్రుగొండలో గుర్తుతెలియని మృతదేహానిదని తెలిపారు. క్షుద్రపూజల కోసం ఆస్పత్రి అధికారులే తరలిస్తున్నారనేది అవాస్తవమన్నారు. (చదవండి: ముక్కలైన ట్రాక్టర్.. ఒళ్లు గగుర్పుడిచే ప్రమాదం)
ఆస్పత్రిలో మానవ అవశేషాలు అమ్ముతున్నట్లు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. మార్చురి గదిలో స్థలం లేకపోవడం వల్లే సిబ్బంది.. పవర్‌కు సంబంధించిన గదిలో అవశేషాలున్న బాక్స్ పెట్టారని వివరించారు. పుర్రెకు సంబంధించి పీఎస్‌లో ఫిర్యాదు చేయని మాట వాస్తవమే.. అందుకే తప్పుడు ప్రచారం జరిగిందని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. (చదవండి: 'స్నేహం చేయకపోతే అశ్లీల ఫోటోలను షేర్ చేస్తా')
Comments
Please login to add a commentAdd a comment