Celebratory Firing
-
తాలిబన్ల సంబరాలు.. 17 మంది పౌరులు మృతి!
కాబుల్: అఫ్గనిస్తాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లకు పంజ్‌షీర్ ప్రాంతం సవాలుగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. తాజాగా శుక్రవారం తాలిబన్లు తాము పంజ్‌షీర్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సంచలన ప్రకటన చేశారు. అంతేకాక తాలిబన్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి గాల్లోకి కాల్పులు జరిపి సంబరాలు జరుపుకున్నారు. అయితే తాలిబన్ల అత్యుత్సాహం సామాన్యుల పాలిట శాపంగా మారింది. తాలిబన్లు జరిపిన కాల్పుల్లో 17 మంది అఫ్గన్ పౌరులు మరణించినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. (చదవండి: కొరకరాని కొయ్యగా పంజ్‌షీర్.. కొత్త ప్రభుత్వం ఎప్పుడు?) రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ అఫ్గానిస్తాన్ (ఎన్ఆర్ఎఫ్ఏ) ఓడించి, పంజ్‌షీర్‌ను అధీనం చేసుకున్నట్టు తాలిబన్లు శుక్రవారం ప్రకటించారు. అనంతరం గాల్లో కాల్పులు జరిపి సంబరాలు చేసుకున్నారు. ఈ ఘటనలో సుమారుగా 17 మంది మృతి చెందగా, 41 మంది గాయపడ్డారు. ఇలాంటి పనులతో పౌరులకు హాని తలపెట్టవద్దని తాలిబన్ల ప్రతినిధి జబీహుల్లా ట్విట్టర్లో సైనికులకు సూచనలు చేశారు. తిరుగుబాటుదారులు శాంతియుతంగా లొంగిపోవాలని ప్రకటించారు. అయితే పంజ్‌షీర్ తిరుగుబాటుదారుల నాయకుడు అహ్మద్ మసూద్ మాత్రం దీన్ని కొట్టిపారేశాడు. ఈ విషయంపై పాకిస్తాన్ మీడియాల్లో ప్రసారమవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, ప్రతిఘటన దాడులు కొనసాగుతునే ఉన్నాయని అహ్మద్ మసూద్ స్థానిక మీడియాకు వెల్లడించారు. کابل ښار او ټول هیواد کې د مجاهدینو د پام وړ: له هوایي ډزو څخه جدا ډډه وکړئ او پر ځای یې د الله تعالی شکر اداء کړئ. ستاسي په لاس کې وسله او مرمۍ بیت المال دي، هیڅوک یې د ضائع کیدو حق نلري. سړې مرمۍ عامو خلکو ته د زیان اړولولو قوي احتمال لري؛ نو بناء بې ځایه ډزې مه کوئ. — Zabihullah (..ذبـــــیح الله م ) (@Zabehulah_M33) September 3, 2021 Afghanistan: తాలిబన్లకు కీలక సమాచారం చిక్కకూడదనే.. -
పెళ్లిలో కాల్పులతో మాతాజీ హల్చల్
-
పెళ్లిలో కాల్పులతో మాతాజీ హల్చల్
ఉత్తరాదిలో ఎక్కడైనా పెళ్లిళ్లు జరిగాయంటే అక్కడ సరదాగా తుపాకులు పట్టుకుని గాల్లోకి కాల్పులు జరపడం సర్వసాధారణం. హర్యానాలోని కర్నల్ జిల్లాలో ఇలాగే ఓ పెళ్లి జరుగుతుంటే అక్కడకు హాజరైన సాధ్వి, ఆమె అనుచరులు కాల్పులు జరపడంతో ఒక మహిళ మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సాధ్వి దేవా ఠాకూర్‌తో పాటు ఆమె భద్రతా సిబ్బంది కూడా తుపాకులతో కాల్చడంతో పెళ్లికొడుకు మేనత్త మరణించింది. దాంతో ఆమెపైన, భద్రతా సిబ్బందిపైన పోలీసులు ఆయుధాల చట్టం కింద పలు సెక్షన్లతో పాటు హత్య కేసు కూడా నమోదు చేశారు. వాళ్లంతా ముందుగా డాన్స్ ఫ్లోర్ వైపు గురిచూసి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఆ సమయానికి అక్కడున్న వరుడి మేనత్త అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దాంతో సాధ్వి, ఆమె శిష్యగణం అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. కర్నల్ రైల్వేస్టేషన్ సమీపంలోని సావిత్రి లాన్స్ అనే కళ్యాణమండపంలో ఈ ఘటన జరిగింది. నిందితులను అరెస్టుచేసేందుకు పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. -
షాకింగ్: పెళ్లిలో సరదా కాల్పులతో విషాదం!
ఆనందోత్సాహల మధ్య సాగుతున్న పెళ్లికొడుకు ఊరేగింపు ఘటనలో ఊహించని విషాద ఘటన చోటుచేసుకుంది. వివాహ వేడుకలో భాగంగా వరుడిని తీసుకొస్తుండగా.. అతని బంధువులు తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి వరుడికి సమీపంలోనే తుపాకీ పేల్చడంతో ఈ తూటా వరుడికి తగిలింది. సంఘటన స్థలంలోనే అతడు కుప్పకూలాడు. వెంటనే వరుడిని ఆస్పత్రికి తరలించారు. హర్యానాలోని హిసార్‌లో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఓ న్యూస్ ఏజెన్సీ పోస్టు చేసింది. పెళ్లికొడుకుకు అత్యంత సమీపంలో ఉన్న ఓ వ్యక్తి నల్లరంగు పిస్తోల్‌తో గాలిలోకి కాల్పులు జరుపబోయాడు. ఆ కాల్పులు గురితప్పి వరుడికి తగిలాయి. దీంతో అక్కడే వరుడు కుప్పకూలడం వీడియోలో చూడవచ్చు. ఈ ఘటనలో వరుడికి గాయాలైనట్టు తెలుస్తోంది. వరుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేశామని హిసార్ పోలీసు అధికారి మన్దీప్ సింగ్ తెలిపారు. -
పెళ్లి కాల్పులలో యువకుడి మృతి
యూపీ, బిహార్ రాష్ట్రాలలో పెళ్లిళ్లంటే.. తప్పనిసరిగా తుపాకుల మోతలు వినిపించాల్సిందే. తాజాగా బిహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో ఇలాగే పెళ్లి సందర్భంగా జరిపిన కాల్పులలో 18 ఏళ్ల యువకుడు మరణించగా, మరో ఇద్దరికి బుల్లెట్ గాయాలయ్యాయి. చౌవా గ్రామంలో జంయ్ రామ్ అనే వ్యక్తి తన సోదరుడి పెళ్లి పార్టీ సందర్భంగా తన లైసెన్సుడు తుపాకితో కాల్పులు జరిపాడు. దీంతో ఆ బుల్లెట్లు ముగ్గురికి తగిలాయని, వారందరినీ వెంటనే సదర్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఒక యువకుడు మరణించాడని జిల్లా కలెక్టర్ వీరేంద్ర ప్రసాద్ యాదవ్ చెప్పారు. మిగిలిన ఇద్దరినీ అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం పట్నా మెడికల్ కాలేజి ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది. పెళ్లికొడుకు సోదరుడు తన లైసెన్సుడు తుపాకితో సహా అక్కడి నుంచి పారిపోయాడని కలెక్టర్ చెప్పారు. -
పెళ్లింట విషాదం, చిన్నారి మృతి
పట్నా: బిహార్ లో పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. అర్రా గ్రామంలోని పెళ్లి వేడుకల్లో జరిగిన ప్రమాదం ఓ చిన్నారిని పొట్టన పెట్టుకుంది. వివాహ ఊరేగింపులో ఉపయోగించిన బాణా సంచా పేలుడులో ఒక్కసారిగా మంటలు అలుముకున్నాయి. ఈ ఘటనలో ఒక చిన్నారి చనిపోగా, మరికొంతమంది తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిలోఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. దీంతో స్థానికంగా ఆందోళన చెలరేగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. -
అత్యుత్సాహంతో కాల్చేశాడు..
మీరట్: ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల విజయమైనా ఇంట్లో శుభకార్యమైనా అత్యుత్సాహంతో చేసుకునే సంబరాలు ఒక్కోసారి విషాదంగా మారుతుంటాయి. మీరట్ జిల్లాలో బీఎస్పీ నాయకుడు భరత్ వీర్ కొడుకు నిశ్చితార్థం వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. వీర్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు సంబరాలు చేసుకుంటుండగా, అరుణ్ అనే వ్యక్తి గాల్లోకి కాల్పులు జరిపాడు. మిస్ ఫైర్ కావడంతో ఓ వ్యక్తి మరణించాడు. మృతుడ్ని జోగిందర్ (36)గా గుర్తించారు. జోగిందర్ సంఘటనా స్థలంలోనే చనిపోయినట్టు ఫలవ్డా పోలీస్ స్టేషన్ అధికారి రామ్ రతన్ యాదవ్ చెప్పారు. నిందితుడు పరారయ్యాడని, కేసు నమోదు చేసుకుని అతడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. యూపీలోనే ఇటీవల ఎన్నికల విజయోత్సవాల్లో ఇలాగే గాల్లోకి కాల్పులు జరపగా, రిక్షాలో వెళ్తున్న బాలుడికి బుల్లెట్ తగలడంతో మరణించాడు. -
పెళ్లి వేడుకలో కాల్పుల కలకలం
మెయిన్ పురి: కూతురి పెళ్లి వేడుక ఆ తండ్రి పాలిట మృత్యుపాశంగా మారింది. కుమార్తె వివాహ వేడుకలో అంతవరకు ఉత్సాహంగా పాల్గొన్న కన్నతండ్రిని మృతువు బుల్లెట్ రూపంలో కబళించింది. ఈ విదారక ఘటన ఉత్తరప్రదేశ్ లోని భొగావ్ ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకుంది. కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రాజేంద్ర సింగ్(45) తన కుమార్తె పెళ్లి వేడుకలో బుల్లెట్ గాయంతో ప్రాణాలు కోల్పోయాడు. వేడుకల్లో భాగంగా తుపాకీతో కాల్పులు జరపడంతో అతడికి బుల్లెట్ గాయమైంది. వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. బదౌన్ జిల్లాలో పనిచేస్తున్న రాజేంద్ర సింగ్ తన కుమార్తె పెళ్లి కోసం భొగావ్ కు వచ్చాడని ఎస్పీ హనుమన్షు కుమార్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరినీ అరెస్ట్ చేయలేదని, దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. -
'అలాంటివి కుదరవు.. కాదంటే జైలుకే'
ముజఫర్ నగర్: ఇకపై ఎలాంటి వేడుకల్లోనైనా గాల్లోకి కాల్పులు జరపడం ఆపేయాలని లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఉత్తరప్రదేశ్ లోని షామ్లీ జిల్లా పోలీసులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి కాల్పుల కారణంగా గత నెలలో ఓ ఎనిమిదేళ్ల బాలుడు ప్రాణాలుకోల్పోయిన నేపథ్యంలో మున్ముందు అలాంటివాటికి తావు లేకుండా చేసేందుకు ఈ ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఎలాంటి వేడుక జరిగిన సామూహికంగా సంబరాలు చేసుకుంటూ గాల్లోకి కాల్పులు జరపడం అక్కడి వారు చేసే సర్వసాధరణమైన పని. అయితే, ఇప్పటి వరకు పోలీసులు పెద్దగా పట్టించుకోకుండా ఉన్నప్పటికీ మొన్న బాలుడు చనిపోవడంతో ఆ విషయం కాస్త దేశ వ్యాప్తంగా ప్రచారమై శాంతిభద్రతలను పలువురు ప్రశ్నించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కూడా సీరియస్ గా స్పందించారు. దీంతో ఛీవాట్లు తిన్న పోలీసు ఉన్నతాధికారులు ఘటన చోటుచేసుకున్న షామ్లీ జిల్లాలో తుపాకులను ఎలా పడితే అలా ముఖ్యంగా గాల్లోకి కాల్పులు జరపడాన్ని రద్దు చేస్తూ నిషేధాజ్ఞలు జారీ చేశారు. -
విజయోత్సవాలతో కాల్పులు.. బాలుడి మృతి
ఉత్తరప్రదేశ్, బిహార్ లాంటి రాష్ట్రాల్లో పెళ్లిళ్లు, ఏవైనా సంబరాలు జరుగుతుంటే గాల్లోకి తుపాకులతో కాల్చడం సర్వసాధారణం. కానీ, యూపీలోని షామ్లి జిల్లాలో స్థానిక ఎన్నికల ఫలితాలు వచ్చిన సందర్భంగా జరిగిన కాల్పుల్లో హర్ష్ అనే తొమ్మిదేళ్ల బాలుడు మరణించాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని నఫీసా విజయం సాధించడంతో సమాజ్‌వాదీ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకొంటూ గాల్లోకి కాల్చడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు అరగంట పాటు వాళ్లు తుపాకులు కాలుస్తూనే ఉన్నారు. అదే సమయానికి రిక్షాలో అటువైపుగా వెళ్తున్న హర్ష్‌కు బుల్లెట్ తగిలింది. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరనించాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బాలుడి బంధువులు పానిపట్ - ఖాతిమ్ జాతీయ రహదారిని దిగ్బంధించారు.