ఆన్‌లైన్‌లో పెళ్లికి 2 వేల మంది అతిధులు | Surat Pathologist Online Wedding 2000 People Will Attend By Clicking Youtube Link | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో పెళ్లికి 2 వేల మంది అతిధులు

Published Wed, Dec 9 2020 3:10 PM | Last Updated on Wed, Dec 9 2020 5:04 PM

Surat Pathologist Online Wedding 2000 People Will Attend By Clicking Youtube Link - Sakshi

నేహా పోఖర్న, ప్రమోద్‌ గర్గ్‌

సూరత్‌ : పాథాలజిస్టు డాక్టర్‌ నేహా పోఖర్న బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన అమ్మాయి. తనకు కాబోయే డాక్టర్‌ భర్త ప్రమోద్‌ గర్గ్‌తో ఘనంగా పెళ్లి జరగాలని అనుకునేది. కానీ, కరోనా వైరస్‌ కారణంగా ఆమె కోర్కెలకు బ్రేక్‌ పడింది. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 9వ తేదీన ఘనంగా జరగాల్సిన పెళ్లిని క్యాన్సిల్‌ చేసి, అదే రోజున వర్ట్యువల్‌ పెళ్లికి ఇరు కుటుంబాలను ఒప్పించింది. పెళ్లి పత్రికను సైతం వాట్సాప్‌లో పంపారు. మంగళవారం జరిగిన మెహందీ వేడుక కూడా ఆన్‌లైన్‌లోనే జరిగింది. ఈ బుధవారం  ముంబైలోని ఓ రిసార్టులో వివాహం జరగనుంది. య్యూట్యూబ్‌ లింక్‌ నొక్కి.. బంధువులు, స్నేహితులు ఈ పెళ్లి వేడుకకు హాజరుకానున్నారు. (ట్రక్కు​ ఢీ కొట్టినట్లుంది: ఆ షార్క్‌ నాపై..)

దాదాపు 2000 మంది అతిధులు ఆన్‌లైన్‌ ద్వారా పెళ్లిని వీక్షించనున్నారు. దీనిపై వధువు నేహా పోఖర్న మాట్లాడుతూ.. ‘‘ ఓ పాథాలజిస్టుగా కరోనా పరిస్థితిని అర్థం చేసుకోగలను. ఓ ఉదాహరణగా నిలవటానికి ఘనంగా పెళ్లి చేసుకోవాలనుకున్న నా కలను మార్చుకున్నాను. వర్ట్యువల్‌ వెడ్డింగ్‌కు ఓటు వేశాను. నాకు నా కుటుంబం, స్నేహితులు, బంధువుల భద్రత, ఆరోగ్యమే ముఖ్యం’’ అని స్పష్టం చేసింది.  ( ప్రాంక్ కాదు, అక్క‌డ నిజంగానే దెయ్యం! )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement