Teenage Sensation
-
Srushti Sudhir Jagtap: రికార్డు సృష్టించింది!
సాధించాలంటే కఠోర సాధన ఉండాలి. అంతకు మించిన అంకితభావం ఉండాలి. ఈ రెండూ ఉంటే రికార్డు సాధనకు వయసు అనేది ప్రధానం కాదని నిరూపించింది సృష్టి సుధీర్ జగ్తాప్. పదహారేళ్ల సృష్టి విరామం లేకుండా 127 గంటల సేపు నాట్యం చేసి లాంగెస్ట్ డాన్స్ మారథాన్ (ఇండివిడ్యుయల్ కేటగిరీ)లో గిన్నిస్ రికార్డు సాధించింది. మహారాష్ట్రలోని లాతూర్‌కి చెందిన సృష్టి... లాతూర్‌లోని పోదార్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతోంది. ఆమె అమ్మానాన్న సుధీర్, సంజీవని ఇద్దరూ టీచర్లు. వాళ్ల తాతగారు ‘బాబన్ మనే’ స్వయానా నాట్యగురువు. సృష్టికి చిన్నప్పటి నుంచి నాట్యసాధన అలవాటయింది. కానీ ఆమెకు రికార్డు కోసం నాట్యం చేయాలనే ఆకాంక్షకు కారణం బందనా నేపాల్. ఆమె 2018లో 126 గంటల సేపు నాట్యం చేసి లాంగెస్ట్ డాన్స్ మారథాన్‌లో గిన్నిస్ రికార్డు సాధించింది. అప్పుడు ‘భారతీయ నాట్యరీతులు లెక్కలేనన్ని ఉన్నాయి. మన నాట్యరీతికి ఓ రికార్డు ఉంటే బావుణ్ను. ఆ రికార్డు ద్వారా ప్రపంచదేశాలకు మన శాస్త్రీయ నాట్యం గురించి తెలుస్తుంది’... అనే ఆలోచన సృష్టిలో రేకెత్తింది. ఆమె ఆలోచనకు తల్లిదండ్రులు, తాత అండగా నిలిచారు. గిన్నిస్ రికార్డు కోసం కథక్ నాట్య సాధన చేయాలనుకుంది. తాత పర్యవేక్షణలో 15 నెలల పాటు కఠోరసాధన చేసింది. ధ్యానంలో యోగనిద్ర కూడా సాధన చేయించారు బాబన్ మనే. రోజుకు నాలుగు గంటల సేపు ధ్యానం, మూడు గంటల సేపు వ్యాయామం, ఆరు గంటల సేపు నాట్యసాధన... ఇదీ రికార్డు కోసం ఆమె చేసిన దీక్ష. గంటకు ఐదు నిమిషాల విరామం సృష్టి 127 గంటల నాట్య ప్రద్శన మే నెల 29వ తేదీన పోదార్ స్కూల్ వేదిక మీద మొదలైంది. నాట్యప్రదర్శన ఐదు రోజుల పాటు నిర్విరామంగా సాగింది. ఆహారం అందక దేహం నీరసించి, డీహైడ్రేషన్‌కు లోను కాకుండా ఉండడానికి గంటకోసారి ఐదు నిమిషాల సేపు విరామం తీసుకునేది. ఆ విరామంలో ఎనర్జీ డ్రింక్ తీసుకుంటూ తన నాట్యదీక్షను కొనసాగించింది. సృష్టి నాట్యం చేసినంత సేపూ ఆమె తల్లిదండ్రులు వేదిక పక్కనే ఉండి ఆమెకు కావలసినవి అందిస్తూ వచ్చారు. నాట్య ప్రదర్శనను వీక్షించిన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి స్వప్నిల్ దంగారికర్ సర్టిఫికేట్ ప్రదానం చేస్తూ సృష్టిని ప్రశంసల్లో ముంచెత్తారు. ‘‘రికార్డు సాధనలో నా లక్ష్యం నెరవేరింది. ఐదు రోజుల ఐదు గంటల పాటు (విరామంతో కలిపి దాదాపు ఆరు రోజులు) సాగిన నాట్య ప్రదర్శన మధ్యలో అప్పుడప్పుడూ తల, శరీరం తూలిపోతున్న భావన కలిగాయి. నా లక్ష్యం 127 గంటలను పూర్తి చేయడం. లాంగెస్ట్ డాన్స్ మారథాన్‌లో ఇండియాకు రికార్డు సాధించడం. దేహం నిస్సత్తువతో ఇకచాలనే సంకేతాలు జారీ చేసినప్పుడు నా లక్ష్యాన్ని గుర్తు చేసుకుని క్షణాల్లో నన్ను నేను సంబాళించుకున్నాను. మానసికంగా స్థిరంగా ఉంటే దేహం కూడా సహకరిస్తుంది’ అన్నది పదహారేళ్ల సృష్టి. -
18 యేళ్లకే స్వయంకృషితో సొంత కంపెనీ.. నెలకు లక్షల్లో లాభం!!
Mohit Churiwal success Journey in telugu: జీవితంలో ఎదగాలంటే కేవలం టాలెంట్ ఒక్కటే సరిపోదు ఇది చాలా మంది అనేమాట. అదినిజం కాదు. ప్రతిభ ఉంటే కోట్లకు కోట్ల డబ్బు ఎలా సంపాదించవచ్చో ఈ గుజరాతీ టీనేజ్ బాలుడు నిరూపించాడు. మోహిత్ చురివాల్ కేవలం 15 యేళ్ల వయసులోనే టిక్‌టాక్, ఏయమ్పీ మీ వంటి అనేక బ్రాండ్లలో పనిచేశాడు. ఇక 18 యేళ్లకి ఏకంగా కంపెనీయే ప్రారంభించాడు. అతని విజయయాత్ర ఎలా ప్రారంభమైందంటే.. అవును! ఇతని జర్నీ అంతా కూడా చాలా భిన్నంగా ఉంటుంది. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన మోహిత్ చురివాల్ స్కూల్లో చదివేటప్పటినుంచే ఇంటర్నెట్లో తన ప్రయత్నాలు ప్రారంభించాడు. 15 యేళ్ల వయసులో ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ తెరిచి, దాన్ని 7 లక్షల రూపాయలకు అమ్మేశాడు. యూ ట్యూబ్ ఛానెల్ కూడా ప్రారంభించాడు కానీ ముందుకు వెళ్లలేదు. తర్వాత ఒక సోషల్ పేజ్‌ను క్రియేట్ చేశాడు. ఐతే అది హ్యాక్ అయ్యింది. రెండు సార్లు విఫలమయ్యాక ఇంకొంచెం కష్టపడాలని నిర్ణయించుకున్నాడు. 12వ తరగతి చదివేటప్పుడు అతని మొదటి సంపాదన అక్షరాల 7 లక్షల రూపాయలు. ఆతర్వాత సొంతంగా కంపెనీ ప్రారంభించాలని అనుకున్నాడు. ఐతే అందుకు చాలా డబ్బు అవసరం అవుతుంది. డబ్బు లేదని తన ప్రయత్నాలు మానుకోలేదు. అనేక బ్రాండెడ్ కంపెనీల్లో పనిచేయడం ప్రారంభించాడు. తర్వాత 18 యేళ్లకు తన కలను నెరవేర్చుకున్నాడు. సొంత కంపెనీ ప్రారంభించి నెలకు 3 లక్షల రూపాయలు సంపాదించడం ప్రారంభించాడు. ఆ కంపెనీ లాభాలబాట పట్టగానే మరో కంపెనీ ప్రారంభించాడు. ఐతే ఈ ప్రయాణంలో ఎవరి దగ్గరా (కుటుంబంతో సహా) డబ్బుకోసం ఎప్పుడూ చేయిచాచలేదు. స్వయం కృషితో ప్రారంభించి మునుముందుకు నడిపించాడు. అద్భుతం కదా! మోహిత్ చురివాల్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటే ఎన్నో ఉన్నత చదువులు చదివి నిరుద్యోగులుగా మిగిలిన నేటి యువత కొత్తగా కెరీర్ నిర్మించుకోవచ్చు. నిజమేకదా.. మీరేమంటారు.. చదవండి: దూసుకొస్తున్న రాయ్ తుఫాన్! 8 ప్రాంతాల్లో హై అలర్ట్.. -
తెలివైన సింగర్...జస్టిన్ బీబర్
బేబీ, యాజ్ లాంగ్ యాజ్ యు లవ్ మీ పాటలతో హోరెత్తిస్తూ రెండు పదుల వయసు కూడా దాటకుండానే .. వందల కోట్లు కూడబెట్టేశాడు జస్టిన్ బీబర్. ఏటా సుమారు రూ. 300 కోట్ల పైచిలుకు ఆదాయం అందుకుంటున్నాడు. ఆడుతూ పాడుతూ గత రెండేళ్లలో రూ. 660 కోట్లు సంపాదించాడు. కడు పేదరికం నుంచి కరోడ్‌పతి దాకా ఎదిగిన ఈ టీనేజ్ సెన్సేషన్ పాటల్లోనే కాదు వ్యాపారంలో కూడా దిట్ట. తన పాపులారిటీని ఎలా క్యాష్ చేసుకోవాలో బాగా తెలిసినవాడు. 30 సెకన్ల యాడ్‌లో కనిపించినందుకు పది లక్షల డాలర్లు తీసుకున్నాడు బీబర్. ఒకవైపు పాటల రికార్డు అమ్మకాలు మరోవైపు కాన్సర్ట్‌లు, తన పేరుతో దుస్తులు, క్యాప్‌లు వంటి ఉత్పత్తుల అమ్మకాలు, స్పాన్సర్షిప్ డీల్స్.. వీటితో పాటు అప్పుడప్పుడు సినిమాలు మొదలైన వాటితో బ్యాంకు బ్యాలెన్సులు భారీగా పెంచుకుంటున్నాడు. వీటికి మాత్రమే పరిమితం కాలేదు బీబర్. ఇన్వెస్టరు అవతారం కూడా ఎత్తాడు. డబ్బులకు కటకటలాడే టీనేజర్లు ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువగా సోషల్ మీడియాను ఆశ్రయిస్తారు కాబట్టి.. ఈ తరహా స్టార్టప్స్ ద్వారా వారికి చేరువై రాబడి మరింత పెంచుకోవాలని ఎంచుకున్నాడు బీబర్. అందుకే, ప్రధానంగా టెక్నాలజీ సంస్థల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. టైనీచాట్ అనే మెసేజింగ్ ప్లాట్‌ఫాంలో ఇన్వెస్ట్ చేశాడు. అలాగే సోషల్ మీడియా యాప్ స్టాంప్డ్లో కూడా పెట్టుబడులు పెట్టాడు. అటు సోజో స్టూడియోస్ అనే గేమింగ్ కంపెనీలో, స్పాటిఫై అనే మరో సంస్థలో సైతం ఇన్వెస్ట్ చేశాడు. మిగతా స్టార్స్ లాగా యాడ్స్ చేసి ప్రతిఫలంగా కంపెనీలో వాటాలు తీసుకోవడం కాకుండా పక్కా క్యాష్‌తోనే పెట్టుబడులు పెట్టేందుకు ప్రాధాన్యం ఇస్తాడు బీబర్. అలాగే పనిలో పనిగా కాస్త ముందు చూపుతో రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేశాడు. 60 లక్షల డాలర్లతో కాలిఫోర్నియాలో 9,000 చ.అ. మాన్షన్‌ని, హాలీవుడ్ హిల్స్‌లో మరో 1.1 కోటి డాలర్లతో ఇంకో ప్రాపర్టీని కొని పెట్టుకున్నాడు.