సూరత్ లో ముగ్గురి దారుణ హత్య
Published Sun, May 15 2016 8:58 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
సూరత్: గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా దాడి చేయగా ముగ్గురు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన గుజరాత్ లోని సూరత్ లో శనివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. సూరత్ మున్సిపల్ కార్పోరేషన్ ప్రతిపపక్ష నాయకుడు ప్రఫుల్ తొగాడియా సోదరుడు భరత్ తోగాడాయాను, బాలు హిరాణి, అశోక్ పటేల్ అనే వ్యక్తులను దాడి చేసి నరికి చంపారు. గాయపడిన మరో వ్యక్తి దినేష్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
అశ్వినీ కుమార్ రోడ్ లో ముగ్గురిని గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపారని, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారని సూరత్ డీసీపీ జగదీష్ పటేల్ తెలిపారు. కేసును నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. మృతి చెందిన భరత్ తొగాడియా విశ్వహిందూ పరిషత్ నేత ప్రవీణ్ భాయ్ తొగాడియా బందువు.
Advertisement
Advertisement