సెక్యూరిటీ గార్డును కొరికిన ఆప్ కార్పోరేటర్.. వీడియో వైరల్‌ | Aap Corporator Bites Female Security Guard Gujarat Surat | Sakshi
Sakshi News home page

సెక్యూరిటీ గార్డును కొరికిన ఆప్ కార్పోరేటర్.. వీడియో వైరల్‌

Published Sat, Oct 22 2022 7:12 PM | Last Updated on Sat, Oct 22 2022 7:12 PM

AAP corporator Bites female security guard Gujarat Surat - Sakshi

సూరత్‌: ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన కార్పోరేటర్ సెజల్ మాలవీయ సెక్యూరిటీ గార్డును కొరికిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గుజరాత్‌లోని సూరత్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ జనరల్ బోర్డు సమావేశంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.

ఈ సమావేశంలో బీజేపీ నాయకుడు అమిత్ రాజ్‌పుత్‌ ఓ విషయంపై మాట్లాడుతుండగా.. ఆప్‌ కౌన్సిలర్లు తీవ్రంగా ‍‍‍వ్యతిరేకించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఫలితంగా సమావేశం కాస్తా రసాభాసగా మారింది.

ఈ నేపథ్యంలోనే ఆప్ కార్పోరేటర్‌ మహేశ్ అంఘన్‌ను సమావేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు సూరత్ మేయర్ హేమాలి భోఘవాలా ప్రకటించారు. అనంతరం ఆప్‌  కార్పోరేటర్లందరినీ సెక్యూరిటీ గార్డులు బయటకు లాక్కెళ్లారు. ఈ క్రమంలో సెజల్‌ మాలవీయ.. తనను బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీ గార్డు చేతిని కొరికారు. సెజల్ చర్యను అమిత్ రాజ్‌పుత్ తీవ్రంగా ఖండించారు. సెక్యూరిటీ గార్డుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

చదవండి: బెంగాల్‌ను విడదీసేందుకు బీజేపీ కుట్రలు.. టీఎంసీ ఏంపీ ఫైర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement