'56 అంగుళాల ఛాతి అవసరం లేదు' | I want reservation, not 56-inch chest: Hardik Patel | Sakshi
Sakshi News home page

'56 అంగుళాల ఛాతి అవసరం లేదు'

Published Fri, Jul 15 2016 1:37 PM | Last Updated on Mon, Sep 4 2017 4:56 AM

I want reservation, not 56-inch chest: Hardik Patel

సూరత్: తమ సామాజిక వర్గానికి రిజర్వేషన్ కల్పించాల్సిందేనని పటేల్ వర్గం రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు హార్థిక్ పటేల్  పునరుద్ఘాటించారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ... 'మాకు రిజర్వేషన్లు కావాలి. 56 అంగుళాల ఛాతి అవసరం లేదు. రిజర్వేషన్ల సాధన కోసం మా సామాజిక వర్గంతో కలిసి పనిచేస్తాను. ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నా'నని హార్థిక్ పటేల్ అన్నారు.

లజ్పోర్ జైలు నుంచి విడుదలైన హార్థిక్ పటేల్ శుక్రవారం మధ్యాహ్నం సూరత్ లో రోడ్ షో నిర్వహించారు. పటేల్ సామాజిక వర్గం ఎక్కువగా నివసించే ప్రాంతాల మీదుగా రోడ్ షో సాగింది. అతడి రోడ్ షో కు పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా బాధ్యత వహించాల్సి ఉంటుందని నిర్వాహకులను హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement