Human Remains
-
నిరూపిస్తే.. ఎలాంటి శిక్షకైనా సిద్ధం
సాక్షి, పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో మనిషి అవశేషాలున్న డబ్బా సోమవారం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ వివరణ ఇచ్చారు. ఆరు నెలల క్రితం పాల్వంచ మండలం బండ్రుగొండలో గుర్తుతెలియని మృతదేహానిదని తెలిపారు. క్షుద్రపూజల కోసం ఆస్పత్రి అధికారులే తరలిస్తున్నారనేది అవాస్తవమన్నారు. (చదవండి: ముక్కలైన ట్రాక్టర్.. ఒళ్లు గగుర్పుడిచే ప్రమాదం) ఆస్పత్రిలో మానవ అవశేషాలు అమ్ముతున్నట్లు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. మార్చురి గదిలో స్థలం లేకపోవడం వల్లే సిబ్బంది.. పవర్కు సంబంధించిన గదిలో అవశేషాలున్న బాక్స్ పెట్టారని వివరించారు. పుర్రెకు సంబంధించి పీఎస్లో ఫిర్యాదు చేయని మాట వాస్తవమే.. అందుకే తప్పుడు ప్రచారం జరిగిందని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. (చదవండి: 'స్నేహం చేయకపోతే అశ్లీల ఫోటోలను షేర్ చేస్తా') -
9000 ఏళ్ల కిందటి మానవ అవశేషాలు..
మెక్సికో : అత్యంత పురాతన గుహలో లభించిన 9000 ఏళ్ల నాటి మానవ అవశేషాలు, మంచుయుగంలో సంచరించిన జంతువుల ఎముకలను ఆర్కియాలజిస్టులు పరిశీలిస్తున్నారు. తూర్పు మెక్సికోలో ఇటీవల కొందరు డైవర్స్ నీట మునిగిన ఓ భారీ గుహను గుర్తించడంతో పురాతన మాయా నాగరికత గురించి ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తాయని భావిస్తున్నారు. మానవ అవశేషాలతో పాటు పురాతన ఏనుగులు, ఎలుగుబంట్ల ఎముకలు బయటపడ్డాయని మెక్సికో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ గుహల వెలికితీత అక్కడి పురావస్తు శాఖలో సంచలనం సృష్టించింది. ‘ఇది నిజంగా అద్భుతం..ప్రపంచంలోనే ఇది అత్యంత కీలకమైన నీటిలోపలి పురావస్తు ప్రదేశ’మని మెక్సికో నేషనల్ ఆంథ్రోపాలజీ అండ్ హిస్టరీ ఇనిస్టిట్యూట్ (ఐఎన్ఏహెచ్) రీసెర్చర్ గిల్రెమో డి అండా అన్నారు. ఐఎన్ఏహెచ్ విశ్లేషణల ప్రకారం మంచుయుగం చివరినాళ్లలో నీటి ప్రవాహం 100 మీటర్ల మేర ఎగసి గుహను ముంచెత్తిందని దీంతో అక్కడి జీవావరణం నాటి అవశేషాలు కొంతమేర పదిలపరచబడ్డాయని వెల్లడైంది. చివరి మంచుయుగం 26 లక్షల సంవత్సరాల కిందట ఆరంభమై 11,700 ఏళ్ల కిందట ముగిసిందని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
రెండేళ్ల తర్వాత పాదం బయటకు
డెహ్రాడూన్: జల ప్రళయం సంభవించి దాదాపు రెండేళ్ల తర్వాత కేదార్నాథ్ ఆలయం వద్ద మరోసారి చనిపోయినవారి అవశేషాలు బయటపడ్డాయి. ఓ వ్యక్తి కాలిబాగం ఆలయ ప్రాంగణంలో బయటపడింది. ప్రధాన ఆలయానికి 50 మీటర్ల దూరంలో కొందరు స్థానికులు శిథిలాలను తొలగిస్తుండగా ఇది కనిపించింది. 2013 జూన్ నెలలో హిమాలయ పర్వత పాద ప్రాంతాలను గంగా ప్రళయం ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో వేల మంది చనిపోగా వారిలో చాలామంది మృతదేహాలు కూడా ఆచూకీ లేకుండా పోయాయి. దాదాపు యాబై నుంచి అరవై అడుగుల మేర రాళ్లురప్పలు బురద మట్టి పేరుకు పోయింది. దీన్నంతటిని ప్రస్తుతం తొలగిస్తున్నారు. శనివారం దాదాపు 50 అడుగుల లోతు మేర తవ్వకాలు జరుపుతుండగా కాలిభాగం బయటపడింది. దానికి డీఎన్ఏ పరీక్ష చేసి అనంతరం దహనం చేశారు.