షాకింగ్‌: పెళ్లిలో సరదా కాల్పులతో విషాదం! | Celebratory firing injures groom during a wedding ceremony | Sakshi
Sakshi News home page

షాకింగ్‌: పెళ్లిలో సరదా కాల్పులతో విషాదం!

Published Sat, Apr 30 2016 4:33 PM | Last Updated on Sun, Sep 3 2017 11:07 PM

షాకింగ్‌: పెళ్లిలో సరదా కాల్పులతో విషాదం!

షాకింగ్‌: పెళ్లిలో సరదా కాల్పులతో విషాదం!

ఆనందోత్సాహల మధ్య సాగుతున్న పెళ్లికొడుకు ఊరేగింపు ఘటనలో ఊహించని విషాద ఘటన చోటుచేసుకుంది. వివాహ వేడుకలో భాగంగా వరుడిని తీసుకొస్తుండగా.. అతని బంధువులు తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి వరుడికి సమీపంలోనే తుపాకీ పేల్చడంతో ఈ తూటా వరుడికి తగిలింది. సంఘటన స్థలంలోనే అతడు కుప్పకూలాడు. వెంటనే వరుడిని ఆస్పత్రికి తరలించారు. హర్యానాలోని హిసార్‌లో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఓ న్యూస్‌ ఏజెన్సీ పోస్టు చేసింది.

పెళ్లికొడుకుకు అత్యంత సమీపంలో ఉన్న ఓ వ్యక్తి నల్లరంగు పిస్తోల్‌తో గాలిలోకి కాల్పులు జరుపబోయాడు. ఆ కాల్పులు గురితప్పి వరుడికి తగిలాయి. దీంతో అక్కడే వరుడు కుప్పకూలడం వీడియోలో చూడవచ్చు. ఈ ఘటనలో వరుడికి గాయాలైనట్టు తెలుస్తోంది. వరుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేశామని హిసార్ పోలీసు అధికారి మన్‌దీప్ సింగ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement