
ప్రతీకాత్మక చిత్రం
ముంబై: మాస్క్ ధరించలేదని ఓ మహళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కానిస్టేబుల్.. ప్రజలకు నీతి విషయాలు బోధించాల్సిన వ్యక్తే ఇలా నీచమైన పనికి దిగజారడంతో ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. గతేడాది జరిగిన ఈ దారుణ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. 2020 లాక్‌డౌన్ సమయంలో 33 ఏళ్ల వివాహితను పాల్సానాలో పాలకోసం ముఖానికి మాస్క్ లేకుండా బయటికి వచ్చింది. ఈ విషయం గమనించిన నరేశ్ కపాడియా అనే కానిస్టేబుల్ ఆమెపై అనుచితంగా ప్రవర్తించాడు. తనకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటానని బెదిరించి అక్కడినుంచి అపహరించాడు. మహిళను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తానని చెప్పి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి నగ్నంగా ఉంచి ఆమెపై చేయి చేసుకున్నారు. నిందితుడు సూరత్‌లోని ఉమర్‌పాడ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు.
అంతేగాక మహిళకు చెందిన ప్రైవేటు ఫోటోలను తీసుకుని వాటిని బయపట పెడతానని బ్లాక్‌మెయిల్ చేసి కొన్ని నెలలపాటు తనపై అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. దీంతో బాధితురాలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే కానిస్టేబుల్ భార్య మహిళకు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం బాధితురాలు కేసు నమోదు చేసింది.. మహిళ, తన భర్తతో కలిసి ఇంటికొచ్చి తమను కులం పేరుతో ఇష్టం వచ్చినట్లు దూషించేవారని కానిస్టేబుల్ భార్య ఆరోపించింది. ఈ విషయంపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో వారిద్దరిపై షెడ్యూల్ కులాలు, తెగల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇలా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్న ఈ కేసులో ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. నిందితుడు పోలీసు, మహిళతో ఒకరు ఎఫైర్ కలిగి ఉన్నట్లు తెలుస్తోందని అన్నారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని.. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment