అత్యుత్సాహంతో కాల్చేశాడు.. | Man killed in celebratory firing | Sakshi
Sakshi News home page

అత్యుత్సాహంతో కాల్చేశాడు..

Published Thu, Mar 10 2016 11:38 AM | Last Updated on Wed, Aug 29 2018 8:36 PM

అత్యుత్సాహంతో కాల్చేశాడు.. - Sakshi

అత్యుత్సాహంతో కాల్చేశాడు..

మీరట్: ఉత్తరప్రదేశ్లో ఎన్నికల విజయమైనా ఇంట్లో శుభకార్యమైనా అత్యుత్సాహంతో చేసుకునే సంబరాలు ఒక్కోసారి విషాదంగా మారుతుంటాయి. మీరట్ జిల్లాలో బీఎస్పీ నాయకుడు భరత్ వీర్ కొడుకు నిశ్చితార్థం వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది.

వీర్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు సంబరాలు చేసుకుంటుండగా, అరుణ్‌ అనే వ్యక్తి గాల్లోకి కాల్పులు జరిపాడు. మిస్ ఫైర్ కావడంతో ఓ వ్యక్తి మరణించాడు. మృతుడ్ని జోగిందర్ (36)గా గుర్తించారు. జోగిందర్ సంఘటనా స్థలంలోనే చనిపోయినట్టు ఫలవ్డా పోలీస్ స్టేషన్ అధికారి రామ్ రతన్ యాదవ్ చెప్పారు. నిందితుడు పరారయ్యాడని, కేసు నమోదు చేసుకుని అతడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. యూపీలోనే ఇటీవల ఎన్నికల విజయోత్సవాల్లో ఇలాగే గాల్లోకి కాల్పులు జరపగా, రిక్షాలో వెళ్తున్న బాలుడికి బుల్లెట్ తగలడంతో మరణించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement