మోహిత్ చురివాల్
Mohit Churiwal success Journey in telugu: జీవితంలో ఎదగాలంటే కేవలం టాలెంట్ ఒక్కటే సరిపోదు ఇది చాలా మంది అనేమాట. అదినిజం కాదు. ప్రతిభ ఉంటే కోట్లకు కోట్ల డబ్బు ఎలా సంపాదించవచ్చో ఈ గుజరాతీ టీనేజ్ బాలుడు నిరూపించాడు. మోహిత్ చురివాల్ కేవలం 15 యేళ్ల వయసులోనే టిక్‌టాక్, ఏయమ్‌పీ మీ వంటి అనేక బ్రాండ్లలో పనిచేశాడు. ఇక 18 యేళ్లకి ఏకంగా కంపెనీయే ప్రారంభించాడు. అతని విజయయాత్ర ఎలా ప్రారంభమైందంటే..
అవును! ఇతని జర్నీ అంతా కూడా చాలా భిన్నంగా ఉంటుంది. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన మోహిత్ చురివాల్ స్కూల్లో చదివేటప్పటినుంచే ఇంటర్‌నెట్‌లో తన ప్రయత్నాలు ప్రారంభించాడు. 15 యేళ్ల వయసులో ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ తెరిచి, దాన్ని 7 లక్షల రూపాయలకు అమ్మేశాడు. యూ ట్యూబ్ ఛానెల్ కూడా ప్రారంభించాడు కానీ ముందుకు వెళ్లలేదు. తర్వాత ఒక సోషల్ పేజ్‌ను క్రియేట్ చేశాడు. ఐతే అది హ్యాక్ అయ్యింది. రెండు సార్లు విఫలమయ్యాక ఇంకొంచెం కష్టపడాలని నిర్ణయించుకున్నాడు. 12వ తరగతి చదివేటప్పుడు అతని మొదటి సంపాదన అక్షరాల 7 లక్షల రూపాయలు. ఆతర్వాత సొంతంగా కంపెనీ ప్రారంభించాలని అనుకున్నాడు. ఐతే అందుకు చాలా డబ్బు అవసరం అవుతుంది. డబ్బు లేదని తన ప్రయత్నాలు మానుకోలేదు. అనేక బ్రాండెడ్ కంపెనీల్లో పనిచేయడం ప్రారంభించాడు.
తర్వాత 18 యేళ్లకు తన కలను నెరవేర్చుకున్నాడు. సొంత కంపెనీ ప్రారంభించి నెలకు 3 లక్షల రూపాయలు సంపాదించడం ప్రారంభించాడు. ఆ కంపెనీ లాభాలబాట పట్టగానే మరో కంపెనీ ప్రారంభించాడు. ఐతే ఈ ప్రయాణంలో ఎవరి దగ్గరా (కుటుంబంతో సహా) డబ్బుకోసం ఎప్పుడూ చేయిచాచలేదు. స్వయం కృషితో ప్రారంభించి మునుముందుకు నడిపించాడు. అద్భుతం కదా! మోహిత్ చురివాల్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటే ఎన్నో ఉన్నత చదువులు చదివి నిరుద్యోగులుగా మిగిలిన నేటి యువత కొత్తగా కెరీర్ నిర్మించుకోవచ్చు. నిజమేకదా.. మీరేమంటారు..
చదవండి: దూసుకొస్తున్న రాయ్ తుఫాన్! 8 ప్రాంతాల్లో హై అలర్ట్..
Comments
Please login to add a commentAdd a comment