Technology era
-
18 యేళ్లకే స్వయంకృషితో సొంత కంపెనీ.. నెలకు లక్షల్లో లాభం!!
Mohit Churiwal success Journey in telugu: జీవితంలో ఎదగాలంటే కేవలం టాలెంట్ ఒక్కటే సరిపోదు ఇది చాలా మంది అనేమాట. అదినిజం కాదు. ప్రతిభ ఉంటే కోట్లకు కోట్ల డబ్బు ఎలా సంపాదించవచ్చో ఈ గుజరాతీ టీనేజ్ బాలుడు నిరూపించాడు. మోహిత్ చురివాల్ కేవలం 15 యేళ్ల వయసులోనే టిక్‌టాక్, ఏయమ్పీ మీ వంటి అనేక బ్రాండ్లలో పనిచేశాడు. ఇక 18 యేళ్లకి ఏకంగా కంపెనీయే ప్రారంభించాడు. అతని విజయయాత్ర ఎలా ప్రారంభమైందంటే.. అవును! ఇతని జర్నీ అంతా కూడా చాలా భిన్నంగా ఉంటుంది. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన మోహిత్ చురివాల్ స్కూల్లో చదివేటప్పటినుంచే ఇంటర్నెట్లో తన ప్రయత్నాలు ప్రారంభించాడు. 15 యేళ్ల వయసులో ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ తెరిచి, దాన్ని 7 లక్షల రూపాయలకు అమ్మేశాడు. యూ ట్యూబ్ ఛానెల్ కూడా ప్రారంభించాడు కానీ ముందుకు వెళ్లలేదు. తర్వాత ఒక సోషల్ పేజ్‌ను క్రియేట్ చేశాడు. ఐతే అది హ్యాక్ అయ్యింది. రెండు సార్లు విఫలమయ్యాక ఇంకొంచెం కష్టపడాలని నిర్ణయించుకున్నాడు. 12వ తరగతి చదివేటప్పుడు అతని మొదటి సంపాదన అక్షరాల 7 లక్షల రూపాయలు. ఆతర్వాత సొంతంగా కంపెనీ ప్రారంభించాలని అనుకున్నాడు. ఐతే అందుకు చాలా డబ్బు అవసరం అవుతుంది. డబ్బు లేదని తన ప్రయత్నాలు మానుకోలేదు. అనేక బ్రాండెడ్ కంపెనీల్లో పనిచేయడం ప్రారంభించాడు. తర్వాత 18 యేళ్లకు తన కలను నెరవేర్చుకున్నాడు. సొంత కంపెనీ ప్రారంభించి నెలకు 3 లక్షల రూపాయలు సంపాదించడం ప్రారంభించాడు. ఆ కంపెనీ లాభాలబాట పట్టగానే మరో కంపెనీ ప్రారంభించాడు. ఐతే ఈ ప్రయాణంలో ఎవరి దగ్గరా (కుటుంబంతో సహా) డబ్బుకోసం ఎప్పుడూ చేయిచాచలేదు. స్వయం కృషితో ప్రారంభించి మునుముందుకు నడిపించాడు. అద్భుతం కదా! మోహిత్ చురివాల్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటే ఎన్నో ఉన్నత చదువులు చదివి నిరుద్యోగులుగా మిగిలిన నేటి యువత కొత్తగా కెరీర్ నిర్మించుకోవచ్చు. నిజమేకదా.. మీరేమంటారు.. చదవండి: దూసుకొస్తున్న రాయ్ తుఫాన్! 8 ప్రాంతాల్లో హై అలర్ట్.. -
5జీ సేవలను ప్రదర్శించిన జియో, శాంసంగ్
న్యూఢిల్లీ : ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2019లో రిలయన్స్ జియో, శాంసంగ్‌లు నెక్ట్స్ జనరేషన్ టెక్నాలజీతో కూడిన 5జీ, ఎల్టీఈ మోడల్స్‌ను ప్రదర్శించాయి. దక్షిణాసియా, భారత్‌లోనే అతిపెద్ద డిజిటల్ సాంకేతికత ఈవెంట్‌గా పేరొందిన ఐఎంసీ ఈనెల 14 నుంచి 16 వరకూ ఢిల్లీలో జరుగుతున్న సంగతి తెలిసిందే. శాంసంగ్ నెట్వర్క్ భాగస్వామ్యంతో జియో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్, 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్‌ను నిర్మించింది. ఈ కార్యక్రమంలో ఇరు కంపెనీలు 5జీ ఎన్ఎస్ఏ విధానం వాడటం ద్వారా నూతన వ్యాపార అవకాశాల గురించి వివరించాయి. 4జీ ఎల్టీఈ, 5జీ టెక్నాలజీని మిళితం చేయడం ద్వారా వినియోగదారులకు ఎలాంటి వినూత్న సేవలు అందించవచ్చో వివరించాయి. మొబైల్ ఇంటర్నెట్, నిరంతరం డేటా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వినియోగదారుల జీవితంలో సమూల మార్పులు తీసుకువచ్చామని ఈ సందర్భంగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ప్రెసిడెంట్ మ్యాథ్యూ ఊమెన్ పేర్కొన్నారు. ఇక 5జీలోకి మారే ప్రక్రియలో అత్యున్నత ఎల్టీఈ నెట్‌వర్క్‌లు కీలకమని శాంసంగ్ నెట్వర్క్స్ బిజినెస్ హెడ్ పాల్ కుంగ్‌వున్ చెన్ పేర్కొన్నారు. -
కళాకారుల కళ చెదురుతుంది
సాక్షి, పిడుగురాళ్ల : ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం చేతివృత్తి కళాకారుల జీవనోపాధిపై పెను ప్రభావం చూపుతోంది. కళాకారులు వేసిన చిత్రాలు ఏళ్ల తరబడి నాణ్యతను సంతరించుకుని ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అయితే డిజిటల్ రంగప్రవేశం కళాకారుల బతుకుల్ని చిదిమేసింది. కొద్దిరోజుల్లో చిరిగి, రంగులుపోయే వినైల్, ఫ్లెక్సీ ప్రింటింగ్, స్టిక్కర్ కటింగ్ మిషన్లు, లైటింగ్ బోర్డులపైనే వినియోగదారులు మొగ్గుచూపుతున్నారు. దీంతో కళనే వృత్తిగా నమ్ముకుని జీవనం సాగిస్తున్న కళాకారులకు ఉపాధి కరువైంది. చిత్రకళ తప్ప ఇతర పనులుచేయడం చేతగాకపోవడంతో నియోజకవర్గంలో పదుల సంఖ్యలో కళాకారులు ఇక్కట్లు పడుతూ దయనీయ జీవనం గడుపుతున్నారు. ఉపాధి కోల్పోయిన కళాకారులు... డిజిటల్ ప్రింటింగ్‌తో చిత్రకారులు జీవనోపాధి కోల్పోయారు. నియోజకవర్గంలో సుమారు 100 నుంచి 150 మంది కళాకారులు దుకాణాల ఎదుట బోర్డులు, బ్యానర్లు రాస్తూ, బొమ్మలు వేస్తూ జీవనం సాగించేవారు. ఎన్నికలు వస్తే ఇక ఆర్టిస్టులు రేయింబవళ్లు పదులసంఖ్యలో పనిచేసేవారు. అయితే ఎన్నికల్లో గోడలపై రాతలు, బ్యానర్లు ఉండరాదన్న ఎన్నికల కమిషన్ నియమావళితో 50 శాతం మంది ఆర్టిస్టు ల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. కాలక్రమంలో డిజిటల్ ప్రింటింగ్ రంగప్రవేశంతో మిగిలిన 40 శాతం మంది ఆర్టిస్టులకు పనిలేకుండా పోయింది. కొద్దోగొప్పో ఆర్థికస్తోమత ఉన్నవారు డిజిటల్ ప్రింటింగ్ మిషన్లు ఏర్పాటుచేసుకుని జీవనం సాగిస్తుండగా మరికొందరు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఇళ్లకు రంగులు వేయడానికి వెళుతున్నారు. మరికొందరు కష్టమైనా వేరే వృత్తిని ఎంచుకోలేక పెయింటింగ్ వృత్తినే నమ్ముకుని వారానికి ఒకసారో, రెండుసార్లో వచ్చే పనులకు వెళ్లి రంగులువేసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. అక్కడక్కడ పాఠశాల గోడలకు దేశనాయకుల చిత్రాలను గీస్తూ జీవనం సాగిస్తున్నారు. తమకు ప్రభుత్వం రుణాలు మంజూరుచేసి చేయూతనివ్వాలని ఆర్టిస్టులు కోరుతున్నారు. 90 శాతం పనులు తగ్గాయి 35 ఏళ్లుగా ఆర్టిస్టుగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం కళాకారులకు 90శాతం మేర పనులు తగ్గాయి. డిజిటల్ ఫ్లెక్సీలు రావడంతో అందరూ వాటినే ఏర్పాటుచేసుకుంటున్నారు. దీంతో మాకు పనులు సన్నగిల్లాయి. ప్రభుత్వం చేతివృత్తి కళాకారులకు రుణాలు మంజూరుచేస్తే ఏదొక వ్యాపారం పెట్టుకుని జీవనం సాగిస్తాం. – కె.చెన్నకేశవ, ఆర్టిస్టు, పిడుగురాళ్ల -
అనుభవం పెంచుకుంటేనే జాబ్ సొంతం
భారత్‌లో గత కొన్నేళ్లుగా ఉద్యోగ నియామకాల విధానంలో ఎన్నో మార్పులొచ్చాయి. జాబ్ మార్కెట్లో పోటీ విపరీతంగా పెరిగింది. షార్ట్‌లిస్ట్‌లో ప్రథమ స్థానంలో నిలిచి నచ్చిన కొలువు దక్కించుకోవాలంటే.. తగిన అర్హతలతోపాటు ప్రత్యేకమైన నైపుణ్యాలు ఉండాలి. ఆధునిక ధోరణులపై అవగాహన పెంచుకోవాలి. నేటి టెక్నాలజీ యుగంలో హైరింగ్ ప్రాసెస్ ఎలా ఉంది? రిక్రూటర్లు ఏయే మార్గాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారో తెలుసుకోవాలి. అనుభవజ్ఞులే మేలట: ఉద్యోగస్తులకే ఉద్యోగాలు దక్కుతున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజమని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే ఒక కంపెనీలో కొలువులో కొనసాగుతున్న వారినే నియమించుకొనేందుకు ఇతర కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని చెబుతున్నారు. ఎందుకంటే వారి అనుభవం, నైపుణ్యాలు తమకు తక్షణమే ఉపయోగపడతాయని భావిస్తున్నాయి. ఎలాంటి ఉద్యోగానుభవం లేని కొత్త అభ్యర్థుల కంటే ఇలాంటి వారే మేలని అంచనా వేస్తున్నాయి. కొలువు లేకుండా ఆరు నెలలపాటు ఖాళీగా ఉంటే మళ్లీ ఉద్యోగం దక్కడం కష్టమే. అడల్ట్ ఇంటర్న్షిప్స్: ఎంతో అనుభవం, పరిజ్ఞానం ఉన్నప్పటికీ చాలాకాలం ఖాళీగా ఉన్నవారి కంటే అప్పుడే ఒక కొలువు నుంచి బయటికొచ్చినవారికే కంపెనీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త అభ్యర్థులు నిరాశ చెందాల్సిన పనిలేదు. అనుభవం పెంచుకుంటే కంపెనీల దృష్టిలో పడొచ్చు. జీతభత్యాలు లేకుండా పనిచేసేందుకు కొన్ని సంస్థలు అనుమతిస్తుంటాయి. వాటిలో చేరి పని నేర్చుకోవచ్చు. స్వచ్ఛంద సంస్థల్లోనూ చేరి, అనుభవం, పనితీరును మెరుగుపర్చుకోవచ్చు. ఇంటర్న్షిప్స్ కూడా ఉపయోగపడతాయి. నేడు అడల్ట్ ఇంటర్న్‌షిప్‌లు సర్వసాధారణంగా మారాయి. ఇక్కడ నేర్చుకున్న వృత్తిపరమైన పరిజ్ఞానం ఉద్యోగ సాధనకు తోడ్పడుతుంది. ఇలాంటి వాటివల్ల మీ రెజ్యూమెకు బలం పెరుగుతుంది. సోషల్ మీడియా: సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉన్నవారిని కంపెనీలు ఇష్టపడుతున్నాయి. ఇలాంటి వారికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, నెట్వర్క్ ఉంటాయని భావిస్తున్నాయి. సమాన అర్హతలున్న ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరు సోషల్ మీడియాలో ఎక్కువ క్రియాశీలకంగా ఉన్నారో చూస్తున్నాయి. అతడినే ఉద్యోగంలో చేర్చుకుంటున్నాయి. కాబట్టి మీరు కూడా సామాజిక మాధ్యమాల్లో భాగస్వామ్యాన్ని పెంచుకోండి. అంతేకాకుండా మిమ్మల్ని అనుసరించేవారిని, అభిమానులను, నెట్వర్క్, కాంటాక్ట్స్, ఎండార్స్మెంట్స్, రికమండేషన్లను కూడా సంస్థలు పరిశీలిస్తున్నాయి. వెబ్సైట్లలో మీ పోస్టులకు ఎక్కువ లైక్‌లు, కామెంట్లు వస్తే రిక్రూటర్ల దృష్టిలో మీరు ఒక మెట్టు పైకి ఎదిగినట్లే లెక్క. అందుకే ఫ్యాన్ క్లబ్లో ఎక్కువ మందిని చేర్చుకోండి. ఆధారాలు: గతంలో అభ్యర్థులు తమ గురించి తాము చెప్పుకోవడానికి ఆధారం.. రెజ్యూమె లేదా కరిక్యులమ్ విటే(సీవీ), రిఫరెన్స్‌ల జాబితా. ఇప్పుడు వీటి స్థానంలో మరికొన్ని చేరాయి. వైట్ పేపర్స్, ఆర్టికల్స్, ప్రజంటేషన్లు, బ్లాగ్పోస్టుల రూపంలో రిక్రూటర్లకు అభ్యర్థులు తమ అర్హతలు, నైపుణ్యాలు, పనితీరు గురించి తెలియజేయాల్సి ఉంటుంది. ఆయా ప్రూఫ్స్‌ను సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ప్రొఫైల్‌తోపాటు జతచేయాలి. -
కొలువు కోసం ఆన్లైన్ నెట్వర్కింగ్ గ్రూప్
ఆధునిక సమాచార సాంకేతిక యుగంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఆన్లైన్ వేదికల ద్వారానే జరుగుతోంది. కొలువుల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి నెట్వర్కింగ్ వ్యూహంలో భాగంగా ఆన్లైన్లో కంపెనీలు, రిక్రూట ర్లు, సంబంధిత రంగాల వ్యక్తులతో సత్సంబంధాలను ఏర్పరచుకోవాలి. దీనివల్ల మీకు జాబ్ మార్కెట్లో వ్యక్తిగత బ్రాండ్ ఇమేజ్ ఏర్పడుతుంది. అంతర్జాలంలో మీ స్థానం: మంచి నెట్‌వర్క్‌తో అవకాశాలను మెరుగుపర్చుకోవచ్చు. మీ రంగానికి చెందిన ప్రొఫెషనల్స్‌తో కనెక్ట్ కావడం వల్ల పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలు, ఉద్యోగాల భర్తీ, కెరీర్ మేనేజ్మెంట్పై అవగాహన పెరుగుతుంది. తాజా సమాచారం తెలుసుకోవచ్చు. రొటీన్ హైరింగ్ ప్రాసెస్ పట్ల రిక్రూటర్లు కూడా విసుగెత్తిపోయారు. పోస్టుల్లో వచ్చే అభ్యర్థుల అర్హతల జాబితాలను పక్కన పడేసి అంతర్జాలంలో వారి బ్యాక్‌గ్రౌండ్‌ను పరిశీలిస్తున్నారు. కాబట్టి మారుతున్న ట్రెండ్‌కు తగ్గట్టు మీరు కూడా ఆన్లైన్లో మీ కంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోండి. జాబ్ నెట్వర్కింగ్ గ్రూపుల్లో చేరండి. వాటి కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనండి. మీ ప్రొఫెషన్‌కు చెందినవారితో కలిసి ఒక జట్టుగా మారండి. కావాల్సిన సమాచారాన్ని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోండి. గ్రూప్‌తో ప్రయోజనాలెన్నో.. : జాబ్ సైట్లలో ప్రొఫైల్‌ను పోస్టు చేయడం, నెట్వర్కింగ్ గ్రూప్‌లో చేరడం.. ఈ రెండూ ఒకటేనని చాలామంది అపోహ పడుతుంటారు. నిజానికి ఇవి పూర్తిగా భిన్నం. ఆన్లైన్ గ్రూప్‌లో చేరితే రిక్రూటర్లు, సహచరుల నుంచి తాజా సమాచారం తెలుస్తుంది. ఉద్యోగానికి కావాల్సిన స్కిల్స్, నియామక విధానం పట్ల అవగాహన వస్తుంది. దాని ప్రకారం సన్నద్ధం కావొచ్చు. కెరీర్‌ను మార్చుకోవడానికి కూడా ఈ గ్రూప్స్ ఉపయోగపడతాయి. ఆన్లైన్ నెట్వర్కింగ్ గ్రూప్ కూడా ఒక మౌఖిక పరీక్ష లాంటిదే. మీ అర్హతలు, అనుభవాలు, నైపుణ్యాలతో రిక్రూటర్‌ను మెప్పించగలిగితే ప్రయత్నం సఫలం కావడం ఖాయం. గ్రూప్‌లో మిమ్మల్ని మీరు ప్రభావవంతంగా వ్యక్తీకరించుకోవాలి. మీ ప్రొఫెషనల్ ప్రొఫైల్ రిక్రూటర్లను ఆకట్టుకొనేలా ఉండాలి. వ్యక్తిగత విషయాలు వద్దు : ఇతరుల అవసరం మీకే కాదు, మీ అవసరం కూడా ఇతరులకు ఉంటుంది. ఏదైనా సంస్థలో కొలువులు ఖాళీగా ఉన్నట్లు మీకు తెలిస్తే సదరు సమాచారాన్ని ఇతరులతో పంచుకోండి. అది వారికి ఉపయోగపడుతుంది. వివరాలను ఆన్లైన్లో పోస్టు చేయండి. అందరికీ అవసరమైన స్కిల్ బిల్డింగ్, కెరీర్ అడ్వాన్స్మెంట్పై ఆసక్తికర సమాచారం ఏదైనా ఇవ్వొచ్చు. మీరు ఇప్పటికే ఒక సంస్థలో పనిచేస్తూ మరో ఉద్యోగం కోసం ప్రయత్నించేటప్పుడు నెట్వర్కింగ్ గ్రూప్‌ను వాడుకోండి. కానీ, ప్రస్తుత యాజమాన్యం గురించి చెడు ప్రచారం చేయకండి. జాబ్, కెరీర్ వంటి అంశాలకే ఈ గ్రూప్‌లను పరిమితం చేయాలి. పర్సనల్ విషయాలను పబ్లిక్‌లోకి తీసుకురావొద్దు. ఎల్లప్పుడూ పాజిటివ్ ప్రొఫెషనల్ ఇమేజ్‌నే కొనసాగించాలి. ఉద్యోగం దక్కిన తర్వాత కూడా నెట్వర్కింగ్ గ్రూప్‌తో అనుబంధం ఎప్పటిలాగే ఉండడం మంచిది. ఇది లాంగ్‌టైమ్ జాబ్ ఇన్సూరెన్స్ లాంటిది. ఈ గ్రూప్ ప్రతిదశలో మీకు అండగా నిలుస్తుంది. కెరీర్లో ఎదగడానికి తోడ ్పడుతుంది. విద్యార్థినులు విజ్ఞాన వారధులు ఆరోగ్యం నుంచి అగ్ని పరీక్షల వరకూ.. అన్నింటా విజ్ఞానానిదే ప్రధాన భాగస్వామ్యం. తరగతి గదిలో విద్యార్థి మదిలో మెదిలే ఆలోచనలే పరిశోధనలతో ఫలవంతమవుతున్నాయి. తాము కూడా ఇదే దారిలో ఉన్నామంటున్నారు ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్(కోఠి ఉమెన్స్ కాలేజీ) విద్యార్థినులు. కళాశాల 90వ వార్షికోత్సవం సందర్భంగా కళాశాల ప్రాంగణంలో పలు ఆవిష్కరణలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. సాంకేతికత, సృజనాత్మకత, బృందస్ఫూర్తిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ప్రదర్శన చూపరులను ఆకట్టుకోవడంతోపాటు విజ్ఞానాన్ని పంచుతోంది. పర్యావరణ పరిరక్షణ, విద్యుత్ పొదుపు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులను విద్యార్థినులు తమ ప్రదర్శన ద్వారా తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం వల్ల నాయకత్వ లక్షణాలు, టీమ్ వర్క్, కొత్త అంశాలను నేర్చుకోవడం, కమ్యూనికేషన్ స్కిల్స్, నేర్పు, ఓర్పు పెంపొందుతాయంటున్నారు కాలేజీ విద్యార్థినులు. మూడు రోజుల పాటు కొనసాగే ఈ ప్రదర్శన నేడు కూడా ఉంటుందని వెల్లడించారు. ఆర్ఆర్బీ -సికింద్రాబాద్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బీ)-సికింద్రాబాద్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సీనియర్ సెక్షన్ ఇంజనీర్ చీఫ్ డిపో మెటీరియల్ సూపరింటిండెంట్: జూనియర్ ఇంజనీర్ డిపో మెటీరియల్ సూపరింటిండెంట్ కెమికల్ మెటలర్జికల్ అసిస్టెంట్. ఎంపిక: రాత పరీక్ష ద్వారా. విభాగాల వారీగా పోస్టులు, అర్హతలు, వయోపరిమితి.. తదితర పూర్తి వివరాలకు వెబ్సైట్ చూడవచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: అక్టోబర్ 19 రాతపరీక్ష తేదీలు: జూనియర్ ఇంజనీర్, డీఎంఎస్, సీఎంఏ: డిసెంబర్ 14 సీనియర్ సెక్షన్ ఇంజనీర్ పోస్టులకు: డిసెంబర్ 21 వెబ్సైట్: http://rrbsecunderabad.nic.in కాంపిటీటివ్ కౌన్సెలింగ్ డీఎస్సీ, టెట్ వంటి పోటీ పరీక్షల్లో తెలుగు మెథడాలజీ విభాగంలో మంచి మార్కులు సాధించడానికి ఏవిధంగా చదవాలి? - ఎల్.గాయత్రి, విద్యానగర్ టెట్, డీఎస్సీ, మోడల్ స్కూల్స్ వంటి పోటీ పరీక్షల్లో తెలుగు బోధనా పద్ధతులు సబ్జెక్టును తప్పనిసరి చేశారు. ర్యాంకు సాధనలో ఈ విభాగానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. అంతేకాకుండా పోటీ పరీక్షల్లో ప్రతి మార్కు కీలకమే కాబట్టి అభ్యర్థులు తెలుగు మెథడాలజీపై ప్రత్యేక దృష్టి సారించి చదవాలి. దీంట్లో ఎక్కువ స్కోర్ సాధించడానికి తెలుగు అకాడమీ పుస్తకాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ముఖ్యంగా ఎస్జీటీ, గ్రేడ్-2 తెలుగు పండిట్స్ పోస్టుల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ‘డీఎడ్ తెలుగు బోధనా పద్ధతులు’; బీఎడ్, టీపీటీ చేసి స్కూల్ అసిస్టెంట్ పరీక్ష రాసే వారు ‘బీఎడ్ తెలుగు బోధనా పద్ధతులు’ పుస్తకాలను సమగ్రంగా చదవాలి. టెట్, డీఎస్సీ తదితర పోటీ పరీక్షలన్నింటిలో తెలుగు మెథడాలజీ సిలబస్‌కు సంబంధించి కింద పేర్కొన్న పాఠ్యాంశాలున్నాయి. 1. భాష - వివిధ భావనలు 2. మాతృభాష బోధన - లక్ష్యాలు, స్పష్టీకరణలు 3. భాషా నైపుణ్యాలు 4. ప్రణాళికా రచన - పాఠ్య గ్రంథాలు 5. పాఠ్య బోధన ప్రక్రియలు - ఆధునిక బోధన పద్ధతులు 6. విద్యా సాంకేతిక శాస్త్రం - సహ పాఠ్య కార్యక్రమాలు 7. మూల్యాంకనం - పరీక్షలు తెలుగు మెథడాలజీ అనేది తరగతి గదిలో మాతృభాషా బోధనకు సంబంధించింది. కాబట్టి పద్య, గద్య, వ్యాకరణ, ఉపవాచక బోధనలు, వాటికి సంబంధించిన పాఠ్య పథకం, సోపాన క్రమం, తరగతి గదిలో సందర్భానుసారంగా ప్రదర్శించే బోధనోపకరణాలు, మూల్యాంకనం - పరీక్షల నిర్వహణ మొదలైన అంశాలపై అభ్యర్థులు ప్రత్యేక దృష్టి సారించి చదివితే మంచి మార్కులు సాధించవచ్చు. ఇన్పుట్స్: ఎన్.కె. మద్దిలేటి, - సీనియర్ ఫ్యాకల్టీ -
భిన్నంగా ఆలోచించే వారికి భవ్యమైన కెరీర్లు
కొందరికి అందరిలాగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రొటీన్‌గా పనిచేయడం అస్సలు నచ్చదు. అందరికీ భిన్నంగా తమకు చేయాలనిపించినప్పుడే విధులు నిర్వహించడానికి ఆసక్తి ప్రదర్శిస్తుంటారు. తమకు నచ్చినప్పుడు పనిచే యడానికి వీలు కల్పించే కెరీర్ కావాలని కోరుకుంటారు. అలాంటి రంగంలోనే ఉపాధిని వెతుక్కుంటారు. ఇలా వైవిధ్యమైన కెరీర్ కోరుకునేవారికి నేటి హైటెక్ జాబ్ మార్కెట్ ఆహ్వానం పలుకుతోంది. సిటీలో ఆయా రంగాల్లో మానవ వనరులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. భిన్నంగా ఆలోచించే వారికోసం పలు భవ్యమైన కెరీర్స్. ఫ్రీలాన్స్ వెబ్ డిజైనర్ ప్రస్తుత ఈ-కామర్స్, టెక్నాలజీ యుగంలో అంతటా వెబ్‌సైట్స్ హవా నడుస్తోంది. చిన్న పెద్దా తేడా లేకుండా ప్రతి కంపెనీ కూడా తమకంటూ ప్రత్యేకంగా వెబ్సైట్ ఉండాలని భావిస్తోంది. దాంతో ఆయా కంపెనీల అవసరాలు, ప్రాధాన్యాల మేరకు వెబ్‌సైట్‌ను రూపొందించడానికి వెబ్ డిజైనర్ల అవసరం ఏర్పడింది. వీరి పని కేవలం వెబ్ డిజైనింగ్ వరకే పరిమితం. కాబట్టి వెబ్ డిజైనింగ్ కోసం ఉద్యోగిని నియమించుకోవడం లేదు. ఆ బాధ్యతలు పొరుగు సేవల కన్సల్టెంట్స్‌కు అప్పగిస్తున్నాయి. కాబట్టి పని వేళలతో నిమిత్తం లేకుండా వెబ్ డిజైనింగ్ చేయొచ్చు. కంపెనీ నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేస్తే సరిపోతుంది. వెబ్ డిజైనింగ్‌కు సంబంధించి పలు ప్రైవేట్ సంస్థలు స్వల్పకాలిక కోర్సులను అందజేస్తున్నాయి. వాటిని నేర్చుకోవడం ద్వారా వెబ్ డిజైనర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. ఇంట్లో కంప్యూటర్ ఉంటే చాలు ఈ రంగంలో ఫ్రీలాన్సర్‌గా స్థిరపడొచ్చు. డిజైన్ చేసిన వెబ్సైట్/సంస్థను బట్టి వేతనం ఉంటుంది. నెలకు రూ.10 వేల -20 వేల వరకు ఆదాయాన్ని పొందొచ్చు. రియల్ ఎస్టేట్ ఏజెంట్ చాలా మంది డబ్బును స్థిరాస్తుల్లో పెట్టుబడిగా పెట్టాలని భావిస్తుంటారు. ఎక్కడ, ఎలా అనే విషయంలో సరైన అవగాహన ఉండదు. ఇటువంటి వారిని గైడ్ చేయడానికి రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఉంటారు. ఎక్కడ భూమి ఉంది? దాని ధర ఎంత? రాబోయే కాలంలో పరిస్థితులు ఏవిధంగా ఉంటాయి? వంటి విషయాలను వీరు సమగ్రంగా వివరిస్తుంటారు. దీనికి కూడా సమయంతో నిమిత్తం లేదు. కేవలం ఫోన్ ద్వారా ఇన్వెస్టర్, భూ యజమానితో మాట్లాడి అనుకున్న సమయానికి భూమిని చూపిస్తే సరిపోతుంది. ఇతర ఉద్యోగాలు చేస్తూ కూడా రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా వ్యవహరించవచ్చు. భూమికి సంబంధించి చేసుకున్న ఒప్పందం మేరకు కమిషన్ రూపంలో ఆదాయం లభిస్తుంది. ప్రస్తుతం చాలా మంది భూమిపై పెట్టుబడి దిశగా ఆలోచిస్తున్న తరుణంలో రియల్ ఎస్టేట్ ఏజెంట్ భిన్నమైన కెరీర్‌గా చెప్పొచ్చు. సోషల్ మీడియా కన్సల్టెంట్ ప్రస్తుతం అంతటా సోషల్ మీడియా హల్చల్ చేస్తోంది. తమ అభిప్రాయాలను ఇతరులతో పంచుకోవడానికి సోషల్ మీడియా చక్కని మాధ్యమంగా మారింది. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయం, క్రీడలు.. ఇలా అన్ని రంగాలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని ఒకే క్లిక్‌తో ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తున్నారు. వీటిని లక్షలాది మంది వీక్షిస్తుంటారు. దీని ఆధారంగా సంస్థలు తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నాయి. ఆయా సంస్థలు సోషల్ మీడియా వ్యవహారాలను కన్సల్టెంట్లకు అప్పగిస్తున్నాయి. వీరు తమకు వీలైన సమయంలో సంబంధిత వ్యవహారాలను అప్లోడ్ చేస్తే సరిపోతుంది. కంప్యూటర్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. మొబైల్ ఫోన్‌తోనే ఎప్పుడైనా ఇటువంటి పనులను పూర్తి చేయవచ్చు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల హవా నడుస్తున్న తరుణంలో ఇది ఒక మంచి అవకాశం. వీరికి ఇంగ్లిష్ భాష, స్థానిక పరిస్థితులపై పట్టు ఉండాలి. చేస్తున్న పని ఆధారంగా డబ్బు అందుతుంది. నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకూ సంపాదించుకోవచ్చు. పర్సనల్ ట్రైనర్ నేడు ప్రపంచమంతా నైపుణ్యాలాధారంగా పని చేస్తుంది. సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, టీచింగ్.. ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా కమ్యూనికేషన్, లీడర్షిప్ వంటి లక్షణాలు తప్పనిసరి. ఈ అంశాలు అకడమిక్స్‌లో పెద్దగా కనిపించవు. వీటికున్న ప్రాధాన్యత దృష్ట్యా స్వతహాగా పెంపొందించుకోవాలి. లేదా శిక్షణ ద్వారా మెరుగుపరుచుకోవాలి. ఈ క్రమంలో వివిధ పరీక్షలకు ఇచ్చే కోచింగ్ మాదిరిగానే వ్యక్తిగత నైపుణ్యాల శిక్షణ తరగతులను నిర్వహించవచ్చు. ఉదయం, సాయంత్రం వేళల్లో లేదా వారాంతాల్లో ఆయా అంశాలపై శిక్షణనివ్వచ్చు. ప్రస్తుతం విద్యార్థులు, ఉద్యోగార్థులందరూ నైపుణ్య మంత్రం జపిస్తున్నందున ఇలాంటి తరగతులకు మంచి ఆదరణ లభిస్తోంది. వీటిని సొంతంగా చేపట్టవచ్చు లేదా ఏదైనా ఇన్స్టిట్యూట్లో చెప్పొచ్చు. తరగతులు/సమయం ఆధారంగా వేతనం ఉంటుంది. నెలకు రూ.15 వేల -20 వేల వరకు సంపాదించవచ్చు. గ్రాఫిక్ డిజైనర్ ప్రస్తుత మార్కెటింగ్ యుగంలో వినియోగదారులను ఆకర్షించాలన్నా.. బోర్డు సమావేశ నిర్ణయాలను ప్రభావవంతంగా నివేదిక రూపంలో తెలపాలన్నా.. పుట్టిన రోజు నుంచి పెళ్లి వరకు ఏ శుభకార్యానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలు ముద్రించాలన్నా.. గ్రాఫిక్ డిజైనర్ల పాత్ర ఎంతో కీలకం. ప్రింటింగ్ ప్రెస్‌లు, ఫొటోషాప్‌లు, డిజైనింగ్ స్టూడియోలు, కార్పొరేట్ సంస్థలు, మీడియా హౌస్‌లు తదితర సంస్థలు ఇందుకు ఉపాధి వేదికలు. వీలైన సమయంలో లేదా ఫ్రీలాన్స్ గ్రాఫిక్ డిజైనర్‌గా పని చేసుకోవచ్చు. ఇందుకోసం ఫొటోషాప్, కొరల్‌డ్రా వంటి సాంకేతిక అంశాలపై అవగాహన తప్పనిసరిగా ఉండాలి. కొన్ని ప్రైవేట్ సంస్థలు ఈ విభాగంలో స్వల్పకాలిక కోర్సులను నిర్వహిస్తున్నాయి. ఎంచుకున్న పనిని బట్టి వేతనం ఉంటుంది. నెలకు రూ.10 వేల -20 వేల వరకు వేతనం పొందొచ్చు. ట్యాక్స్ కన్సల్టెంట్ మనలో చాలా మందికి పన్నులకు సంబంధించిన అంశాలు అంతగా తెలియవు. ఇటువంటి నేపథ్యంలో ఎంత ఆదాయం వస్తే పన్ను చెల్లించాలి? అన్ని రంగాల వారు చెల్లించాలా? పన్నుల భారం పడకుండా ఉండాలంటే.. ఎటువంటి పద్ధతులను అనుసరించాలి? వంటి అంశాలపై అవగాహన కల్పించడం ట్యాక్స్ కన్సల్టెంట్ బాధ్యత. చాలా మంది/సంస్థలు తమకున్న పరిమితుల దృష్ట్యా ట్యాక్స్ సంబంధిత వ్యవహారాలను పొరుగు సేవల రూపంలో కన్సల్టెంట్లకు అప్పగిస్తుంటాయి. వీరు క్లైంట్ల సమయానుకూలతలను బట్టి వారిని కలిసి సంబంధిత వివరాలు సేకరిస్తారు. తర్వాత ఏం చేయాలి? ఏవిధంగా చేయాలి? అనే అంశంపై గెడైన్స్ ఇస్తారు. కామర్స్, మేనేజ్మెంట్ అభ్యర్థులు మెరుగైన అవకాశాలను దక్కించుకోవచ్చు. పనిని బట్టి నెలకు రూ.20 వేల నుంచి 30 వేల వరకు ఆదాయం అందుకోవచ్చు. డెంటల్ హైజీనిస్ట్ డెంటిస్ట్ విధులకు సహాయకారిగా ఎప్పుడూ ఎవరో ఒకరు ఉండాల్సిందే. డెంటిస్ట్‌లు ఉదయం, సాయంత్రం వేళల్లో క్లినిక్‌లు నిర్వహిస్తుంటారు. ఈ సమయంలో వీరికి డెంటల్ హైజీనిస్ట్లు అవసరమవుతారు. దంతవైద్యంపై అందరికీ అవగాహన ఏర్పడడం, ప్రతి చోటా డెంటల్ క్లినిక్‌లు కనిపిస్తుండటంతో వీరి ప్రాధాన్యత పెరిగింది. వచ్చిన పేషంట్లను సమన్వయం చేయడం, చికిత్స సంబంధిత వ్యవహారాల్లో డాక్టర్‌కు సహాయం అందించడం, పేషంట్లకు సలహాలు ఇవ్వడం వంటివి వీరి విధులు. పని గంటలను బట్టి వేతనాలను చెల్లిస్తారు. నెలకు రూ. 6 వేల నుంచి 10 వేల వరకు అందుకోవచ్చు. ట్రావెల్ గైడ్ చారిత్రక కట్టడాల ప్రాధాన్యత, విశిష్టతలను వివరంగా తెలుసుకుంటేనే వాటి సందర్శన పరిపూర్ణమవుతుంది. ఇందుకు సహకరించే వారు ట్రావెల్ గైడ్లు. కట్టడానికి సంబంధించిన విశేషాలను వివరించడంతోపాటు ఇంకా సందర్శించాల్సిన ప్రదేశాలు, ఎక్కడ బస చేయొచ్చు? మనకు కావల్సిన ఆహారం ఎక్కడ లభిస్తుంది? తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. ట్రావెల్ గైడ్‌గా రాణించాలంటే.. భాషలపై పట్టు ఉండాలి. ఎందుకంటే.. వచ్చిన పర్యాటకుల స్థానిక భాషను నేపథ్యంగా తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రయాణాల పట్ల ఆసక్తి ఉండాలి. చూపించిన ప్రదేశం, ప్రయాణించిన దూరం వంటి అంశాలాధారంగా ఆదాయం లభిస్తుంది. నెలకు రూ. 5 వేల నుంచి 10 వేల వరకు వేతనాన్ని పొందొచ్చు. నర్సింగ్ సమయంతో పోటీపడి పరుగులు పెడుతున్న నగర జీవులు..అంతే వేగంగా వ్యాధుల బారిన పడుతున్నారు. వాటి నుంచి ఉపశమనం కల్పించే దిశలో న ర్సుల సేవలు ఎంతో అవసరం. ప్రతి చిన్న సమస్యకు ఆసుపత్రులకు వెళ్లడం ఎంతో వృథా వ్యవహారం. ఇంజక్షన్ చేయడం, ఫస్ట్ ఎయిడ్, డ్రెస్సింగ్, బీపీ చెకప్, సెలైన్ ఎక్కించడం, వంటి పనులను ఇంట్లో చేయడానికి పార్ట్‌టైమ్ నర్సులు అవసరం. అదేవిధంగా స్పెషలిస్ట్ డాక్టర్లు ఈవెనింగ్ క్లినిక్స్/మార్నింగ్ క్లినిక్స్‌లు నిర్వహిస్తుంటారు. అందులో వారికి తోడ్పడానికి నర్సుల సేవలు తప్పనిసరి. ఇలాంటి సందర్భాల్లో నర్సుల అవసరం కొన్ని రోజులకు లేదా కొన్ని గంటలకే పరిమితం. కాబట్టి అనువైన సమయంలో ఈ సేవలను అందించవచ్చు. వీరికి విధులు నిర్వహించిన సమయాన్ని బట్టి వేతనం అందుతుంది. ప్రారంభంలో నెలకు రూ.10 వేల-14 వేల ఆదాయం అందుకోవచ్చు. మేకప్ ఆర్టిస్ట్ సంప్రదాయ పని వేళలతో నిమిత్తం లేకుండా విధులు నిర్వహించే వెసులుబాటు కల్పిస్తున్న మరో విభాగం.. మేకప్ ఆర్టిస్ట్. నేటి తరం పుట్టిన రోజు నుంచి పెళ్లి వరకు అన్ని రకాల శుభకార్యాలకు అలంకరణ విషయంలో ప్రాధాన్యం ఇస్తోంది. ఆయా శుభ కార్యాల సమయాన్ని అనుసరించి మేకప్ చేస్తే సరిపోతుంది. మేకప్‌ను బట్టి వేతనాన్ని చెల్లిస్తారు. నెలకు రూ.10 వేల నుంచి 20 వేల వరకు ఆదాయం పొందొచ్చు. స్పోర్ట్స్/ఫిజికల్ కోచ్ చాలామంది ఇప్పుడు ఫిజికల్ ఫిట్నెస్, స్పోర్ట్స్‌పై మక్కువ చూపిస్తున్నారు. స్పోర్ట్స్/ఫిజికల్ కోచ్ ..కార్యకలాపాలన్నీ ఉదయం, సాయంత్రం ఉంటాయి. కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం అనే విధానానికి భిన్నంగా ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కోచ్‌గా కొనసాగవచ్చు. దీనికి అకడమిక్ కోర్సులు అవసరం లేదు. స్వల్ప శిక్షణతో ఇందులో స్థిరపడొచ్చు. స్పోర్ట్స్ క్లబ్‌లు, జిమ్‌లు, ఫిట్నెస్ సెంటర్లు, స్కూల్స్, కాలేజీల్లో ఈ తరహా ఉద్యోగాలు లభిస్తాయి. నెలకు రూ.5 వేల-రూ.10 వేల వరకు ఆదాయం లభిస్తుంది. -
రాయండి... రాయండి!
మన కోసం... ఈ సాంకేతిక యుగంలో యువత పెన్ను పట్టుకోవడం అనేది అరుదైన విషయంగా మారింది. సాంకేతికంగా ఎంత ముందంజలో ఉన్నా... కొన్ని అలవాట్లను మాత్రం అందులో నుంచి మినహాయించుకోవాలి.కాగితం మీద కలంతో రాయడం అనేది అందులో ఒకటి. మీ మనసులో రకరకాల భావాలు ఉండవచ్చు. అభిప్రాయాలు ఉండవచ్చు. వాటిని కాగితం మీద రాస్తూ ఉండండి. కంప్యూటర్ మీద టైప్ చేయడం కన్నా కలంతో రాయడంలోని మజాను అనుభవించండి. - హృతిక్ రోషన్, హీరో