ఆ ఇంట పాములు బాబోయ్‌ పాములు.. చూస్తే చెమటలు పట్టాల్సిందే! | Shocking: 92 Rattlesnakes Found Under California Home | Sakshi
Sakshi News home page

Snakes Found Home: ఆ ఇంట పాములు బాబోయ్‌ పాములు.. చూస్తే చెమటలు పట్టాల్సిందే!

Published Sat, Oct 16 2021 8:53 PM | Last Updated on Sun, Oct 17 2021 12:32 PM

Shocking: 92 Rattlesnakes Found Under California Home - Sakshi

సాధారణంగా ఒకటి రెండు పాములను చూస్తేనే రన్నింగ్‌ రేసులో రన్నర్‌లా మారుతాం. అలాంటిది ఓ వ్యక్తి తన ఇంటి కింద సుమారు 100 ర్యాటిల్‌ స్నేక్స్‌ తిష్ట వేయడం చూసి ఖంగుతిన్నాడు. ఈ ఘటన యూఎస్ లోని కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి ఇంటో కొన్ని పాములు ఎప్పుడు వచ్చాయో తెలీదు గానీ చక్కగా అక్కడే పిల్లలను కూడా పెట్టాయి. అలా వాటి సంఖ్య సెంచరీకి చేరువైంది.

కొన్ని రోజుల తర్వాత ఆ బాహుబలి సైన్యాన్ని చూసిన ఇంటి యజమాని ఆశ్చర్యపోయాడు. కాస్త భయపడ్డాడు కూడా. వెంటనే లేట్‌ చేయకుండా రెస్క్యూ టీంకు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న సిబ్బంది.. దాదాపు 4 గంటలు కష్టపడి ఇంట్లో నుంచి సుమారు 92 ర్యాటిల్ స్నేక్స్ ను బయటికి తీశారు. అందులో కొన్ని పాము పిల్లలు కూడా ఉన్నాయి. కరువు కారణంగా బయట పాములకు తిండి దొరకక అవి ఇంట్లోకి వచ్చి ఉండే అవకాశం రెస్క్యూ టీంలో ఒకరు తెలిపారు.

అదృష్టం ఏంటంటే ఆ ఇంటి యజమాని ఇంకాస్త ఆలస్యంగా చూసుంటే అవి డబుల్‌ ,ట్రిపుల్‌ సెంచరీ చేసుండేవి. పాములను వెలికి తీశాక.. వాటి ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటోను చూసిన నెటిజన్లు వామ్మో.. ఇన్ని పాములా? దేవుడా.. అని కామెంట్‌ చేయగా, మరొకందరు.. మ్యాగీ న్యూడిల్స్‌లా స్నేక్‌ న్యూడిల్స్‌ లా ఉన్నాయంటూ కామెంట్లు పెడుతున్నారు.

చదవండి: Bride Video: వరుడిని అక్కడ కొట్టేసి.. చుట్టూ పరిగెత్తి.. చివర్లో ‘ఆర్‌ యూ ఓకే బేబీ’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement