
దక్షిణాదిన స్టార్ హీరోయిన్‌ల జాబితాలో కీర్తిసురేష్ ఉన్నారు. ఆమె ఒక పక్క గ్లామర్ పాత్రలు చేస్తూనే... మరోపక్క కథానాయిక ప్రాధాన్యమున్న కథలతోనూ మెరుస్తున్నారు. ఆమె గత సినిమాలు కాస్త నిరాశపర్చినా.. ప్రస్తుతం ఆమె చేతుల్లో చాలా వరకు తమిళ ప్రాజెక్టులే ఎక్కువున్నాయి. దీంతో అవకాశాలు వచ్చిన చోటుకే వెళ్లే ఆలోచనలో కీర్తి ఉందట. టాలీవుడ్‌లో స్కీన్ షో చేసినా అంతగా అవకాశాలు రాకపోవడంతో మద్రాస్ ఫ్లైట్ ఎక్కడమే బెటర్ అనుకుంటుందట. తమిళంలో ఆమె చేతిలో సుమారు నాలుగుకు పైగా చిత్రాలున్నాయి.
(ఇదీ చదవండి: Devara: ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇవ్వనున్నారా?)
తెలుగులో మాత్రం చిరంజీవి భోళా శంకర్ చిత్రంలో మాత్రమే కనిపించనుంది. అది కూడా చెల్లెలు పాత్రలో.. కానీ నాగచైతన్య, చందు మొండేటి కాంబోలో రాబోతున్న సినిమాకు కోసం కీర్తి సురేష్‌ను తీసుకోవాలని ఆలోచనలో ఉన్నారట. ఏదేమైనా ఎక్కడ అవకాశాలు పిలిస్తే అక్కడికి వెళ్లడంలో తప్పులేదని నెటిజన్స్ అంటున్నారు.
మరోవైపు 'ఉప్పెన'తో నటిగా ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే భారీ క్రేజ్ సంపాదించుకున్న నటి కృతీశెట్టి పరిస్థితి కూడా దాదాపు కీర్తి మాదిరే ఉంది. ఈమెకు చాలానే ఛాన్స్‌లు అయితే వచ్చాయి కానీ హిట్లు మాత్రం రాలేదు. వారియర్, మాచర్ల నియోజకవర్గం, కస్టడీ వంటి చిత్రాలు వరుస డిజాస్టర్లు వచ్చాయి. దీంతో ఆమెకు టాలీవుడ్‌లో కొంత మేరకు అవకాశాలు తగ్గాయి. కానీ తమిళ, మలయాళంలో మాత్రం భారీగానే ఈ బ్యూటీకి ఆఫర్లు వస్తున్నాయి.
మలయాళంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పీరియాడికల్ డ్రామా 'అజయంతే రాండమ్ మోషణం'లో కృతిశెట్టికి ఛాన్స్ దక్కింది. ఇందులో '2018' సినిమాతో సంచలనం రేపిన టోవినో థామస్ హీరో. తమిళ్ నుంచి రెండు సినిమాలు ఈ అమ్మడు చేతిలో ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే ఈ ఇద్దరు భామలు టాలీవుడ్‌కు గుడ్ బై చెప్పనున్నారా అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: వాళ్లు నన్ను అడ్వాంటేజ్‌గా తీసుకున్నారు.. పాయల్ సంచలన కామెంట్స్)
Comments
Please login to add a commentAdd a comment