సూరత్: గుజరాత్‌లోని సూరత్‌లోని ఒక గణేష్ మండపంపై అల్లరి మూకలు రాళ్ల దాడి చేశాయి. ఈ నేపధ్యంలో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అల్లరిమూకలు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని శాంతింపజేశారు.
మీడియాకు అందిన వివరాల ప్రకారం పోలీసులు వినాయక మండపం దగ్గర నెలకొన్న పరిస్థితిని అదుపు చేసేందుకు లాఠీచార్జీ చేయడంతో పాటు బాష్పవాయువు ప్రయోగించాల్సి వచ్చింది. గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీ స్వయంగా ఆ గణేశ్ మండపం దగ్గరకు వచ్చి, పరిస్థితులను అధికారులతో సమీక్షించారు. సూరత్ పోలీస్ కమిషనర్ అనుపమ్ సింగ్ గెహ్లాట్, సూరత్ మేయర్ దాఖేష్ మవానీ ఆయన వెంట ఉన్నారు.
సూరత్‌లోని సయ్యద్‌పురా ప్రాంతంలోని గణేష్ మండపంపై ఆరుగురు వ్యక్తులు రాళ్లు రువ్వారని మంత్రి హర్ష్ సంఘ్వీ తెలిపారు. వీరితో పాటు వీరికి సహకరించిన మరో 27 మందిని కూడా పోలీసులు అరెస్టు చేశారన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హర్ష్ సంఘ్వీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment